అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడున్నరేళ్లు హుష్ కాకి! ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. డిజైన్లు కూడా సిద్ధంగానీ ‘అమరావతి’

రాజధాని ‘అమరావతి’ నిర్మాణం విషయమై ఏపీ సర్కార్ అనునిత్యం గడువులు మార్చడంతోనే మూడున్నరేళ్ల కాలం గడిపేసింది. తాజాగా బాహుబలి దర్శకుడు రాజమౌళి సలహాల మేరకు వివిధ దేశాల్లోని ప్రధాన నగరాలను ఒక అధ్యయన బ్రుందం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి/ హైదరాబాద్: 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' అన్నట్లు రాజకీయ పార్టీల అధినేతలు అందునా ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీ వారు చెబుతున్నట్లు 'అదిగో అంటే ఆరు నెలలు' అన్నట్లు భావించాలేమో. సరిగ్గా రెండేళ్ల క్రితం అట్టహాసంగా, భారీస్థాయి ప్రచారం మధ్య 2015 అక్టోబర్ 22వ తేదీ (విజయదశమి)న ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని 'అమరావతి' నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. దీనికే నాడు చంద్రబాబు ప్రభుత్వం రమారమీ రూ.25 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కానీ సీఎం చంద్రబాబు అట్టహాసంగా చేపట్టిన 'అమరావతి నిర్మాణం' ఏళ్లు గడుస్తున్నా ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ఒక ఇటుక కూడా పేర్చలేదంటే అతిశయోక్తి కాదు. పదే పదే గడువులు నిర్దేశించడం మినహా ఏపీ రాజధాని నిర్మాణంలో ఎటువంటి పురోగతి లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అమరావతి నగర నిర్మాణ శంకుస్థాపన దృశ్యాల ఫొటోలు, వీడియోలు తప్ప ఇప్పుడు అక్కడేమీ కనిపించడం లేదు. ఐదేళ్లలో రాజధాని నిర్మిస్తామని ప్రకటించి, శంకుస్థాపన చేసి రెండేళ్లు పూర్తయినా.. ఇప్పటికీ డిజైన్లు కూడా ఖరారు కాని దుస్థితి ఆంధ్రులదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర రాజధాని నగర నిర్మాణ సన్నాహాల పేరిట నిధులు దారాళంగా ఖర్చు చేయడం మినహా వాస్తవంగా రియల్ ఎస్టేట్ డీలర్లకు మాత్రమే భారీగా లబ్ది చేకూరిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి

ఎన్నికల నాటికి పాక్షికంగా నిర్మాణాలు?

ఎన్నికల నాటికి పాక్షికంగా నిర్మాణాలు?

అప్పుడూ ఇప్పుడూ ‘అమరావతి' నగర నిర్మాణంతో ఆంధ్రులందరికీ సింగపూర్ లేదంటే మాన్‌హట్టన్ తరహ నగరాన్ని తీసుకొస్తామని ప్రజల్లో భ్రమలు కల్పిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. అయితే గియితే భారీ వర్షాలు కురిసినప్పుడల్లా గత మూడేళ్లలో ఆగమేఘాలపై నిర్మించిన తాత్కాలిక సచివాలయ భవనం, అసెంబ్లీ భవనంపై కప్పు నుంచి నీరు లీకవుతూ ఉంటుంది మరి. రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న వేల ఎకరాల భూమిని చౌక ధరలకు కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులకు కేటాయించడం తప్ప సాధించిన పురోగతి ఏమీ లేదని ఏపీ వాసులు నోళ్లు నొక్కుకుంటున్నారు. ఇప్పటికీ అమరావతి నగర నిర్మాణ డిజైన్లు ఖరారైతే గానీ కొంత నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ జమిలీ ఎన్నికల నాటికి అమరావతి నగరంలో పాక్షికంగా పనులు జరిగిన నిర్మాణాలు కనిపిస్తాయని అంతా భావిస్తున్నారు.

