వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గీత దాటొద్దు: పార్టీ నేతలకు బాబు హెచ్చరిక, పొలిట్‌బ్యూరోలో కొత్తగా ఇద్దరు

పార్టీలో ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో నడుచుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. క్రమశిక్షణా రహితంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: పార్టీలో ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో నడుచుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. క్రమశిక్షణా రహితంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ క్రమశిక్షణకు అనుగుణంగా పని చేయాలని.. అప్పుడే పార్టీ ముందుకెళుతుందని తెలిపారు.

టీడీపీ పోలిట్‌బ్యూరో, జాతీయ, తెలుగు రాష్ట్రాల కమిటీల ఏర్పాటుపై కసరత్తు పూర్తయిందని చంద్రబాబు నాయుడు శనివారం తెలిపారు. పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. పార్టీ పోలిట్‌బ్యూరోలో 17 మంది సభ్యులు ఉంటారని స్పష్టం చేశారు.

కొత్తగా ఇద్దరు

కొత్తగా ఇద్దరు

కొత్తగా తెలంగాణ నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్కకు పోలిట్‌బ్యూరోలో చోటు కల్పించినట్టు చెప్పారు. ఇటీవల పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన రమేశ్‌ రాథోడ్‌ స్థానంలో సీతక్కను తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే పోలిట్‌బ్యూరోలో ఉన్నవారిలో అంతా సీనియర్లే గనుక పెద్దగా మార్పులు చేయలేదని చెప్పారు. టీడీపీ జాతీయ క‌మిటీకి ఐదుగురు ఉపాధ్య‌క్షులు, న‌లుగురు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, ఐదుగురు అధికార ప్ర‌తినిధులు ఉంటార‌ని అన్నారు.

ఏపీకి 105, టీకి 114

ఏపీకి 105, టీకి 114

ఆంధ్రప్రదేశ్‌ కమిటీలో 105 మంది, తెలంగాణ కమిటీలో 114 మంది ఉంటారని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ కమిటీకి ఎల్‌ రమణ అధ్యక్షుడిగా, రేవంత్‌రెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ కమిటీకి అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉంటారని తెలిపారు. త్వరలోనే పార్టీ అనుబంధ సంఘాలకు కమిటీలు ప్రకటించనున్నట్టు సీఎం వెల్లడించారు.

ఇష్టమొచ్చినట్లు కుదరదు..

ఇష్టమొచ్చినట్లు కుదరదు..

కాగా, పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే కుదరని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పార్టీలోని ప్రతీ కార్యకర్తకు, నేతకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. సామర్థ్యాన్ని బట్టి నేతలను ఉపయోగించుకుంటామని చంద్రబాబు చెప్పారు. పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగేందుకు నేతలు నిరంతరం కృషి చేస్తుండాలని అన్నారు. పార్టీకి నష్టం కలిగించే పనులు చేయవద్దని సూచించారు.

జేసీది సమస్యే కాదు..

జేసీది సమస్యే కాదు..

అభివృద్ధిని అడ్డుకునే పార్టీలు అవసరం లేదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. టీడీపీ నేతలు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఎవరైనా సరే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని అన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిది సమస్యే కాదని అన్నారు.

పొలిట్‌బ్యూరో సభ్యులు వీరే..

పొలిట్‌బ్యూరో సభ్యులు వీరే..

టీడీపీ కొత్త పోలిట్‌బ్యూరోలో.. నారా చంద్రబాబు నాయుడు, అశోక్‌గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, నందమూరి హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, దేవేందర్‌గౌడ్‌, ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రతిభా భారతి, అయ్యన్నపాత్రుడు, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్కలు ఉన్నారు.

English summary
Telangana TDP leaders Seethakka and Revuri Prakash Reddy included in Telugudesam Party politburo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X