వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుట్టుగా కారంపూడి చెన్నకేశవుడి భూముల వేలం-ఈవో తీరుపై అనుమానాలు

|
Google Oneindia TeluguNews

పల్నాడు జిల్లాలో కారంపూడి చెన్నకేశవస్వామి ఆలయ భూముల రహస్య వేలం వివాదం రేపుతోంది. జిల్లాలోని ప్రతిష్టాత్మక ఆలయాల్లో ఒకటైన చెన్నకేశవాలయం భూముల్ని అధికారులు కొందరి మాత్రమే సమాచారం ఇచ్చి వేలం నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని శ్రీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో అధికారులు ఇవాళ భూముల వేలంపాట నిర్వహిస్తున్నారు. దీనికి కొంతమందిని మాత్రమే ఆహ్వానించారు. మెయిన్ వాళ్ళు వచ్చారు. అందుకే వేలంపాట పెట్టామంటూ అధికారులు సమాధానం చెప్తుండటం కలకలం రేపుతోంది. కారంపూడి ఆలయ ఈవో కనీసం మీడియాను కూడా పిలవకుండా తాను ఇస్తానుసరముగా ఈ వేలం పాట సాగిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

secret auction of karampudi chennakesava swamy temple lands in palnadu district of ap

అదేంటని ప్రశ్నిస్తే ప్రధాన 3 పత్రికలకు చెప్పాము. అవి ఉంటే చాలు మిగతా మీడియా అవసరం లేదనేలా ఈవో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ రహస్య వేలంపాట వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. ఏదీ ఇదేమైనా చెన్నకేశవ స్వామి వేలంపాటలో ఏదో మతలబు చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

అలాగే వేలం పాట అంటే ఒక బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసి మండలంలో ప్రజలందరూ పాల్గొన్న తర్వాత వేలం పాటను సాగిస్తారు. కానీ ఇక్కడ అంత భిన్నంగా 20 మందితోనే వేలం పాట ముగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి వాస్తవాలు బయటపెట్టాలని విపక్షాలు, స్ధానికులు కోరుతున్నారు.

English summary
karampudi chennakesava swmamy temple's lands secret auction creates new doubts in palnadu district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X