వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుంది..సభ్యులు ఎవరు: రాజధాని నిర్ణయాన్ని ఆపగలదా: రూల్స్ ఏం చెబుతున్నాయి..!

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా భావించి..బిల్లు పూర్తిగా ఆమోదం పొందకముందే విజయోత్సవాలు సైతం నిర్వహించింది. ఇప్పడు టీడీపీ పూర్తిగా మండలిలో తమకు ఉన్న మెజార్టీ..నిబంధనలను పూర్తిగా వినియోగించుకుంది. చివరకు మండలి ఛైర్మన్ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీ కి రిఫర్ చేసారు. దీంత..ప్రభుత్వానికి భంగపాటుగా భావిస్తున్నారు. దీంతో..అసలు ఇక సెలెక్ట్ కమిటీ ఏంటి.. సభ్యులుగా ఎవరు ఉంటారు. కమిటీ ఏం చేస్తుంది. రాజధాని నిర్ణయాన్ని మార్చగలదా. బిల్లుల పైన ఎటువంటి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుంది. శాసన వ్యవస్థ రూల్స్ ఏం చెబుతున్నాయి. ఇప్పుడు ఇదే అంశం ఏపీలో అటు రాజకీయంగానూ..ఇటు సాధారణ ప్రజల్లనూ సందేహాలకు కారణమవుతున్నాయి. అయితే ఈ కమిటీ పూర్తి నివేదిక ఇచ్చే వరకు రాజధానుల వ్యవహారం చట్టంగా మారే అవకాశం మాత్రం ఉండదు.

సెలెక్ట్ కమిటీ ఎలా ఉంటుంది..
శాసన మండలిలో మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ ఛైర్మన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో..ఇప్పుడు మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల ప్రతినిధులతో ఛైర్మన్ ఈ కమిటీ ఏర్పాటు చేస్తారు. అయితే, టీడీపీ సభ్యులే మండలిలో మెజార్టీ ఉండటంతో..కమిటీలోనూ టీడీపీ సభ్యులకే ఎక్కవ మందికి అవకాశం దక్కుతుంది. అధికార వైసీపీ నుండి తొమ్మది మంది మాత్ర మే సభ్యులుగా ఉన్నారు. దీంతో..వారికి కమిటీలో ప్రాతినిధ్యం తక్కువగా ఉంటుంది. ఇక, బీజేపీ ... ఉపాధ్యాయ.. పట్టభద్ర..స్వతంత్ర అభ్యర్ధుల నుండి ఇందులో అవకాశం కల్పిస్తారు. అయితే, ఈ కమిటీ ఏర్పాటు చేసిన తరువాత కమిటీ నెల రోజుల నుండి మూడు నెలల వరకు సమయం తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. అదే సమయంలో మధ్యలో మరోసారి సమయం కావాలంటే గడువు పెంచమని కోరే అధికారం సైతం ఈ కమిటీకి ఉంటుంది.

Select committee with elected council members..submit report in Three months

కమిటీ సభ్యులు ఏం చేస్తారు..
కమిటీ ఏర్పాటు అయిన తరువాత సభ్యులు ఈ రెండు బిల్లుల పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తారు. బిల్లులో అభ్యంతర అంశాల పైన సమీక్షిస్తారు. బిల్లు స్వరూపాన్ని మార్చే అధికారం..మూలం తప్పించే అధికారం మాత్రం కమిటీకి ఉండదు. ఈ కమిటీ ఏపీలోని 13 జిల్లాల్లోనూ తిరిగి అభిప్రాయ సేకరణ చేసే అధికారం ఉంటుంది. అదే విధంగా..ప్రజా సంఘాలు.. ఇతర స్టేక్ హోల్డర్స్ నుండి సైతం అభిప్రాయాల సేకరణకు అధికారం ఉంటుంది. వీటి పైన పూర్తి స్థాయిలో చర్చించిన తరువాత మండలి ఛైర్మన్ కు నివేదిక అందిస్తుంది. దీనిని మండలి ఛైర్మన్ తిరిగి శాసనసభకు పంపిస్తారు. శాసనసభ ఈ సెలెక్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను యధాతధంగా ఆమోదించాల్సిన అవసరం లేదు. సభ అభిప్రాయం మేరకు పరిగణలోకి తీసుకొని..తిరిగి బిల్లును ఆమోదించి..మరోసారి మండలికి ఆమోదం కోసం పంపిస్తారు. ఆ సమయం లో తిరిగి మండలి వ్యతిరేకించినా అది పరిగణలోకి రాదు. పూర్తిగా.. శాసనసభ నిర్ణయం మేరకు చట్టం అమల్లోకి వస్తుంది. మండలిలో మరోసారి సెలెక్ట్ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్న బిల్లునే తిరిగి పంపినా..అది డీమ్డ్ టు బి యాక్సప్టెడ్ గా పరిగణిస్తారు. దీంతో..ఇప్పుడు ఈ కమిటీ ద్వారా మూడు రాజధానుల అమలు చట్టం రూపం దాల్చటానికి మరింత సమయం వేచి చూడక తప్పదు.

English summary
Select committee memebres from council representing parteis. This committee study in depth on these two bill and t ake public opinion. Committee may take one month to three months time for submission of report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X