హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు విషెస్ చెప్పేందుకు ఆ బస్సులో 5గురు ఐఏఎస్‌లే వెళ్లారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: విజయవాడ వెళ్లే విమాన ఖర్చులు తగ్గించుకోవడానికి ఐఏఎస్ అధికారులకు ఆర్టీసీ గరుడ బస్సును ఏర్పాటు చేస్తే అందులో కేవంల అయిదుగురు మాత్రే ప్రయాణించి ప్రభుత్వానికి ఖర్చు తగ్గకుండా చేశారు.

ఆంగ్ల నూతన సంవత్సరం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెజవాడలో ఉన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ రావాలని ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రికి సూచించారు. అయితే, షెడ్యూల్ కారణంగా రాలేదు. దీంతో ఐఏఎస్ అధికారులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలి వెళ్లారు.

విమానంలో వెళ్తే ఛార్జీలు ఎక్కువ అవుతాయన్న కారణంగా ఆర్టీసీ ఓల్వో బస్సును ఏర్పాటు చేశారు. ఆర్టీసీ గరుడ బస్సు సచివాలయానికి వచ్చి అధికారులను తీసుకు వెళ్లింది. అయితే, ఈ బస్సులో నిండేంత అధికారులు రాలేదు. కనీసం బస్సు సగం కూడా నిండలేదు.

seemandhra officers skip trip to vijayawada

48 సీట్లు ఉన్న ఈ బస్సులో సీనియర్ ఐఏఎస్‌లు లింగరాజ్ పాణిగ్రాహి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, జేసీ శర్మ, ఆర్పీ సిసోడియా, ముద్దాడ రవిచంద్ర, మరికొంతమంది వారి వ్యక్తిగత సిబ్బంది మాత్రమే బస్సులో వెళ్లారు. కొందరు అధికారులు వీరికంటే ముందు, వెనుక విమానాళ్లో, వ్యక్తిగత వాహనాళ్లో వెళ్లిపోయారు.

శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్ సచివాలయం నుంచి బయలుదేరనుందని సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ఏడు గంటలకు సీఎం చంద్రబాబును కలుస్తారని చెప్పారు. అయితే బస్సులో కేవలం ఐదారుగురు అధికారులు మాత్రమే వెళ్లడం ద్వారా ప్రభుత్వం భావించినట్లుగా ఖర్చు తగ్గలేదు.

English summary
AP bureaucrats, it seems, had better things to do on Friday than travel from Hyderabad to Vijayawada to greet CM Chandrababu Naidu on New year's day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X