వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో విడత వైఎస్సార్ వాహనమిత్ర .. ప్రారంభించిన సీఎం జగన్.. ఆటో,ట్యాక్సీవాలాల ఖాతాలకు రూ.10వేలు

|
Google Oneindia TeluguNews

ఆటోలు, టాక్సీలు నడుపుతూ జీవనం సాగించే వారి కోసం వైసిపి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైయస్సార్ వాహన మిత్ర పథకంలో నేడు రెండో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాలలో వేసి ప్రారంభించారు ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. రెండో విడత వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి ప్రారంభించిన ఆయన ఆటో ,టాక్సీ ఉన్న వారికి రెండో విడతగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

Recommended Video

AP CM Jagan Launches YSR Vahana Mithra| Rs.10,000 to Auto, Taxi Drivers Beneficiaries

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఏడాది ... నేడు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎంవైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఏడాది ... నేడు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం

 రాష్ట్ర వ్యాప్తంగా 2,62,493 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం

రాష్ట్ర వ్యాప్తంగా 2,62,493 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం

రాష్ట్ర వ్యాప్తంగా 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా 10 వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ కానుంది. ఆటోలు, టాక్సీలు కలిగివున్న లబ్ధిదారులకు టాక్స్ లు , ఇన్సూరెన్స్ చెల్లించడానికి , మరియు వాహనాల మరమ్మత్తు నిమిత్తం ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు అందజేస్తానని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు కార్యక్రమాన్ని ప్రారంభించడంతో ఈ ఏడాదికి సంబంధించి పది వేల రూపాయల నగదు లబ్ధిదారుల ఖాతాలలో నేడు జమ అవుతోంది.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 37,756 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలుస్తుంది.

ఎక్కడి వారు అక్కడ నుండే దరఖాస్తులు .. అత్యధిక దరఖాస్తులు శ్రీకాకుళం జిల్లాలోనే

ఎక్కడి వారు అక్కడ నుండే దరఖాస్తులు .. అత్యధిక దరఖాస్తులు శ్రీకాకుళం జిల్లాలోనే

ఇక వాహన మిత్ర కోసం దరఖాస్తు చేసుకోవడం డ్రైవర్లకు సులభంగా మారిపోయింది.ఎక్కడి వారు అక్కడే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో అటు వారికి,ఇటు అధికారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో నమోదు ప్రక్రియ ఈజీగా సాగింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైయస్సార్ వాహన మిత్ర పథకానికి గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోఅన్ని జిల్లాల్లో కంటే శ్రీకాకుళంలోనే అత్యధికంగా వాహన మిత్ర పథకం కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు.

 కరోనా కష్ట కాలంలో సాయం అందించిన సీఎం జగన్

కరోనా కష్ట కాలంలో సాయం అందించిన సీఎం జగన్

వైఎస్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారులకు అక్టోబర్‌లో రూ.10 వేలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అయితే కరోనా కష్టాల నేపధ్యంలో వారికి ఈ సమయంలో అండగా నిలవాలని భావించిన సీఎం జగన్ నాలుగు నెలల ముందుగానే సాయం విడుదల చేశారు. వాహన మిత్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాల నుండి మంత్రులు , ఎమ్మెల్యేలు , జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

English summary
YSR vahana mithra beneficiaries owed Rs10,000 in October, but the corona hits the common man's life . CM Jagan released four months before to help autowalas, and taxy drivers. The YSP government's ambitious launch of YSR vahana mithra today second phase by CM Jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X