Recommended Video

Jio Amaravati Marathon 2017” in Vijayawada - అమరావతి మారథాన్ - Oneindia Telugu
మూడేళ్లలో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం మాత్రమే పూర్తి

మూడేళ్లలో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం మాత్రమే పూర్తి

2014, అక్టోబర్‌ 25వ తేదీనాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలైంది. అప్పట్లోనే గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలో నూతన రాజధానిని నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. సరిగ్గా ఐదేళ్లు తిరిగే లోపే కళ్లు మిరిమిట్లు గొలిపే ఏపీ రాజధాని కల సాకారం అవుతుందని పేర్కొన్నా గత మూడేళ్లల్లో, చూపడానికి రెండు తాత్కాలిక భవనాలు (అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం) తప్ప ఇంకేమీ నిర్మించలేకపోయారు. కాకపోతే అవి కూడా రాజధాని నిర్మాణంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలేనని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పీ నారాయణ చెప్తుంటారు. కేంద్రానికి మాత్రం అసలు సిసలు సచివాలయం, అసెంబ్లీ భవనాలివేనని నివేదికలు పంపారు మరి. గత ఏడాది అక్టోబర్‌ 9న సీఎం చంద్రబాబు ప్రజలకు రాసిన బహిరంగ లేఖలోనూ ‘వచ్చే ఏడాది దసరా (ఈ ఏడాది సెప్టెంబర్ 30) నాటికి అమరావతికి ఒక రూపు ఏర్పడుతుంది' పేర్కొన్నారు. కానీ ఆయన చెప్పిన దసరా కూడా మొన్నే వెళ్లిపోయింది. కనీసం ఒక రూపు ఏర్పడే మాట సంగతి పక్కనబెడితే ‘సీడ్‌ క్యాపిటల్‌ను అనుసంధానం చేసే 18 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం సైతం పూర్తి కాలేదు. కాకపోతే అంతర్గత రోడ్ల నిర్మాణం మాత్రం పూర్తయింది. ఏపీ సర్కార్ ప్రవచిత ‘ల్యాండ్ ఫూలింగ్' విధానంలో ప్రభుత్వానికి వేల ఎకరాల భూములు అప్పగించిన రైతులైతే వ్యవసాయ పనులు నిలిపేయడంతో సోమరులు మారుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గత ఫిబ్రవరిలో మంత్రి నారాయణ ఇలా గడువులు

గత ఫిబ్రవరిలో మంత్రి నారాయణ ఇలా గడువులు

చంద్రబాబు ప్రభుత్వం 2016, మార్చి 25న అమరావతి నిర్మాణ మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా మాకీ అసోసియేట్స్‌ పేరును ప్రకటించింది. ఆ సంస్థ ఇచ్చి డిజైన్ల ఆధారంగా అదే ఏడాది జులైలో పనులు ప్రారంభిస్తామని చెప్పింది. అంతలోనే కిరికిరి తలెత్తడంతో ‘మాకీ' సంస్థతో ఒప్పందాలను చంద్రబాబు ప్రభుత్వం రద్దుచేసుకుంది. తర్వాత బ్రిటన్ సంస్థ ఫోస్టర్ రూపొందించిన డిజైన్ ఏపీ సీఎం చంద్రబాబుకు నచ్చలేదు. కానీ ఈ లోగా గత ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పీ నారాయణ అమరావతి నగర నిర్మాణానికి సరికొత్త గడువులు నిర్దేశించారు. గత జూలైలో పనులు ప్రారంభించి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ‘భవనాల' వారీగా గడువులు పెట్టారు. గత మే 30వ తేదీన సచివాలయ నిర్మాణం మొదలై వచ్చే ఏడాది డిసెంబర్ 25 నాటికి పూర్తవుతుందని పేర్కొన్నారాయన. ఇక శాసనసభా భవన నిర్మాణం జూలై 20 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ నాలుగో తేదీలోపు, హైకోర్టు భవన నిర్మాణం ఆగస్టు 17వ తేదీన మొదలై 2019 ఏప్రిల్ మూడో తేదీన పూర్తవుతుందని మంత్రి నారాయణ గడువులు నిర్దేశించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం.. అందుకే జాప్యం

