• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ , బీజేపీ నేత రామ్ మాధవ్ ల రహస్య భేటీ .. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్

|

ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపించలేకున్నా జనసేనాని మాత్రం పట్టిన పట్టు విడవకుండా రాజకీయాల్లోనే ఉంటూ జనసేన పార్టీని నడిపిస్తానని అంటున్నారు. అయితే తాజాగా అనూహ్యంగా జరిగిన ఓ సంఘటన పవన్ పార్టీని కొనసాగిస్తారా లేకా అన్న తరహాలో విలీనం చేస్తారా అన్న అనుమానాలు రేకెత్తించింది. అయితే అదేమీ లేదని ఊపిరి ఉన్నంతవరకు పార్టీని కొనసాగిస్తానని పవన్ చెప్పటం ఆసక్తికరంగా మారింది.

నేడు సీఎం హోదాలో జగన్ సొంత జిల్లా పర్యటన .. జమ్మలమడుగు సభపై సర్వత్రా ఆసక్తి

 తానా సభల సాక్షిగా పవన్, బీజేపీ నేత రామ్ మాధవ్ ల భేటీ ..

తానా సభల సాక్షిగా పవన్, బీజేపీ నేత రామ్ మాధవ్ ల భేటీ ..

అమెరికాలో తానా వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయనేతలు భేటీ కావటం హాట్ టాపిక్ గా మారింది . ప్రస్తుతం అమెరికాలో తానా మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు పలువురు రాజకీయ నేతలను కూడా ఆహ్వానించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా హాజరయ్యారు. అయితే ఈ క్రమంలో ఇద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ నేత రాం మాధవ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంతో పవన్ కళ్యాణ్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా అన్న చర్చ సాగింది.

భేటీ అనంతరం స్పందించిన రామ్ మాధవ్ .. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని ప్రకటన

భేటీ అనంతరం స్పందించిన రామ్ మాధవ్ .. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని ప్రకటన

పవన్‌తో చర్చల అనంతరం రామ్ మాధవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో పనిచేసే ఉద్దేశం లేదన్నారు. అయితే పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ ను స్నేహపూర్వకంగానే కలిశానన్నారు రాంమాధవ్, తమ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బలమైన రాజకీయశక్తిగా ఎదగడమే ప్రస్తుతం బీజేపీ ముందున్న తక్షణ కర్తవ్యం అని పేర్కొన్నారు . అయితే ఇటీవలే చిరంజీవి బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో తాజాగా రాంమాధవ్ కూడా పవన్ కళ్యాణ్‌తో భేటీ అవ్వడం రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

 భేటీపై సందించిన పవన్ కళ్యాణ్.. పాత పరిచయంతోనే కలిశానన్న రామ్ మాధవ్

భేటీపై సందించిన పవన్ కళ్యాణ్.. పాత పరిచయంతోనే కలిశానన్న రామ్ మాధవ్

తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరుతున్న ప్రస్తుత తరుణంలో వీళ్లిద్దరి మధ్య జరిగిన భేటీ రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా రకరకాల చర్చలకు కారణం అయ్యింది .అయితే, ఇదే విషయమై స్పందించిన పవన్ కళ్యాణ్ కేవలం వారి కలయిక పాత పరిచయాల నేపధ్యంలోనే సాగిందని చెప్పారు. తాను రామ్ మాధవ్‌ని కలవడంపై పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. ఆయనకు, తనకు మధ్య వున్న పాత పరిచయంతోనే రామ్ మాధవ్‌ను కలిశానని, అంతకుమించి దీనివెనుక ఆపరేషన్ ఆకర్ష్ లాంటివేమీ లేవని తేల్చిచెప్పారు. బీజేపీతో తనకు వ్యక్తిగత విభేదాలేవీ లేవని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రత్యేకహోదా గురించి ప్రశ్నించేందుకే కలిశానని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యా‌ణ్‌తో భేటీలో స్నేహాపూర్వక భేటీ మాత్రమేనని బీజేపీ నేతలు చెబుతున్నా ఈ భేటీ భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు నాందిగా నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pawan Kalyan was the chief guest for TANA Convention 2019. Surprisingly, A meeting took place between Jana Sena Chief and BJP National General Secretary Ram Madhav during this US Trip. Pawan came down heavily on BJP for denying Special Category Status by comparing the Special Package with two stale laddus.In the 2019 Elections, Neither Jana Sena nor BJP gained anything. Pawan Kalyan faced defeat in both the Assembly Constituencies. Victory of Rapaka Varaprasad in Razole was a big relief. Post the humiliating defeat, Pawan made it clear he would continue in politics till his last breath.What was the agenda behind the meeting of Pawan Kalyan and Ram Madhav? They seems to have discussed about the bifurcation promises and what Centre has to do for bailing out AP from the crisis apart from politics. This unexpected meeting is creating a sensation in the AP Politics. Did Ram Madhav moved the proposal of BJP, Jana Sena working together? It will be interesting if BJP & Jana Sena have an alliance for 2024 AP Elections. That's much better than contesting separately...isn't it?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more