• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెద్దాయ‌న ముందే హెచ్చ‌రించారు, ప‌ంతానికి పోయిన టిడిపి: పొత్తు పై తేల్చి చెప్పేసారు..

|

ఆ పెద్దాయ‌న కొంత కాలం క్రితం వ‌ర‌కూ టిడిపికి ఒక ర‌కంగా పెద్ద దిక్కు. ఆయ‌న మాట శిరోధార్యం. 2014 నుండి ఆయ‌న ఏది చెబితే అది టిడిపి నేత‌లు అమ‌లు చేసే ప‌రిస్థితి. కానీ, కీల‌క‌మైన విష‌యంలొ మాత్రం టిడిపి నేత‌లు ఆయ‌న మాట‌ను పెడ‌చెవిన పెట్టారు. పంతానికి పోయారు. ఫ‌లితం అనుభ‌వించారు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఏం జ‌ర‌గ‌నుందో ముందుగానే ఆ పెద్దాయ‌న ఓ అంచ‌నాకు వ‌చ్చేసారు.

టిడిపి-కాంగ్రెస్ కూట‌మి టిఆర్‌య‌స్ తో పోటీ ప‌డితే టిఆర్‌య‌స్ గెలుస్తుంద‌ని ముందుగానే జోస్యం చెప్పారు. తెలంగాణ లో టిఆర్‌య స్‌ కు మూడు వంతుల స్థానాలు ద‌క్కుతాయ‌ని తేల్చి చెప్పారు. అయినా..టిడిపి నేత‌లు విన‌లేదు. కాంగ్రెస్ తో పొత్తు పై స‌మీక్షించుకోమ‌ని సూచించారు..పొత్త‌పైనా తేల్చేసారు..2014 నుండి ఆ పెద్దాయ‌న మాట శిరోధార్యంగా పాటించిన టిడిపి..ఇప్పుడు మాత్రం ఆయ‌న మాట బేఖాత‌ర్ అంది.. ప్ర‌తిప‌లం అనుభ‌విస్తోంది..

ముందే హెచ్చ‌రించినా..పంతం కోసం

ముందే హెచ్చ‌రించినా..పంతం కోసం

తెలంగాణ ఎన్నిక‌ల పై ఏపిలోనూ ఆస‌క్తి నెల‌కొన్న స‌మ‌యంలో ఓ ఆస‌క్తి కర ప‌రిణామం చోటు చేసుకుంది. ఏపి తో స‌త్సంబంధాలు క‌లిగి రాజ్యంగ బ‌ద్దంగా ఉన్న‌త ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి విజ‌య‌వాడకు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో టిడిపి లోని కొంద‌రు ముఖ్య నేత‌లు మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసారు. ఆ స‌మ‌యం లో తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌స్తావ‌న వచ్చింది . తెలంగాణ లో ప్ర‌జా కూట‌మి అధికారంలోకి రాబోతోంద‌ని నేత‌లు చెప్పారు. మీరెలా గెలుస్తారు..తెలంగాణ లో కెసిఆర్ కు మూడు వంతుల స్థానాలు ద‌క్కుతాయి..మీరెందుకు అక్క‌డికి వెళ్లి చేతులు కాల్చుకుంటార‌ని ప్ర‌శ్నించారు. ఎక్క‌డో ఢిల్లీలో ఉన్న వ్య‌క్తికి ఇక్క‌డి రాజ‌కీయాలు ఏం తెలుస్తాయిలే..అనుకున్న టిడిపి నేత‌లు తాము తొలుత టిఆర్‌య‌స్ తో పొత్తు కోసం ప్ర‌తిపాదిస్తే తిర‌స్క‌రించార‌ని..ఖ‌చ్చితంగా కాంగ్రెస్ తో క‌లిసి అక్క‌డ అధికారంలోకి వ‌స్తామ‌ని పెద్దాయ‌న ముందు టిడిపి నేత‌లు ధీమా వ్య‌క్తం చేసారు.