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం.. అందుకే జాప్యం

మాకీ సంస్థతో కాంట్రాక్టు రద్దు చేసుకున్న కొన్ని నెలల స్థబ్ధత తర్వాత బ్రిటన్‌కు చెందిన ఫోస్టర్‌ సంస్థను మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫోస్టర్‌ ఇచ్చిన డిజైన్లను.. మొదట్లో మెచ్చుకున్న చంద్రబాబు.. రోజు గడవకముందే అసంతృప్తిని వెళ్లగక్కారు! ఆ డిజైన్లు మరింత ఆకర్షణీయంగా రూపొందించేందుకు సాయం చేయాలని ‘బాహుబలి' సినీ దర్శకుడు రాజమౌళిని ప్రభుత్వం సంప్రదించింది. దీంతో డిజైన్ల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లైంది. అధికారుల బ్రుందం ప్రస్తుతం వివిధ దేశాల నగరాల పర్యటనల్లో ఆయా నగరాల ఆక్రుతుల పరిశీలనలో నిమగ్నమైంది. ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతులు, సీఆర్డీయే శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాటల్లో చెప్పాలంటే అమరావతి నగర నిర్మాణానికి తొందరేం లేదన్నారు. తాము అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగర నిర్మాణం చేపడుతున్నందున జాప్యం అనివార్యమన్నారు. అందుకే డిజైన్ల ఖరారులో రాజీ పడటం లేదన్నారు.

కేంద్రం ఇలా రూ.1500 కోట్ల నిధులు కేటాయింపు

కేంద్రం ఇలా రూ.1500 కోట్ల నిధులు కేటాయింపు

నిజానికి ఏపీ చంద్రబాబు కూడా ‘అమరావతి నిర్మాణానికి తొందరేముంది?' అని పలుమార్లు వ్యాఖ్యానించారు. ‘ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా అమరావతి నగరాన్ని నిర్మించాలని మేం తలపెట్టాం. కనుక తొందరేం లేదు' అని పేర్కొన్నారు. తాజాగా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు దుబాయిలోని వ్యాపార, పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలోనూ ప్రపంచస్థాయి ఆర్కిటెక్టులతో రాజధాని డిజైన్లు రూపొందిస్తామని, రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. నూతన రాజధానిలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కాంప్లెక్స్‌, రాజ్‌భవన్‌ లాంటి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఇప్పటిదాకా రూ.1,500 కోట్లను ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసింది. కానీ ఆ నిధులను చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక నిర్మాణాలు, వేర్వేరు పనులకు వినియోగించింది. కేంద్రం ఇచ్చిన నిధులతో తాత్కాలిక భవనాలు కట్టామని చూపిన టీడీపీ సర్కార్.. ఇకపై నిర్మించాల్సిన శాశ్వత భవనాల నిర్మాణాలకు అవసరమైన డబ్బు కోసం వెంపర్లాట మొదలుపెట్టింది.

100 కోట్ల డాలర్ల రుణానికి సరేనన్న ప్రపంచ బ్యాంకు

100 కోట్ల డాలర్ల రుణానికి సరేనన్న ప్రపంచ బ్యాంకు

మూడున్నరేళ్లు పూర్తయిన తర్వాత శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, కట్టడానికి ఖర్చయ్యే రూ.1000 కోట్లపైనే! ప్రపంచ బ్యాంకు నుంచి ఒక బిలియన్‌ డాలర్ల సొమ్మును అప్పుగా తీసుకుంటామని, ఆ మేరకు వరల్డ్‌ బ్యాంక్‌ అంగీకరించిందని సర్కారు చెబుతోంది, ఇప్పటిదాకా సింగిల్ డాలర్ కూడా ప్రపంచ బ్యాంక్ విదల్చలేదు. ఇదిలా ఉంటే నిధులు లేని కారణంగా నిర్మాణం నిలిచిపోయిందనే మాటలో నిజం లేదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నిధుల కొరత లేనే లేదని వాదించారు. ఇదిలా ఉంటే అమరావతి నిర్మాణానికి 56.66 లక్షల ఇటుకలు సమకూరాయి. అదెలా అంటే రాజధాని నిర్మాణంలో ‘మీ వంతు భాగస్వామ్యం' అంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై స్పందించిన సుమారు 2.27 లక్షల మంది జనం.. ఒక్కోటి రూ.10 చొప్పున 55.66 లక్షల ఈ-ఇటుకలను అమరావతి కోసం కొని ఉంచారు. వాటితోపాటు అన్ని ఊళ్ల నుంచి సేకరించిన పవిత్ర జలం, మట్టి మూటలను భద్రంగా దాచి ఉంచారు.

English summary
It was on October 22 in 2015 that Prime Minister Narendra Modi laid foundation stone for Amaravati, the new capital city of Andhra Pradesh, amidst a lot of fanfare and massive publicity.The Chandrababu Naidu government is learnt to have spent over Rs 25 crore just for the foundation stone laying function.The people were given the impression that the entire area would transform into another Singapore or Manhattan within no time. But what was witnessed in the last two years was virtually nothing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X