చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిమ్మ‌ల్ని పంపిచేయాలంటే నిమిషం ప‌ని: ఇబ్బంది ప‌డ‌తావ్‌: మ‌ంత్రి పెద్దిరెడ్డి హంగామా..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెబుతున్న మాట‌ల‌కు..మంత్రులు అనుస‌రిస్తున్న తీరుకు ఏ మాత్రం పొంతన ఉండ‌టం లేదు. అటెండ‌ర్‌ను సైతం అన్నా..అని పిలిచే సంస్కృతి మా సీఎంది అని చెప్పుకొనే వైసీపీ నేత‌లు త‌మ వంతు వ‌చ్చేస‌రికి మాత్రం అధికార ద‌ర్పం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇందులో సీనియ‌ర్ మంత్రులు అతీతం కాదు. తాజాగా సీనియ‌ర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా అధికారుల‌తో స‌మీక్ష స‌మ‌యంలో చేసిన వ్యాఖ్య‌లు..హ‌చ్చ‌రిక‌లు ఇప్పుడు చ‌ర్చ నీయాంశంగా మారాయి. మంత్రి త‌న అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించారు. అధికారుల‌ను ఏక వ‌చ‌నంతో పిల‌వ‌టం తో పాటుగా..తాను త‌ల‌చుకుంటే నిమిషం ప‌ని అంటూ హెచ్చ‌రించారు.

సీనియ‌ర్ మంత్రి అయినా...తీరు మాత్రం..

సీనియ‌ర్ మంత్రి అయినా...తీరు మాత్రం..

సీనియ‌ర్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చిత్తూరు జిల్లా స‌మీక్ష‌లో అధికారుల పైన చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాం శంగా మారాయి. ప్రభుత్వం మారినా మీరు మారలేదు. మీ తీరు మారలేదు. పద్ధతి మార్చుకోండి. లేకుంటే జిల్లా నుంచి మిమ్మల్ని పంపించేయాలంటే నాకు నిమిషం పట్టదు అంటూ ఫైర్ అయ్యారు. అధికారులను ఏకవచనంతో సంబోధిం చటం పైన ఉద్యోగులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.మరో మంత్రి నారాయణస్వామి తొలుత అధికారుల ను గౌర‌వం గానే పిలిచినా.. తరువాత నువ్వు అనే సంబోధించడం పై అధికారులు నొచ్చుకున్నారు. ఉద్యానవన శాఖ జేడీ సర స్వ తి జిల్లాలో ఇన్‌చార్జి డీడీగా పనిచేస్తున్నారు. తన శాఖ గురించిన ప్రగతిని ఆమె నివేదిస్తుండగా మధ్యలో కల్పించుకు న్న పెద్దిరెడ్డి ‘మీ శాఖలో రాయితీలన్నీ డబ్బులకు అమ్మేశారు. ఎన్నోసార్లు ఫోన్‌లో హెచ్చరించా. అయినా మారలేదు. పద్ధతి మార్చుకో..లేకుంటే ఇబ్బంది పడతావ్‌. నిన్ను జిల్లా నుంచి పంపాలంటే నాకు నిమిషం పట్టదు అంటూ హెచ్చ రించారు. దీని పైన జిల్లాలో చ‌ర్చ సాగుతోంది.

మ‌హిళా అధికారితో పాటుగా మ‌రొక‌రి పైనా..

మ‌హిళా అధికారితో పాటుగా మ‌రొక‌రి పైనా..

ఉద్యానవన శాఖ జేడీ సరస్వ‌తి పైన మంత్రి పెద్దిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా కూర్చుండిపోయారు. ఆ తర్వాత ఏపీఎంఐపీ పీడీ విద్యాసాగర్‌ మీద కూడా మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. మూడు నియోజకవర్గాలకు ఒక్కసారిగా రూ.35 కోట్ల డ్రిప్‌ ఇరిగేషన్‌ను ఎలా మంజూరు చేస్తావంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. నేను ఆపేశాను కాబట్టి సరిపోయింది. మీ తీరు బా..లేదంటూ సీరియ‌స్ అయ్యారు. దీంతో..ఆ అధికారి వివరణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. దీని పైనా మంత్రి సీరియ‌స్ అయ్యారు. నీ వివరణ నాకు అవసరం లేదు కూర్చో అని గదమాయించారు. అగ్రికల్చర్‌ జేడీ విజయ్‌కుమార్‌ మీద కూడా ఆయన సీరియస్‌ అయ్యారు. కౌలు రైతుల జాబితా తయారు చేయడంలో నిర్లక్ష్యం చేశారని, మళ్లీ కొత్త జాబితాను జాగ్రత్తగా తయారుచేయాలని.. నీ సోదంతా నాకొద్దని చెప్పారు. కలెక్టర్‌తో సహా అందరు అధికారులు వినండి. మా ఎమ్మెల్యేలు, నాయకులు మీ వద్దకు తెచ్చిన సమస్యల్ని పరిష్కరించండి అని స్ప‌ష్టం చేసారు. అధికారులు త‌ప్పు చేస్తే వ్య‌క్తిగ‌తంగా మంద‌లించాలి..లేదా స‌మీక్ష‌లో హుందాగా స‌రిచేసుకోమ‌ని సూచించాలి కానీ..ఈ ర‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టం స‌రి కాద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

ముఖ్య‌మంత్రి ఆదేశాలు బేఖాత‌ర్‌...

ముఖ్య‌మంత్రి ఆదేశాలు బేఖాత‌ర్‌...

ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ అధికారుల‌తో హుందాగా మెల‌గాల‌ని అనేక సార్లు మంత్రుల‌కు సూచించారు. అదే స‌మ‌యంలో తాజాగా శాస‌న‌స‌భ‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ను ప‌లువురు నేత‌లు గుర్తు చేస్తున్నారు. ప్రతిప‌క్ష నేత చంద్ర బాబు గ‌తంలో చేసిన జ‌గ‌న్ ఇచ్చిన హామీ గురించి మాట్లాడుతూ ఒక పేప‌ర్ క్లిప్పింగ్ చూపించారు. ఆ స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ అక్క‌డ ఉన్న అటెండ‌ర్‌ను ఉద్దేశించి అటెండ‌ర్ అన్నా..కొంచెం ఆ పేప‌ర్ అందుకో అన్నా..అంటూ చెప్ప‌టం ద్వారా జ‌గ‌న్ ఎంత హుందాగా ఉంటార‌నే విష‌యాన్ని ప్ర‌చారం చేసారు. కానీ, మంత్రులు మాత్రం ఈ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికార ద‌ర్పం ప్ర‌దర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం పైన పెద్దిరెడ్డి ఏ ర‌కంగా వివ‌ర‌ణ ఇస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
Senior Minister Peddireddy Ramachadra Reddy attitude with govt officer now became serious discussion in Dist. Minister warned officers directly in district review.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X