వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి లో ఐఏయ‌స్ ల కోల్డ్ వార్‌: ఏంటీ అవ‌మ‌నాలు..కొంద‌రు కేంద్ర స‌ర్వీసుల‌కు : ఏపి లో ఏం జ‌రుగుతోంది..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఎన్నిక‌లు మిగిసాయి. అధికారంలో కొత్త వారు వ‌స్తారా..ఇప్పుడు ఉన్న వారే కొన‌సాగుతారా. ఈ చ‌ర్చ రాజ‌కీయ పా ర్టీల్లోనే కాదు. ఏపి బ్యూరోక్రాట్ల‌లోనూ జ‌రుగుతోంది. అయితే, విచిత్రంగా ఎన్నిక‌ల వేళ ఏపి సీనియ‌ర్ ఐఏయ‌స్ అధికారుల విష‌యంలో మార్పులు జ‌రుగుతున్నాయి. టిడిపి ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన సీనియ‌ర్ అధికారులు కేంద్ర స ర్వీసుల‌కు బ‌దిలీ కోరుకుంటున్నారు. ఇక‌, కొంద‌రు అధికారుల పై చంద్ర‌బాబు పై చేసిన వ్యాఖ్య‌ల పై రాష్ట్రప‌తికి ఫిర్యా దు చేయాల‌ని మ‌రి కొంద‌రు సీనియ‌ర్లు భావిస్తున్నారు.

కేంద్ర స‌ర్వీసుల‌కు ఏపి అధికారులు..

కేంద్ర స‌ర్వీసుల‌కు ఏపి అధికారులు..

ఎన్నిక‌ల ముగియ‌గానే..ఫ‌లితాల పై జ‌రుగుతున్న ప్ర‌చారం ఒక వైపు..మ‌రో వైపు అధికారుల్లో కొంద‌రు కేంద్ర స‌ర్వీసుల కు ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో టిడిపి హాయంలో కీల‌క భూమిక పోషించిన అధికారులు ఏపి నుండి త‌మ‌ను రిలీవ్ చేసి..కేంద్ర స‌ర్వీసుల్లో అవకాశం ఇవ్వాల‌ని కోరుతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే పోలీసు శాఖ‌లో ఓ కీల‌క అధికారి ఈ మేర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. అదే విధంగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోని ఒక అధికారి ఇప్ప‌టికే సెల‌వు కోసం అప్లై చేసారు. ఆ త‌రువాత వెంట‌నే కేంద్ర స‌ర్వీసుల కోసం ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇక‌, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం లో రాజ‌ధాని..విద్యుత్ శాఖ లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన మ‌రో అధికారి సైతం ఏపి నుండి రిలీవ్ చేయించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు ప్రారిభించిన‌ట్లు స‌మాచారం. అయితే, ఆయ‌న ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత అప్ప‌టి ప‌రిస్థితి ఆధారంగా నిర్ణ‌యం తీసుకొనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని అధికార వ‌ర్గాల స‌మాచారం.

చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల పై ఆగ్ర‌హం..

చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల పై ఆగ్ర‌హం..

ఇప్ప‌టికే టిడిపి అధినేత చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్య‌లు అధికారుల్లో క‌ల‌క‌లం సృష్టించాయి. ఎన్నిక‌ల సంఘం ఏపి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిల్ చంద్ర పునీతా ను బ‌దిలీ చేసి ఆయ‌న స్థానంలో ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ను ప్ర‌భు త్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించింది. అయితే, దీని పై టిడిపి అధినేత చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు అధికారుల్లో మ‌నస్థాపానికి గుర‌య్యారు. ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం కోవ‌ర్టు..ఆయ‌న జ‌గ‌న్ కు స‌హ ముద్దాయి అంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. అదే విధంగా రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ద్వివేదీ తో చంద్ర‌బాబు వ్య‌వ‌హ రించిన తీరు పైనా విమ‌ర్శ‌లు వెల్లు వెత్తాయి. దీంతో..రిటైర్డ్ ఐఏయ‌స్‌ అధికారులు ఈ వ్యాఖ్య‌ల‌ను ఉప సంహ‌రించుకో వాల‌ని చంద్ర‌బాబు కు లేఖ రాసారు. వీరు రాసిన లేఖ ద్వారా..మ‌రి కొంత మంది సీనియ‌ర్ అధికారులు సైతం స్పం దించారు. ఏపిలో రాజ‌కీయాల ను దృష్టి లో పెట్టుకొని అధికారుల ను బాధ పెడుతున్నారంటూ కొంద‌రు అధికారులు నేరుగా రాష్ట్రప‌తిని క‌లిసేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు.

 మ‌రి కొంద‌రు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

మ‌రి కొంద‌రు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

ఏపిలో అధికార మార్పిడి పై జ‌రుగుతున్న ఊహాగానాల‌తో కొంద‌రు అధికారులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఏపిలోనే కొన‌సాగాలా లేక కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లి పోవాలా అని సన్నిహితుల‌తో చ‌ర్చిస్తున్నారు. అధికార మార్పిడి జ‌రిగితే త‌మ తో ఎటువంటి ట్రీట్ మెంట్ ఉంటుందో అనే చ‌ర్చ మొద‌లైంది. అదే విధంగా..తిరిగి ఇదే ప్ర‌భుత్వం కొన‌సాగితే త‌మ కు మ‌రింత ప్రాధాన్య‌త పెరుగుతుంద‌ని భావిస్తున్నారు. దీంతో..ఏపి ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత నిర్ణ‌యం తీసుకొనే దిశ‌గా అధికారులు ఆలోచ‌న చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏపి మిన‌ర‌ల్ కార్పోరేష‌న్ లో ఉన్న‌తాధికారి, గతం లో కృష్ణా జిల్లాల క‌లెక్ట‌ర్ గా ప‌ని చేసి ప్ర‌స్తుతం కీల‌క విభాగం లో ఉంటున్న ముఖ్య అధికారి, రాజ‌ధాని వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న మ‌రో కీల‌క అధికారి సైతం అధికార మార్పిడి జ‌రిగితే కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిపోవాల‌నే ఆలోచ‌న లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో..ఏపి ఎన్నిక‌ల ఫ‌లితాలు అధికారుల మీద ప్ర‌భావం చూప‌నున్నాయి.

English summary
Some senior IAS officers in AP want to go for central services. If Govt changes in state they have no interest in continue in AP. Retired IAS officers planning to meet President on Chandra Babu comments on officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X