• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అక్కడ ఆమె గెలిచి బీజేపీకి అధికారం.. ఇక్కడ ఈయన గెలిచి టీడీపీ పవర్ ఖతం

|

హైదరాబాద్ : రాజకీయాల్లో జ్యోతిష్య వాస్తు శాస్త్రాలతో పాటు సెంటిమెంట్లు కూడా ఉంటాయా?.. అన్నీ లెక్కలు చూసుకున్న తర్వాతే లీడర్లు ముందుకెళతారా? ఇలాంటి పొలిటికల్ ఆస్ట్రాలజీ, సెంటిమెంట్లపై కురిసే లక్షలాది ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. నామినేషన్ వేసేటప్పుడైనా.. ప్రచారం ప్రారంభించేటప్పుడైనా పండితులు పెట్టిన ముహుర్తాలనే నేతలు ఫాలో అవుతుంటారు.

ఇక కొన్ని నియోజకవర్గాలైతే ఆయా పార్టీలు అధికారంలో ఉండాలా.. లేదంటే ప్రతిపక్షంలో ఉండాలా అనేది డిసైడ్ చేస్తుంటాయి. అదలావుంటే కొందరు నేతల ఫేట్ ఇంకోలా ఉంటుంది. వాళ్లు గెలిచినప్పుడు పార్టీ అధికారంలోకి రాదు.. వాళ్లు ఓడినప్పుడు పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇలాంటి ట్విస్టులు రాజకీయాల్లో చాలానే కనిపిస్తాయి. అయితే ఏపీకి చెందిన ఓ లీడర్ గెలవడంతో టీడీపీ పవర్ ఊస్ట్ అయిందనే వాదనలున్నాయి. అలాగే ఢిల్లీలో ఓ మహిళా నేత గెలవడంతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది.

---------------------------

టీఆర్ఎస్ ఇలాకాలో బీజేపీ హవా.. 67 సంవత్సరాల చరిత్రలో బోణి కొట్టిందిగా..!

పవర్ ఊస్టైనా.. అధికారం చేజిక్కినా.. సెంటిమెంట్ కీ రోల్

పవర్ ఊస్టైనా.. అధికారం చేజిక్కినా.. సెంటిమెంట్ కీ రోల్

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ కొన్నిసార్లు సెంటిమెంట్ కూడా వర్కవుట్ అవుతుందనేది చర్చానీయాంశం. దేశవ్యాప్తంగా ఎక్కడా చూసినా కూడా ఇలాంటి ట్విస్టులు కనపడతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ సెగ్మెంట్ అదే కోవలోకి వస్తుంది. నాలుగు దశాబ్ధాలుగా అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో.. ఆ పార్టీయే అధికారంలోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే క్రమంలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్, ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మీనాక్షి లేఖి విషయంలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూద్దాం.

 ఇక్కడ పయ్యావుల.. అక్కడ మీనాక్షి లేఖి

ఇక్కడ పయ్యావుల.. అక్కడ మీనాక్షి లేఖి

అనంత‌పురం జిల్లాలోని ఉర‌వ‌కొండ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్య‌ర్థి ప‌య్యావుల‌ కేశ‌వ్ గెలుపొందారు. వైసీపీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్ రెడ్డిపై కేశ‌వ్ 2 వేల 132 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే పయ్యావుల కేశవ్ గెలిస్తే టీడీపీ అధికారంలోకి రాదని.. ఆయన ఓడిపోయినప్పుడు మాత్రం టీడీపీ అధికారంలోకి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈసారి ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గెలవడంతో టీడీపీ అధికారం కోల్పోయిందనే ట్రోల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

2004, 2009 ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే.. ఆ రెండు సందర్భాల్లో పయ్యావుల కేశవ్ టీడీపీ తరపున బరిలో నిలిచి గెలిచారు. కానీ టీడీపీ మాత్రం రెండు సార్లు అధికారంలోకి రాలేదు. 2014 తీసుకున్నట్లయితే టీడీపీ అధికారంలోకి వచ్చింది.. కానీ ఆయన ఓడిపోయారు. ఈసారి ఆయన గెలిచారు.. టీడీపీ ఉన్న అధికారం కోల్పోయింది. పయ్యావుల కేశవ్ అనే కాకుండా.. ఉరవకొండ నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో.. ఆ పార్టీ అధికారంలోకి రాదన్న సెంటిమెంట్ ఇలా నిజమైందన్నమాట.

బీజేపీకి ఆ సెగ్మెంట్‌తో సెంటిమెంట్

బీజేపీకి ఆ సెగ్మెంట్‌తో సెంటిమెంట్

ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి న్యూఢిల్లీ లోక్‌సభ సెగ్మెంట్‌తో సెంటిమెంట్ ముడిపడి ఉంది. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీదే అధికారం అన్నమాట. అలా 2014లో బీజేపీ నుంచి మీనాక్షి లేఖి విజయం సాధించడంతో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈసారి కూడా న్యూఢిల్లీ నుంచి ఆమె పోటీచేయడం.. 2 లక్షల 56 వేల పైచిలుకు ఓట్లతో బంపర్ మెజార్టీ కొట్టడం.. బీజేపీ కూడా దేశవ్యాప్తంగా విజయఢంకా మోగించడానికి కారణమైందని అంటారు.

లోక్‌సభ ఎన్నికల వేళ న్యూఢిల్లీ సెగ్మెంట్ పేరు మార్మోగుతుంటుంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో.. అదే పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈ నియోజకవర్గం దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తోంది. 1992 ఉప ఎన్నికలు మొదలు ఇప్పటివరకు న్యూఢిల్లీ స్థానంలో ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుందో.. అదే పార్టీ కేంద్రంలో కొలువుదీరుతోంది.

----------------------

కేసీఆర్ వల్ల ఆ మూడు చోట్ల గెలుపు..! పెద్దపల్లి విషయంలో బీజేపీ తప్పటడుగు

సెంటిమెంట్ హవా

సెంటిమెంట్ హవా

2009, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ విజయం సాధించడంతో.. ఆ రెండు సార్లు కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సెంట్రల్ లో కొలువుదీరింది. 1998, 1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్‌మోహన్‌ విజయంతో వాజ్‌పేయి నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక్కడ చిత్రమేంటంటే.. 1996లో పార్లమెంటులో మెజార్టీ లేక వాజ్‌పేయి గవర్నమెంట్ 13 రోజులకే పడిపోయింది. అప్పటి ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా జగ్‌మోహన్‌ గెలుపొందడం గమనార్హం.

English summary
Centiment Workouts In Politics. In Andhrapradesh, Uravakonda TDP Candidate Payyavula Keshav won as MLA. But, the TDP Government fails to came into power. New Delhi Lok Sabha Segment Won by BJP Candidate Meenakshi Lekhi. As per Centiment, who won the New Delhi Segment, their party will comes into power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more