వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతల భార్యల పోరు: పరిష్కారం కోసం బాబు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచేందుకు సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధులతో పాటు వారి సతీమణులు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు భార్యలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ఆంటోని కమిటీ సభ్యులు వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్‌లను కలిశారు. తెలుగు జాతిని విడగొట్టవద్దని కోరారు. కావూరి సాంబశివ రావు భార్య హేమలత, కోట్ల సూర్యప్రకాశ రెడ్డి భార్య సుజాతమ్మ ఆధ్వర్యంలో 28 మంది బృందం ఢిల్లీలో నేతలను కలిశారు.

రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్‌పై సీమాంధ్ర ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోతాయని, తెలంగాణలో వారు రెండో తరగతి పౌరులు అవుతారని, హైదరాబాద్‌లో చదువుతున్న సీమాంద్రుల పిల్లల స్థానికత్వం ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో 90 శాతానికి పైగా పెట్టుబడులు పెట్టింది సీమాంధ్ర వ్యాపారులేనని, ఒకవేళ రాష్ట్రం విడిపోతే వీరిని బెదిరించి, వేధింపులకు గురి చేస్తారని, ఆస్తులను ధ్వంసం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల ప్రయోజనాలను పణంగా పెట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని, ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణను ఏర్పాటు చేస్తే ఆ ప్రభావం భవిష్యత్తులో సీమాంధ్రకు చెందిన రెండు తరాల ప్రజలపై పడుతుందన్నారు. సీమాంధ్ర ఎంపీలు సైతం కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసి సమైక్య రాష్ట్రం కోసం విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ప్రతిపక్ష నేతలను కలిసి సమస్యకు సానుకూల పరిష్కారం చూపాలని కోరారు.

షిండేను కలిసిన ఎంపీలు

షిండేను కలిసిన ఎంపీలు

కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసి రాష్ట్రాన్ని విడదీయవద్దని కోరుతున్న సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు, కేంద్రమంత్రులు.

రాష్ట్రపతితో సీమాంధ్ర నేతల సతీమణులు

రాష్ట్రపతితో సీమాంధ్ర నేతల సతీమణులు

సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు, మంత్రుల సతీమణులు సమైక్యాంధ్ర కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం ఇస్తున్న దృశ్యం.

బయటకు వస్తూ...

బయటకు వస్తూ...

రాష్ట్రపతిని, ఇతర ముఖ్య నాయకులను కలిసిన అనంతరం బయటకు వస్తున్న సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ ఎంపీలు, మంత్రుల సతీమణులు.

విలేకరులతో

విలేకరులతో

రాష్ట్రపతిని, ఇతర ముఖ్య నాయకులను కలిసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ ఎంపీలు, మంత్రుల సతీమణులు.

కరత్‌తో బాబు

కరత్‌తో బాబు

రాష్ట్ర తాజా పరిస్థితులపై లెఫ్ట్ పార్టీ నేత ప్రకాశ్ కరత్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు.

రాజ్‌నాథ్ సింగ్‌తో బాబు

రాజ్‌నాథ్ సింగ్‌తో బాబు

రాష్ట్ర తాజా పరిస్థితులపై బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు.

రాష్ట్రపతికి బాబు వినతి

రాష్ట్రపతికి బాబు వినతి

రాష్ట్ర తాజా పరిస్థితులపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చి, తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

English summary

 Seemandhra leaders wives and Telugudesam Party cheif Nara Chandrababu Naidu met President Pranab Mukherjee on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X