• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అచ్చం జ‌గ‌న్ లాగే మరో వ్యక్తి ... ఎక్కడో కాదు ఇక్కడే ! ప‌్ర‌త్య‌ర్ధులకు దొరికితే అంతే..!

|

జ‌గ‌న్ అభిమానులకు ఓ ఆస‌క్తి క‌ర‌మైన వార్త‌. జ‌గ‌న్ ను పోలిక మ‌రో వ్య‌క్తి చిత్రం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అచ్చం జ‌గ‌న్ లాగానే ఉన్న ఆ వ్య‌క్తి ఇప్పుడు సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారారు. మ‌నిషిని పోలిన మ‌నిషులు ప్ర‌పంచంలో ఏడుగురు ఉంటారని చెబుతారు. అటువంటిది ఇప్పుడు ఏకంగా ఓ పార్టీ అధినేత అయిన జ‌గ‌న్ పోలిక‌ల‌తో అచ్చు గుద్దిన‌ట్లుగా ఉన్న ఈ వ్య‌క్తి స‌మాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

జ‌గ‌న్ పోలిక‌ల‌తో అచ్చంగా..

వైసిపి అధినేత ఇప్పుడు ఏపి రాజ‌కీయాల్లోనే కాదు..ఎన్నిక‌ల పైన జాతీయ సంస్థ‌ల స‌ర్వే నివేదిక‌ల‌తో జాతీయ స్థాయిలోనూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఇక్క‌డ స‌భ‌లు పెట్టినా జ‌నం పోటెత్తారు. ఈనెల 11న ఏపిలో జిర‌గిన పోలింగ్ పైన జ‌గ‌న్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. పోలింగ్ ముగిసిన త‌రువాత త‌మ పార్టీకి లాండ్ స్లైడ్ విక్ట‌రీ ల‌భిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఇక‌, ఫ‌లితాల వెల్ల‌డికి నెల‌కు పైగా స‌మ‌యం ఉంది.

ఇవన్నీ ఇలా ఉంటే..ఏపిలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ధీటుగా తెలంగాణ‌లో అచ్చం అదే విధంగా ఉండే మ‌రో వ్య‌క్తి అక్క‌డి ప్ర‌జ‌ల దృష్టిలో ప‌డ్డారు. చూడ‌గానే ఎవ‌రైనా జ‌గ‌నా అని అనుకోవాల్సిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించిన స‌మ‌యంలో క‌డ‌ప జిల్లాలో ఓ వ్య‌క్తి పొలంలో మంచినీళ్లు తాగుతున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. అచ్చంగా ఆ వ్య‌క్తి జ‌గ‌న్ లాగానే ఉండ‌టంతో ల‌క్ష‌లాది వ్యూస్‌..లైక్‌లు వ‌చ్చాయి.

ఇప్పుడు తెలంగాణాలో..

ఇక‌, ఇప్పుడు తెలంగాణాలో అదే త‌ర‌హాలో జ‌గ‌న్ పోలిక‌ల‌తో ఓ వ్య‌క్తి వెలుగు లోకి వ‌చ్చాడు. కొద్ది రోజులుగా అత‌డి గురించి సోష‌ల్ మీడియాలో పోస్టింగ్‌లు క‌నిపిస్తున్నాయి. తెలంగాణ‌లోని గోదావరి ఖ‌ని ప్రాంతానికి చెందిన ఆ వ్య‌క్తి పేరు ర‌మేష్‌. జ‌గ‌న్ త‌ర‌హాలో వ‌స్త్ర ధార‌ణ‌..గ‌డ్డం..చేతులు ఊప‌టం వంటి వాటితో మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటున్నారు. ఇక‌, జ‌గ‌న్ గా అత‌డిని భావిస్తున్న కొంద‌రు అత‌డితో వీడియో తీసి సోష‌ల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తున్నారు.

Seem to be same as jagan : Ramesh from Telangana halchal in social media

దీంతో.. ఇప్పుడు జ‌గ‌న్ అభిమానులు ఆ వ్య‌క్తిని ఆస‌క్తిగా తిల‌కిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ నాయ‌కుల‌ను పోలిన వ్య‌క్తుల కోసం స‌హ‌జంగానే వెతుకుతూ ఉంటారు. తాజాగా ఆయ‌న సినిమాల్లో ఎన్టీఆర్‌..చంద్ర‌బాబు వంటి వారి పాత్ర ధార‌ణ కోసం అదే పోలిక‌ల‌తో ఉన్న వారిని వెతికి ప‌ట్టుకొని సినిమా తీసారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ పైన ఎవ‌రైనా సినిమా తీయాల‌నుకుంటే ర‌మేష్ స‌రిగ్గా స‌రిపోతార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

English summary
Seem to be same as jagan one person in Godavari Khani in Telangana. By name Ramesh he imitating Jagan with Jagan face cuts. Now this person video viral in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X