పొత్తును అంగీకిరంచ‌రు..ఓట్ల బ‌దిలీ జ‌ర‌గ‌దు

పొత్తును అంగీకిరంచ‌రు..ఓట్ల బ‌దిలీ జ‌ర‌గ‌దు

అదే స‌మ‌యంలో పెద్దాయ‌న తెలంగాణ లో ప‌రిస్థితులు..టిడిపి పై ప్ర‌జాభిప్రాయం ఎలా ఉందో విశ్లేషించారు. నేత‌ల స్థాయిలో పొత్తులు కుదుర్చుకుంటే క్షేత్ర స్థాయిలో పొత్తుకు అంగీక‌రించే ప‌రిస్థితి ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ తో చేతులు క‌లిపితే టిడిపిలో మొద‌టి నుండి ఉన్న‌వారు హ‌ర్షించ‌ర‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. త‌ర‌తరాలుగా పార్టీల కోసం ఉప్పు నిప్పు లా ఉండే వ‌ర్గాలు..మీరు క‌ల‌వ‌గానే క‌లిసిపోర‌ని వివ‌రించారు. అయినా..టిడిపి నేత‌ల‌కు మాత్రం ఆ మాట‌ల్లోని ప‌ర‌మార్ధం అంత‌గా అర్దం కాలేదు. తాము ఏం నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌జ‌లు హ‌ర్షిస్తార‌నే అభిప్రాయంతోనే టిడిపి నేత‌లు చివ‌రి వ‌ర‌కూ వ్య‌వ‌హ‌రించారు. ఆ పెద్దాయ‌న రాజ‌కీయాల్లో యాక్టివ్ గా ఉన్న స‌మ‌యంలో దాదాపుగ 2014 నుండి ఆయ‌నే ఒక ర‌కంగా టిడిపికి పెద్ద దిక్కు. ఆయ‌న మాటే శిరోధార్యం. కానీ, ఆయ‌న మాట కాద‌న్నారు. ఆయ‌న సూచ‌న‌ల‌ను పెడ చెవిన పెట్టారు. ఫ‌లితం మాత్రం ఏంట‌నేది ఆ త‌రువాత తెలిసొచ్చింది. తాము పంతానికి పోయి ఎంత దారుణ‌మైన ఫ‌లితం అనుభ‌వించాల్సి వ‌చ్చింద‌ని ఆవేద‌న చెందుతున్నారు.

ఓట్ల బ‌దిలీ జ‌ర‌గ‌లేదు : పొత్తు స‌మీక్షించుకోండి..

ఓట్ల బ‌దిలీ జ‌ర‌గ‌లేదు : పొత్తు స‌మీక్షించుకోండి..

తెలంగాణ ఎన్నిక‌ల‌కు పోలింగ్ కు ముందు అదే పెద్దాయ‌న తో కొంద‌రు టిడిపి పెద్ద‌లు క‌లిసారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో తాము గెల‌వ‌బోతున్నామ‌ని ఆయ‌న ముందు ధీమా వ్య‌క్తం చేసారు. మీరెలా గెలుస్తారు..అక్క‌డ అధికార పార్టీకి సైలెంట్ వేవ్ ఉంది. ప్ర‌జ‌లు పొత్తును అంగీక‌రించ‌టం లేదు. ఓట్ల బ‌దిలీ జ‌ర‌గ‌దు అని ఆ పెద్దాయ‌న నిర్మొహ‌మాటంగా త‌న అభిప్రాయాన్ని తేల్చిచెప్పేసారు. మీరు..మీ అధ్య‌క్షుడు కూర్చొని కాంగ్రెస్ తో పొత్తు పై స‌మీక్షించుకోండ‌ని స‌ల‌హా ఇచ్చారు. అప్ప‌టికీ..టిడిపి నేత‌లకు ఆయ‌న చెప్పిన విష‌యంలో మ‌ర్మం అర్దం కాలేదు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితా లు విడుద‌ల అయిన త‌రువాత ఆ పెద్దాయ‌న చెప్పింది..జ‌రిగిందీ ఒక్క‌టే క‌దా అంటూ వారిలో వారు మ‌ధ‌న ప‌డి పోతూ క‌నిపించారు. అయితే, ఆ పెద్దాయ‌న కు రాజ్యాంగ ప‌ద‌వి వ‌చ్చిన తరువాత‌నే టిడిపి రాజ‌కీయంగా అనేక నిర్ణ‌యాలు తీసుకుంటూ...విమర్శల పాల‌వుతోంద‌నేది కొంద‌రు విశ్లేష‌కుల అభిప్రాయం..

English summary
One of the Constitutional Head warned TDP leaders about alliance with Congress. He suggested that once again review on alliance. He openly said that in telangana kutami will not win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X