వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ‌ప‌క్షాల‌కు అంత స‌త్తా ఉందా, ప‌వ‌న్ కిం క‌ర్త‌వ్యం : జ‌న‌సేన‌కు న‌ష్ట‌మా..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో వామ‌ప‌క్షాల సత్తా ఎంత‌. ఎన్ని సీట్ల‌లో పోటీ చేయాల‌ని. ప‌వ‌న్ తో పొత్తు ఖాయ‌మైనా సీట్ల వ‌ద్ద ముడి పడింది. ఏపి లో ప‌వ‌న్ తో క‌లిసి పోటీ చేస్త‌న్న వామ‌ప‌క్షాలు అన్ని సీట్లు ఎలా అడిగారు. ప‌వ‌న్ ఆలోచ‌న ఏంటి. వారికి ఎన్ని సీట్లు ఇవ్వా ల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. ఇంత‌కీ..జ‌న‌సేన - వామ‌ప‌క్షాల మ‌ధ్య ఏం జ‌రుగుతోంది...ఇది జ‌న‌సేన‌కు లాభ‌మా న‌ష్టామా..

వామ‌ప‌క్షాలు ఎన్ని సీట్లు కావాల‌న్నాయి..

వామ‌ప‌క్షాలు ఎన్ని సీట్లు కావాల‌న్నాయి..

జ‌న‌సేన - వామ‌ప‌క్షాల మ‌ధ్య పొత్తుల పంచాయితీ మొద‌లైంది. ఎన్నిక‌లు స‌మీపిస్త‌న్న వేళ‌..సీట్ల పంప‌కాల పై నిర్ణ‌యాని కి వ‌స్తే...ఎన్నిక‌ల క‌ద‌న రంగంలోకి దిగ‌చ్చ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ భావిస్తున్నారు. అందులో భాగంగా.. వామ‌ప‌క్షాల‌తో క‌లిసి పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌..వారికి కేటాయించే సీట్ల పై చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. తొలి విడ‌త చ‌ర్చ‌ల్లో ప‌వ‌న్ తో స‌మావేశ‌మైన వామ‌ప‌క్షాలు రెండు పార్టీలకు సీట్ల సంఖ్య అనుకూలంగా ఉండేలా చూడాల‌ని కోరారు. దీని పై ప‌వ‌న్ సైతం ఎక్క‌డ సీట్లు కోరుకుంటున్నారు..అక్క‌డ పార్టీ బ‌లాబ‌లాలు ఏంటో వివ‌రించాల‌ని సూచించారు. దీనికి త‌గిన‌ట్లుగానే వామ ప‌క్ష పార్టీల ఏపి కార్య‌ద‌ర్శులు ఇద్ద‌రూ ఇచ్చిన లిస్టు చూసి ఒక ర‌కంగా జ‌న‌సేన నేత‌లు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఏపిలో త‌మ రెండు పార్టీల‌కు క‌లిపి చెరి ముప్పై స్థానాల చొప్పున 60 స్థానాలు ఇవ్వాల‌ని కోరాయి. దీంతో..నిజంగా వామ‌ప‌క్షాల‌కు అన్ని సీట్లు కేటాయిస్తే మ‌రి జ‌న‌సేన మిగిలిన 115 స్థానాల్లో పోటీకి ప‌రిమితం కావాలా అంటూ జ‌న‌సేన నేత‌లు కొంద‌రు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

ప‌వ‌న్ ఏం చేస్తారు..ఎన్నిస్తారు..

ప‌వ‌న్ ఏం చేస్తారు..ఎన్నిస్తారు..

ఏపిలో వామ‌ప‌క్షాలు మిన‌హా మ‌రే పార్టీతో పొత్తు ఉండ‌ద‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాన్‌..ఇప్పుడు సీట్ల కేటాయింపుల పై దృష్టి సారించారు. వామ‌ప‌క్షాలు త‌మ‌కు 60 సీట్లు కావాల‌ని కోరుతున్నా..ప‌వ‌న్ నిర్ణ‌యం కీల‌కం కానుంది. రాష్ట్ర విభ‌జ న త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్ష పార్టీల‌కు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా వ‌చ్చిన ఓట్ల వివ‌రాల‌ను సేక‌రించారు. దీని ప్ర‌కారం ప్ర‌జ‌ల్లో బ‌లం ఉన్న‌ట్లుగా క‌నిపించిన నియోజ‌క‌వ‌ర్గాలు..త‌మ స‌ర్వేల్లో తేలిన ఫ‌లితాల ఆధారంగా వామ‌ప‌క్ష పార్టీల‌కు సీట్లు ఇవ్వాల‌నేది జ‌గ‌న్ అభిప్రాయంగా క‌నిపిస్తోంది. రెండు పార్టీల‌కు క‌లిపి 25 సీట్ల వ‌ర‌కు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని..దీనికి త‌గిన‌ట్లుగానే ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో పోటీకి సిద్దం అవుతున్నార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు ఏపిలో ఉన్న రాజ‌కీయాల్లో ప్ర‌తీ సీటు కీల‌క‌మేన‌ని..వామ‌ప‌క్షాల బ‌లం ఎక్కువ‌గా అంచ‌నా వేస్తే జ‌న‌సేన పార్టీకే న‌ష్ట‌మ‌ని ఆ పార్టీ ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో..పూర్తిగా రెండు వామ‌ప‌క్ష పార్టీల‌కు క‌లిపి 20 లోపే సీట్లు కేటాయించాల‌ని వారు సూచిస్తున్నారు.

వారివి తేలితే..ఇక అభ్య‌ర్ధుల పై దృష్టి..

వారివి తేలితే..ఇక అభ్య‌ర్ధుల పై దృష్టి..

మిత్ర‌ప‌క్షం గా జ‌న‌సేన‌తో క‌లిసి రంగంలోకి దిగుతున్న వామ‌ప‌క్ష పార్టీల‌కు సీట్లు..స్థానాలు ఖార‌రైతే..ఇక‌, జ‌న‌సేన పార్టీ నుండి అభ్య‌ర్ధుల ఎంపిక పై దృష్టి పెట్టాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. ఈ సారి ఎన్నిక‌ల్లో ఎక్కువ‌గా యువ‌త‌కు ప్రాధాన్య త ఇవ్వాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో...సామాజిక స‌మీక‌ర‌ణాలు అన్నింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఆ త‌రువాత అభ్య‌ర్ధుల పై స‌ర్వేలు నిర్వ‌హించి..ఆ త‌రువాత మాత్ర‌మే అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న నిర్ణ‌యం ఉంటుంద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఎలాగైనా ఫిబ్ర‌వ‌రి 15 నాటికి జ‌న‌సేన అభ్య‌ర్ధుల ఎంపిక ఓ కొలిక్కి తేవాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాన్ భావి స్తున్నారు. ఇత‌ర పార్టీల నుండి వ‌చ్చే నేత‌ల పై ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త ఉండ‌టంతో..దీనిని సైతం దృష్టిలో పెట్టుకొని ప‌వ‌న్ అభ్య‌ర్ధుల పై ఆచి తూచి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ప్ర‌జారాజ్యంలో జ‌రిగిన పొర‌పాట్లు పున‌రావృతం కాకుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. దీంతో..ప‌వ‌న్ వేస్తున్న అడుగులు ఆస‌క్తి క‌రంగా మారాయి.

English summary
Communist praties alliance with Janasena in AP. In Seats allotment discussions communist leaders proposed 30 seats for each party. Now, Janasena Chief planning for party congtesting seats. By Feb 15th pawan wants to clear the contesting seats and candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X