వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో శానిటైజర్లకు బానిసలవుతున్న మందుబాబులు ..144 మందికి ఎస్ఈబీ అధికారులు కౌన్సిలింగ్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో మద్యం కొనుగోలు చేయలేని మందుబాబులు శానిటైజర్, నాటుసారా వంటి వాటికి బానిసలవుతున్నారు. ఇప్పటికే ఏపీలో శానిటైజర్ లు తాగి చాలా మంది మృత్యువాత పడ్డారు. చాలామంది ఇంకా శానిటైజర్ లకు బానిసలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఈబీ రంగంలోకి దిగింది .

Recommended Video

Consuming Hand Sanitisers : శానిటైజర్ లు ఇలా కూడా వాడేస్తున్నారు ! || Oneindia Telugu
ఏపీలో ఎస్ఈబీ అధికారుల దూకుడు

ఏపీలో ఎస్ఈబీ అధికారుల దూకుడు

రాష్ట్ర వ్యాప్తంగా శానిటైజర్ అమ్మకాలు జరుపుతున్న షాపులు, మద్యం బెల్ట్ షాపులు, నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించిన ఎస్ఈబీ అధికారులు ఈ దాడులలో రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న 345 ప్రాంతాలను గుర్తించారు. మద్యం బెల్ట్ షాపులు, నాటు సారా తయారీ కేంద్రాలపై కేసు నమోదు చేశారు. అలాగే శానిటైజర్ లు తాగుతున్న 144 మందిని పట్టుకున్న అధికారులు వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు.

శానిటైజర్స్, నాటు సారాకు అలవాటు పడిన వారికి కౌన్సిలింగ్

శానిటైజర్స్, నాటు సారాకు అలవాటు పడిన వారికి కౌన్సిలింగ్

శానిటైజర్ లు తాగడం వల్ల ఎంతగా ప్రమాదం ఉంటుందో, ఆరోగ్యం ఎంతగా పాడవుతుందో వారికి వివరంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో,మద్యం అమ్మకాలపై కఠిన నిబంధనలు విధించింది. అంతేకాదు మద్యం ధరలను కూడా విపరీతంగా పెంచేసింది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలు మూసివేయడంతో చాలామంది నాటుసారాకు,శానిటైజర్ లకు బానిసలుగా మారారు.

నిబంధనలు పాటించని శానిటైజర్ తయారీ దారులు 76 మందిపై కేసులు

నిబంధనలు పాటించని శానిటైజర్ తయారీ దారులు 76 మందిపై కేసులు


మద్యం దుకాణాలు తిరిగి తెరిచినప్పటికీ ఏపీ ప్రభుత్వం విపరీతంగా మద్యం ధరలు పెంచడంతో మద్యం కొనుగోలు చేయలేక శానిటైజర్ లనే తాగుతున్న పరిస్థితి కొనసాగుతోంది.
దీంతో రంగంలోకి దిగిన ఎస్ఈబీ అధికారులు శానిటైజర్ తయారీ కేంద్రాల లైసెన్సులను పరిశీలించి వారికి హెచ్చరికలు జారీ చేశారు.నిబంధనలకు వ్యతిరేకంగా శానిటైజర్ లను తయారు చేస్తున్న 76 మందిపై కేసులు నమోదు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 3936 మంది బైండోవర్ .. 1241 మందికి కౌన్సిలింగ్

రాష్ట్రవ్యాప్తంగా 3936 మంది బైండోవర్ .. 1241 మందికి కౌన్సిలింగ్

శానిటైజర్ లను తరచుగా కొనుగోలుచేసే వారిపై దృష్టి పెట్టాలని, అలాంటివారికి శానిటైజర్ లను అమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో వివిధ కేసుల్లో మొత్తం 3936 మందిని బైండోవర్ చేసి 1241 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఎస్ఈబీ అధికారులు. మరోపక్క ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని ఎక్కడికక్కడ పట్టుకుంటూనే శానిటైజర్ లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారిపై కూడా దృష్టి పెట్టారు.

English summary
SEB officials conducted raids on shops selling illegal liquor, liquor belt shops and sanitizers manufacturing centers across the state and identified 345 areas across the state where liquor was being smuggled illegally. The case was registered against liquor belt shops and breweries. Authorities also arrested 144 people who were drinking sanitizers and gave them counseling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X