• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జోరు పెంచిన నిమ్మగడ్డ- సచివాలయాలూ, వాలంటీర్లకూ షాక్‌- డీజీపీ బదిలీ ప్రచారం ?

|

ఏపీలో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లూ ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ఎన్నికల విషయంలో ముందడుగు వేయలేకపోయిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఇప్పుడు కొరడా ఝళిపిస్తున్నారు. ఎన్నికలకు తామూ సిద్ధమేనన్న ప్రభుత్వ పెద్దల ప్రకటనలతో నిమ్మగడ్డ మరింత జోరు పెంచారు. వైసీపీ సర్కారు ఎన్నికల అస్త్రాలుగా భావిస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లకు నిమ్మగడ్డ షాకిచ్చారు. అలాగే రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు వీలుగా డీజీపీ సహా కీలక అధికారులను బదిలీ చేసేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  Ap Sec Letter To Central Government | Andhra Pradesh Local Body Polls | Oneindia Telugu

  నిమ్మగడ్డ అదను చూసి దెబ్బకొట్టారా ? జగన్‌ కొంపముంచిన నిర్ణయమిదే- టర్నింగ్ పాయింట్‌

  సుప్రీంకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ జోష్‌

  సుప్రీంకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ జోష్‌

  పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ చకచకా పావులు కదుపుతున్నారు. నిన్న తీర్పు రాగానే ఎన్నికలను రీ షెడ్యూల్ చేసిన నిమ్మగడ్డ.. అనంతరం తనకు సహకరించని పంచాయతీ రాజ్‌శాఖ సీనియర్ ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌పై వేటు వేశారు. ఇదే క్రమంలో ఏపీలో ఉద్యోగులు తనకు పూర్తిగా సహకరిస్తారన్న నమ్మకం లేదని, కేంద్ర సిబ్బందిని, కేంద్ర బలగాలను కేటాయించాలని కేంద్ర హోంశాఖకు లేఖలు రాశారు. ఆ వెంటనే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు కూడా షాక్‌ ఇచ్చారు.

  ఎన్నికలకు దూరంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది

  ఎన్నికలకు దూరంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది

  రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బలంగా మారతారని భావిస్తున్న అధికారులు, సిబ్బందిపై నిమ్మగడ్డ వరుసగా కన్నెర్ర చేస్తున్నారు. ఇదే కోవలో పంచాయతీ రాజ్‌శాఖ అధికారులను బదిలీ చేసిన నిమ్మగడ్డ.. ఇప్పుడు గ్రామ సచివాలయాల సిబ్బందితో పాటు గ్రామ వాలంటీర్లను కూడా ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆదేశాలు పంపారు. అంతే కాదు వారు ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్లను కూడా సరెండర్‌ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని ఎస్‌ఈసీ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో వైసీపీ సర్కారు నియమించిన వాలంటీర్లు ఎన్నికల్లో వారికి ఉపయోగపడే పరిస్ధితి లేకుండా పోయింది.

   డీజీపీ సహా కీలక అధికారుల బదిలీ ?

  డీజీపీ సహా కీలక అధికారుల బదిలీ ?

  పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా రాష్ట్రంలో పోలీసుశాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు రాజకీయ ప్రకటలు చేస్తుండటంపై ఎస్ఈసీ ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా పోలీసు అధికారుల సంఘం ఈ ఎన్నికలకు సహకరించబోమని, వ్యాక్సినేషన్ తర్వాతే తమ సేవలు వాడుకోవాలని తాజాగా కోరడంపై నిమ్మగడ్డ ఆగ్రహంగా ఉన్నారు. అలాగే తాను నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లకు హాజరు కాకపోవడం, ఎస్పీల బదిలీలకు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడం వంటి కారణాలతో డీజీపీ గౌతం సవాంగ్‌పైనా బదిలీ వేటుకు నిమ్మగడ్డ సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. డీజీపీతో పాటు ప్రభుత్వ పెద్దలకు కీలకంగా ఉన్న మరికొందరు అధికారులపైనా ఈ రెండు రోజుల్లో నిమ్మగడ్డ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.

  English summary
  after supreme court verdict on panchayat polls in andhra pradesh, sec nimmgadda ramesh issues orders to village and ward secretariat employees and volunteers to stay away to the process.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X