గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

గుంటూరు:వైసిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారే విషయం అనూహ్య పరిణామాల నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ప్రతిష్ట అడుగంటుతున్న నేపథ్యంలో తమ రాజకీయ మనుగడ దృష్ట్యా పలు కీలక నేతలు ఆ పార్టీ నుంచి బైటపడేందుకు చూస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి, బిజెపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిలో చేరేందుకు సర్వ సన్నద్దం అయినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో అసలే పార్టీ కష్టాల్లో ఉన్న తరుణంలో ఇలా ముఖ్యనేతలంతా బిజెపి విడిచి వెళితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రహించిన బిజెపి అధిష్టానం యుద్దప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ముందు కన్నాను వైసిపి లో చేరే కార్యక్రమం నిరవధింగా వాయిదా వేసుకోమని ఆదేశించినట్లు సమాచారం.

వైసిపిలో చేరేందుకు సిద్దం...కానీ

వైసిపిలో చేరేందుకు సిద్దం...కానీ

గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితులైన రాజకీయ నేత. పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే ఎపిలో బలమైన కాపు సామాజికవర్గం నేత. ఎన్నికల్లో గెలుపుల ఆధారంగా చూస్తే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. కాంగ్రెస్ నమ్మినబంటుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎపిలో ఆ పార్టీ దారుణంగా దెబ్బతిన్న పరిస్థితుల్లోనూ ఆ పార్టీ తరుపునే పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనతరం రాజకీయ మనుగడ కోసం బిజెపిలో చేరారు. అయితే అక్కడ తన సీనియారిటీతో సహా ఏ రకంగాను తన సేవల్ని భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. చివరలో బిజెపి ఎపి అధ్యక్ష పదవైనా దక్కుతుందని ఆశిస్తే అది అవకాశం లేదని తేలిపోవడంతో బిజెపిని వీడాలని నిర్ణయించుకున్నారు.

బిజెపి అవుట్...వైసిపి ఇన్...అని డిసైడయ్యారు

బిజెపి అవుట్...వైసిపి ఇన్...అని డిసైడయ్యారు

గతంలో రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ ఏ విధంగానైతే అంపశయ్య మీద ఉందో ఇప్పుడు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి కూడా రాష్ట్రంలో అదే పరిస్థితుల్లో ఉండటంతో ఇదే సిట్యుయేషన్స్ కారణంగా ఒకసారి దెబ్బతిన్న కన్నా లక్ష్మీనారాయణ మరోసారి దెబ్బతినకూడదనే ఆలోచనతో వైసిపి వైపు అడుగేశారు. ఆ క్రమంలో వైకాపాలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. అనుచరులతో సుదీర్ఘ చర్చలు జరిపి తన నిర్ణయాన్ని ఖరారు చేసుకొని ఆ తరువాత మంగళవారం బిజెపికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రామ్ మాధవ్, సతీష్ జీకి ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఆ తరువాత తనతో టచ్ లోకి వచ్చిన వైసిపి నేతలతో సంప్రదింపులు జరిపి ఏప్రిల్ 25 న వైకాపాలో చేరేందుకు ఉద్యుక్తులయ్యారు.

ఇప్పటిదాకా స్పందించని బిజెపి...ఇప్పుడు స్పందించింది

ఇప్పటిదాకా స్పందించని బిజెపి...ఇప్పుడు స్పందించింది

అయితే కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసేంతవరకు ఆయనను పట్టించుకోని బిజెపి ఆయన రిజైన్ లెటర్ పంపాక మేలుకొంది. ఆయన లాంటి సీనియర్ నాయకుడు, బలమైన కాపు సామాజికవర్గం నేత పార్టీ నుంచి వెళితే జరిగే నష్టం అంచనా వేసింది. అసలే ఎపిలో అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న బిజెపి నుంచి కన్నా లాంటి మాస్ లీడర్ వెళ్లిపోతే ప్రస్తుతం పెద్ద దెబ్బ పడటంతో పాటు కన్నా పార్టీ వీడిన తరువాత వివిధ కారణాలతో పార్టీలో అసంతృప్తులుగా ఉన్న ఎపి బిజెపి నాయకులు అందరూ తమకు నచ్చిన పార్టీ ఎంచుకొని వాటిలో చేరిపోవడం ఖాయమని విశ్లేషించింది. అందుకే కన్నా లక్ష్మీ నారాయణ ను ఆపాలని గట్టిగా నిర్ణియించింది.

సుదీర్ఘ చర్చలు...రంగంలోకి అమిత్ షా

సుదీర్ఘ చర్చలు...రంగంలోకి అమిత్ షా

ఈ క్రమంలో బిజెపి ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి కన్నాను బుజ్జగించే పనిలో పడినట్లు తెలిసింది. ఈ తతంగం కొన్ని గంటలపాటు నడచినట్లు తెలుస్తోంది. అయితే ఎపిలో బిజెపి పరిస్థితి రీత్యా ఆ పార్టీని వీడాలని స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్న కన్నా తాను పార్టీ వీడటానికి కారణాలను గట్టిగానే వినిపించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవని సోమూ వీర్రాజుకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టడాన్ని, తనను వలస నేతంటూ పక్కన బెట్టడాన్ని జీర్ణించుకోలేక పార్టీ వీడుతున్నట్లు బిజెపి పెద్దలకు వివరించారని తెలిసింది. అయితే ఈ సమయంలో కన్నా పార్టీ వదిలివెళ్లకుండా చూడాలని బిజెపి కూడా గట్టిగానే నిర్ణయించుకోవడంతో స్వయంగా అమిత్ షానే రంగంలోకి దిగి మీ రాజీనామా ఆమోదించడం లేదని, ఆమోదించేవరకు పార్టీలో కొనసాగమని ఆదేశం లాంటి విన్నపంతో కన్నా లక్ష్మీనారాయణ టెన్షన్ పడినట్లు తెలిసింది.

ఆ ఒత్తిడితోనే...అస్వస్థత

ఆ ఒత్తిడితోనే...అస్వస్థత

అయితే బిజెపి తన విషయంలో ఇంత పట్టుబడుతుందని ఊహించని కన్నా మరోవైపు వైసిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న క్రమంలో బాగా ఒత్తిడికి గురై
అస్వస్థత పాలయ్యారని ప్రచారం జరుగుతోంది. మంగళవారం అర్థరాత్రి దాటాక కన్నా కు బిపి పెరిగిపోవడంతో హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. హైబిపి నేపథ్యంలో కన్నాకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో బిజెపి కోరుకున్నట్లుగానే ఆయన పార్టీ వీడే కార్యక్రమం వాయిదా పడింది. వైసిపి నుంచి రెండు ఎమ్మెల్యే సీట్లు, అధికారంలోకి వస్తే మంత్రి పదవి, లేదా ఒక ఎంపి, ఎమ్మెల్యే స్థానాలు ఇలాంటి ఆప్షన్లు ఇచ్చిన తరుణంలో, అవి సంతృప్తికరంగానే భావించి ఆ పార్టీలో చేరేందుకు సంసిద్దమైన కన్నాను తదనంతరం బిజెపి నిలువరించగలదో లేదో మరి కొద్ది కాలం వేచి చూడాల్సిందే.

English summary
Senior Politician, Former BJP leader Kanna Laxmi Narayan has suffered serious illness earlier. He was hospitalized due to high B P. who has taken the decision to join in the YCP, but pressure from BJP to continue in party leads to tension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X