వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి ఆర్టీసికి తీవ్ర నష్టం.!ఐనా తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకారం.!మంగళవారం నుండి బస్సులు తిరిగే ఛాన్స్.

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : కరోనా ఆంక్షల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెసులుబాటుతో అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ గాడిలో పడుతుందని అందరూ భావించారు. కాని ఎప్పరూ ఊహించని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల రవాణా వ్యవస్థలో ప్రతిష్టంభన కొనసాగుతూ వస్తోంది. దసరా పండుగ సందర్బంగా ప్రతిష్టంభన తొలగి రెండు రాష్ట్రాల మద్య బస్సులు తిరుగుతాయని అందరూ ఊహించారు. కాని దసరా పండుగ సందర్బంగా కూడా రెండు రాష్ట్రాల మద్య అవగాహన కుదరక పోవడంతో ప్రయాణీకులు అనేక సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల మద్య తాజాగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నట్టు తెలుస్తోంది.

Recommended Video

APSRTC : ఏపీ-తెలంగాణ మధ్య RTC బస్సుల రాకపోకలపై ప్రతిష్టంభన.. సరిహద్దుల వరకే బస్సులు!
రవాణా వ్యవస్థకు పచ్చజెండా.. తెలుగు రాష్ట్రాల మధ్య కుదురుతున్న ఒప్పందాలు..

రవాణా వ్యవస్థకు పచ్చజెండా.. తెలుగు రాష్ట్రాల మధ్య కుదురుతున్న ఒప్పందాలు..


తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డట్టు తెలుస్తోంది. ఓవైపు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ మరీ రెట్టింపు కావడం, రేట్లు అధికంగా వసూలు చేస్తున్నా, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ చేష్టలుడిగిపోయింది తప్ప పరిష్కారం చూపలేదు. చివరకు దసరా సీజన్ కూడా అయిపోయింది. ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది, అదే సమయంలో ప్రయాణికుల జేబులకి భారీగా చిల్లులు కూడా పడ్డాయి. తాజాగా రెండు రాష్ట్రాల రవాణా శాఖ అధికారుల మధ్య సయోధ్య కుదిరడంతో రెండు తెలుగు రాష్టాల మద్య బస్సులకు పచ్చజెండా ఊపే తరుణం సమీపించినట్టు తెలుస్తోంది.

ఏపి ప్రతిపాదనలను తిరస్కరించిన టీ సర్కార్.. నష్టమని తెలిసినా పట్టు సడలించుకున్న ఏపి..

ఏపి ప్రతిపాదనలను తిరస్కరించిన టీ సర్కార్.. నష్టమని తెలిసినా పట్టు సడలించుకున్న ఏపి..


సోమవారం జరిగిన ఇరురాష్ట్రాల రవాణ శాఖ ఉన్నతాదికారుల చర్చలు కొలిక్కి వస్తే మంగళవారం నుండి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పునఃప్రారంభమవుతాయి. తెలంగాణలో ఏపీ బస్సులు, ఏపీలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు ప్రత్యక్షమతాయి. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారుల మధ్య కుదిరిన అవగాహన మేరకు, తెలంగాణ ఆర్టీసీ ఏపీ పరిధిలో 1,61,258 కిలోమీటర్ల మేర బస్సులను తిప్పేందుకు నిర్ణయం తీసుకుంది. అదే ఏపీ తెలంగాణ పరిధిలో 1,60,919 కిలోమీటర్ల మేర తన బస్సుల్ని నడిపేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ ముందు వరకు ఏపీ బస్సులు 2,65,367 కిలోమీటర్లు తన బస్సుల్ని తెలంగాణ పరిధిలో నడపగా, తాజా ప్రతిపాదనల మేరకు లక్షకు పైగా కిలోమీటర్లలో కోతపడనున్నట్టు నిర్ధారణ అవుతోంది.

ఏపీకి భారీ నష్టం.. ప్రత్యామ్నాయం దిశగా ఏపి ప్రణాళికలు..

ఏపీకి భారీ నష్టం.. ప్రత్యామ్నాయం దిశగా ఏపి ప్రణాళికలు..


అంతే కాకుండా అమరావతి-హైదరాబాద్ మార్గంపై తెలంగాణ రవాణా అధికారులు సూచించిన ప్రతిపాదనలే అమలు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ఏపీ 374 బస్సులను నడుతుండగా, తాజా నిబంధనల ప్రకారం వాటి సంఖ్య 192కి తగ్గించుకోబోతున్నారు. తెలంగాణ బస్సులు ఇప్పటి వరకూ ఈ రూట్ లో కేవలం 162మాత్రమే తిరిగేవి. కొత్త అవగాహన ప్రకారం ఇకపై ఆ సంఖ్య 273కి పెరుగుతుంది. కర్నూల్ సెక్టార్ లో 25వేలు, భద్రాచలం సెక్టార్ లో 13వేల కిలోమీటర్ల మేర ఏపీ బస్సు సర్వీసుల్ని తగ్గించుకుంటోంది. నూతన అవగాహనతో ఏపీఎస్ఆర్టీసీకి భారీ నష్టం చేకూరుతుంది. అయినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ వెనక్కు తగ్గినట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఫలప్రదం దిశగా చర్చలు.. వీలైతే రేపటినుండి బస్సులు తిరిగే అవకాశం..

ఫలప్రదం దిశగా చర్చలు.. వీలైతే రేపటినుండి బస్సులు తిరిగే అవకాశం..


ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం 270 కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీకి నష్టం వస్తుందని అంచనా. ఈమేరకు తెలంగాణ ఆర్టీసీకి లాభం చేకూరే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. తాము బస్సుల సంఖ్య తగ్గించుకునే ప్రసక్తే లేదని, కావాలంటే తెలంగాణ ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుకోవచ్చని ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. కాని ఈ ప్రతిపాదనకు తెలంగాణ అధికారుల నుండి సానుకూల స్పందన రాలేదు. దీంతో తెలంగాణ ప్రతిపాదనలకే ఆమోదం తెలపాలని ఏపీ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనలతో వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాలను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

English summary
Even during the Dussehra festival, there seems to be a lack of understanding between the two states, which seems to have caused many problems for travelers. However, it seems that the recent talks between the two Telugu states are going on fruitfully.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X