• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనాతో పాటు సీజనల్ వ్యాధులు, కొత్త ఇన్ఫెక్షన్లు ముప్పేట దాడి : హెల్త్ అలెర్ట్ .. బీ కేర్ ఫుల్ !!

|

వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇప్పుడు దేశానికి కొత్త భయం పట్టుకుంది. ఒకపక్క కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితులతో పాటుగా, కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్, బోన్ డెత్ వంటి ఇతర ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతున్నాయి. ఇదే సమయంలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు కూడా పెద్ద ఉపద్రవంలా తయారయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు .. కేంద్రం పదేపదే చెప్పటానికి కారణాలు ఇవే !!కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు .. కేంద్రం పదేపదే చెప్పటానికి కారణాలు ఇవే !!

 అసలే వర్షాకాలం .. ఆపై సీజనల్ వ్యాధుల భయం

అసలే వర్షాకాలం .. ఆపై సీజనల్ వ్యాధుల భయం

వర్షాకాలంలో సహజంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లతోపాటు రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లుఎంజా వంటివి ప్రజలను ఇబ్బంది పెడతాయి. అయితే ఇంకా కరోనాకేసులు నమోదవుతున్న కారణంగా సీజనల్ వ్యాధులపై కూడా దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సీజనల్ వ్యాధులు కరోనా మహమ్మారి బారిన పడడానికి కారణం కావచ్చని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా దేశంలో ఆరోగ్య సంక్షోభం నెలకొన్న సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

 సీజనల్ వ్యాధులు విషయంలో జాగ్రత్త అవసరం .. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు

సీజనల్ వ్యాధులు విషయంలో జాగ్రత్త అవసరం .. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు

అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండే అవసరం ఎంతైనా ఉందని, ఇక సీజనల్ వ్యాధులు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ముఖ్యంగా మలేరియా ,డెంగ్యూ, చికున్ గున్యా, క్షయ, ఇన్ఫ్లుఎంజా, హెచ్ఐవి, ఫంగల్ ఇన్ ఫెక్షన్లు పోస్ట్ కోవిడ్ బాధితులలో విజృంభించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

సీజనల్ వ్యాధుల వల్ల కూడా కరోనా బారిన పడే ప్రమాదం

సీజనల్ వ్యాధుల వల్ల కూడా కరోనా బారిన పడే ప్రమాదం

ఇక సీజనల్ వ్యాధుల బారిన పడిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల మళ్లీ కరోనా బారిన పడే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తుంది. ఇక కరోనా బాధితులలో ఈ ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని ముందు దశలోనే గుర్తించడం వల్ల వారి ప్రాణాలను కాపాడటానికి అవకాశం ఉంటుందని, చికిత్సలపై మార్గదర్శకాలను కూడా జారీ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇక సీజనల్ వ్యాధుల కాలంలో ఏ ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయో గుర్తించి, ముందస్తు ప్రణాళికను రూపొందించుకొని తద్వారా చికిత్స అందించాలని డబ్ల్యూహెచ్వో ఆదేశించింది.

 అవసరం అయితేనే యాంటీ బయాటిక్స్ .. ఆరోగ్య సంక్షోభంపై డబ్ల్యూ హెచ్ ఓ వార్నింగ్

అవసరం అయితేనే యాంటీ బయాటిక్స్ .. ఆరోగ్య సంక్షోభంపై డబ్ల్యూ హెచ్ ఓ వార్నింగ్

కరోనా మహమ్మారితో పాటుగా ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారికి అవసరమైతే తప్ప యాంటీబయాటిక్స్ ఇవ్వవద్దని సూచించింది. వారం రోజులకు మించి ఎవరూ యాంటిబయాటిక్స్ వాడొద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుంది.ఒకపక్క సీజనల్ వ్యాధులు దాడి చేసిన సమయంలో, కరోనా కేసులు కూడా నిత్య నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా లేకుంటే మరింత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పదే పదే ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలోనైనా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

  Dr. Lasya Sai Sindhu, ENT and neurologist, said that doctors work hard to save the lives of patients
   హెల్త్ అలెర్ట్ ... బీ కేర్ ఫుల్ !!

  హెల్త్ అలెర్ట్ ... బీ కేర్ ఫుల్ !!

  ఆరోగ్యం విషయంలో తస్మాత్ జాగ్రత్త అని నిపుణులు చేస్తున్న హెచ్చరికలను పరిగణలోకి తీసుకొని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాంతకమైన వ్యాధుల నుండి రక్షణ పొందే వీలుంటుంది. ఇప్పటికే దేశం కరోనా దెబ్బకు విలవిలలాడిన నేపధ్యంలో, మరింత ఆరోగ్య సంక్షోభంలో పడకుండా బీ కేర్ ఫుల్!!

  English summary
  With the onset of the monsoon season a new fear now gripped the country. In addition to the conditions under which corona cases are being reported, those recovering from the corona are suffering from other infections such as black fungus and bone death. At the same time, seasonal diseases during the monsoon season also appear to be a major problem. WHO also alert on this.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X