వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాలంటీర్లకు ఎస్ఈసి వార్నింగ్ .. వాలంటీర్లు ఎవరైనా విధుల్లో పాల్గొంటే కఠిన చర్యలు

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ దూకుడుగా ముందుకు వెళుతుంది . ఎన్నికల నిర్వహణ సజావుగా సాగాలని పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న ఎన్నికల కమిషన్ వార్డు వాలంటీర్ లను ఎన్నికలకు దూరంగా ఉండాలని సూచించింది. అంతేకాదు వారి వద్ద ఉన్న ఫోన్ లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఇక ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసినప్పటికీ ఏపీ హైకోర్టు ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఏపీలో ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది.

వాలంటీర్లకు ఎన్నికల విధులొద్దు: ఎస్పీ, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో నిమ్మగడ్డవాలంటీర్లకు ఎన్నికల విధులొద్దు: ఎస్పీ, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో నిమ్మగడ్డ

 మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు దూకుడు పెంచిన ఎస్ఈసి

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు దూకుడు పెంచిన ఎస్ఈసి


ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వాలంటీర్లు ఎవరైనా విధులు నిర్వర్తిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వార్డు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయడం, ప్రలోభ పెట్టడం, లేదా అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించడం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది .

వాలంటీర్లు ఎన్నికల్లో జోక్యం చేసుకుంటే ఫిర్యాదు చెయ్యాలన్న ఎన్నికల సంఘం

వాలంటీర్లు ఎన్నికల్లో జోక్యం చేసుకుంటే ఫిర్యాదు చెయ్యాలన్న ఎన్నికల సంఘం


వాలంటీర్ల వ్యవహారాలకు సంబంధించి రాజకీయ పార్టీలు , ప్రజలు ఇప్పటికే చాలా మేరకు ఫిర్యాదు చేశారని, గత ఎన్నికల సమయంలోనే దాదాపు 600 పైగా వాలంటీర్ల పై ఫిర్యాదులు అందాయని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ ఎన్నికలలో వాలంటీర్లు జోక్యం చేసుకుంటే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది.

ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ 24 గంటలు పని చేస్తుందని, ఎన్నికల నియమావళి భిన్నంగా ఏ వాలంటీర్లు పనిచేస్తున్నా కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ 0866 2466877 కు ఫిర్యాదు చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

జిల్లాల వారీగా ఫిర్యాదులకు కాల్ సెంటర్లు , 24 గంటలు అందుబాటులో

జిల్లాల వారీగా ఫిర్యాదులకు కాల్ సెంటర్లు , 24 గంటలు అందుబాటులో


అధికారులు ఫిర్యాదులను తక్షణం పరిశీలించి చర్యలు తీసుకుంటారని స్పష్టం చేసింది. ఇక జిల్లాల వారీగా కలెక్టర్ల కార్యాలయాలలోను, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనూ ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించటం కోసం, ఓటర్లలో విశ్వాసం కల్పించడం కోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హైకోర్టు కూడా ఎన్నికల సంఘం నిర్ణయంతో ఏకీభవించడంతో వాలంటీర్ల విషయంలో కఠినంగా వ్యవహరించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం.

English summary
The state Election Commission has said that volunteers should immediately lodge a complaint if anyone performs duties contrary to the Code of Conduct for Elections. Under no circumstances should ward volunteers be allowed to participate in election duties. It warned that tough action would be taken if anyone violated the rules and intimidated, or campaigned in favor of the ruling party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X