వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు నివాసం వద్ద భద్రత ఎలా ఉంది

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి : ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద భద్రత ఎలా ఉంది....ఇంకా భద్రతను పెంచాలా...మావోయిస్టుల నుండి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు.

ఏఓబిలో జరిగిన ఎన్ కౌంటర్ లో 32 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనకు ఎపి ముఖ్యమంత్రిప ప్రతీకారం తీర్చుకొంటామని మావోయిస్టు పార్టీ పేరుతో లేఖ వచ్చింది. ఈ లేఖపై అనుమానాలు కూడ వ్యక్తమయ్యాయి.అయితే ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోలు విద్వంసానికి పాల్పడే అవకాశం ఉందని పోలీసులు నుమానిస్తున్నారు.ఈ మేరకు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద భద్రతను డిజిపి సమీక్షించారు.

అమరావతిలో చంద్రబాబునాయుడు నివాసం వద్ద భద్రతను ఇంటలిజెన్స్ చీఫ్ , సిఎం సెక్యూరిటీ అధికారులు పరిశీలించారు. సిఎం నివాసం వద్ద ఉన్న కృష్ణా నది వైపు నుండి ఉన్న మార్గంలో భద్రతపై డిజిపి పలు సూచనలను చేశారు.ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 25 మందితో భద్రతను కట్టుదిట్టం చేయాలని డిజిపి సూచించారు.

security tight at chandrababu residence

మావోలతో చర్చలకు సిద్దమే...డిజిపి ప్రకటన వెనుక వ్యూహమేమిటీ ..

మావోయిస్టు పార్టీతో చర్చలకు తాము సిద్దమేనని ఆంద్రప్రదేశ్ డిజిపి సాంబశివరావు ఆదివారం నాడు ప్రకటించారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబునాయుడు ఉన్న కాలంలో చర్చలకు సంబందించిన ప్రతిపాదన వచ్చింది. కాని, అమలు కాలేదు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక మావోలతో చర్చలు ప్రారంభమయ్యాయి, చర్చల కోసం మావోలు అడవుల నుండి బయటకు వచ్చారు. చర్చలు ముగిసిన తర్వాత తిరిగి అడవులకు వెళ్ళిపోయారు. మావోలు అడవులకు వెళ్ళిన తర్వాత జరిగిన ఎన్ కౌంటర్లలో అనేకమంది మావోలు చనిపోయారు.

చర్చల పేరుతో వచ్చిన అవకాశాన్ని పార్టీ విస్తరణ కోసం ఉపయోగించుకోవాలని మావోయిస్టు పార్టీ భావించింది . కాని, ఈ అవకాశాన్ని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఉపయోగించుకొన్నారు.క్రమేణా మావోయిస్టు పార్టీ కీలకనాయకులు ఎన్ కౌంటర్లలో చనిపోయారు. కొందరు లొంగిపోయారు. కొత్తగా రిక్రూట్ మెంట్ కష్టమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తమకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోందని భావించినా , మావోలు ఆశించిన మేరకు క్షేత్రస్థాయిలో లేవు. మళ్ళీ రిక్రూట్ మెంట్ కోసం అవకాశాలున్న చోట మావోలు ప్రయత్నిస్తున్నారు.

తమకు బాగా పట్టున్న ఏఓబిలో మావోలపై పోలీసులు దెబ్బతీశారు. ఈ ఎన్ కౌంటర్ లో 32 మంది నక్సలైట్లు మరణించారు. ఈ ఘటనతో మావోయిస్టులు కొంత ఆత్మరక్షణలో పడ్డారు. తమకు పట్టున్న ప్రాంతంలో కూడ పోలీసులు పైచేయి సాధించడం మావోలకు ఇబ్బందికరంా మారింది. మావో అగ్రనేతలు రామకృష్ణ, ఎట్టకేలకు సురక్షితంగానే ఉన్నట్టు సమాచారాన్ని వరవరరావు ప్రకటించారు. తాజాగా మావోలతో తాము చర్చలకు సిద్దమేనని ఎపి డిిపి సాంబశివరావు ప్రకటించడం వెనుక ఏ వ్యూహామేమిటనే చర్చ ప్రారంభమైంది. చర్చలకు మావోయిస్టులు సానుకూలంగా స్పందిస్తారా...స్పందిస్తే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొంటుంది..వ్యూహాత్మకంగానే పోలీసు బాస్ ఈ ప్రకటన చేశారా అనేది చర్చ సాగుతోంది.

English summary
security tight at Ap CM chandrababu Naidu residence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X