వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ కు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ .. ప్రభుత్వ సలహాదారుగా నియామకం

|
Google Oneindia TeluguNews

సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది జగన్ సర్కార్. జర్నలిజంలో ఆయనకున్న అపార అనుభవాన్ని తమ ప్రభుత్వ పాలనకు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్న వైసీపీ ప్రభుత్వం ఆయనకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించింది. జర్నలిజంలో అపార అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

<strong>పోలవరం పవర్ ప్రాజెక్ట్ విషయంలోనే హై కోర్టు తీర్పు .. నిర్మాణ పనుల్లో కాదన్న మంత్రి అనిల్ </strong>పోలవరం పవర్ ప్రాజెక్ట్ విషయంలోనే హై కోర్టు తీర్పు .. నిర్మాణ పనుల్లో కాదన్న మంత్రి అనిల్

 జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర సంబంధాలపై ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ నియామకం

జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర సంబంధాలపై ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ నియామకం

జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర సంబంధాలపై ఆయన ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తారు.
క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌పీ. సీసోడియా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆయన ఏపీ ప్రభుత్వ పాలనలో అంతర్రాష్ట్ర సంబంధాలపై ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ బాధ్యత నిర్వర్తించనున్నారు . ఇక దేవులపల్లి అమర్ విషయానికి వస్తే 1975లో ప్రజాతంత్ర పత్రికకు వ్యవస్థాపక సంపాదకుడిగా తన పాత్రికేయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం ఆంధ్రప్రభలో స్టాప్ కరస్పాండెంట్‌గా, సహాయ సంపాదకుడిగా పనిచేశారు.అనంతరం ఈనాడు, ఉదయం, ఆంధ్రభూమి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ పత్రికలలో పనిచేశారు.43 ఏళ్ళ పాత్రికేయ ప్రస్థానంలో ఆయన నేటికీ సాక్షి లో కన్సల్టింగ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

యూనియన్ నాయకుడిగా జర్నలిస్ట్ సమస్యల కోసం పోరాటం చేస్తున్న దేవులపల్లి అమర్

యూనియన్ నాయకుడిగా జర్నలిస్ట్ సమస్యల కోసం పోరాటం చేస్తున్న దేవులపల్లి అమర్

రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్‌ అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా రెండు సార్లు బాధ్యతలు నిర్వహించారు. అమర్ ప్రస్తుతం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక యూనియన్ నాయకుడిగా జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తూనే, నేటికీ తన పాత్రికేయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు దేవులపల్లి అమర్. అంతే కాదు ప్రెస్ కౌన్సిల్ ఇండియా సభ్యుడిగా ఆయన తన సేవలందిస్తున్నారు. అపార పాత్రికేయ వృత్తిలో ఆయనకు ఉన్న అపార అనుభవాన్ని వినియోగించుకోవాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

 ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న జర్నలిస్ట్ వర్గాలు

ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న జర్నలిస్ట్ వర్గాలు

జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు దేవులపల్లి అమర్ కు ఏపీ ప్రభుత్వం సముచిత స్థానం నుంచి గౌరవించని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అపార అనుభవం ఉన్న దేవులపల్లి అమర్ సేవలను వినియోగించుకోవాలన్న ఏపీ సర్కార్ నిర్ణయంపై పాత్రికేయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జర్నలిజంలో ఆయన అపార సేవలకు గుర్తింపుగా ఆయనకు తెలుగు యూనివర్సిటీ మరియు నార్ల ఫౌండేషన్ ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ఇచ్చి గౌరవించింది.

English summary
Senior journalist Amar Devulapalli has been appointed as adviser, National Media and Inter-State Affairs to the government of Andhra Pradesh on Thursday. His term is co-terminus with the term of Chief Minister of Andhra Pradesh. He is being given the status of a Cabinet Minister.In a journalistic career spanning over 43 years, Mr. Amar worked for Eenadu, Andhra Bhoomi, Udayam, and Andhra Prabha, besides editing an Independent weekly, Prajatantra. Presently, he hosts a news programme on Sakshi TV and is also consulting editor of the newspaper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X