విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోర్టుకు కాల్ డేటాలను సమర్పించిన సర్వీస్ ప్రొవైడర్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో డొకొమో, వోడాఫోన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు కాల్‌డేటాను శుక్రవారం కోర్టుకు అందజేశారు. ఇప్పటికే ఐడియా, ఎయిర్‌టెల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు 29 నెంబర్ల కాల్‌డేటాను కోర్టుకు ఇచ్చారు. దీంతో కోర్టు తుదుపరి విచారణను సెప్టెంబరు 11కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరో మలుపు తిరిగింది. విజయవాడ భవానీపురం పోలీసు స్టేషన్‌లో ఫోన్ ట్యాపింగ్‌పై మరో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బిఎస్‌ఎన్‌ఎల్, ఐడియా, భారతి ఎయిర్‌టెల్ సంస్థలు కాల్ డేటా వివరాలను ఆగస్టు 14వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించింది.

Service providers submit call data to court

ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ కేసులో కూడా విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది.

విజయవాడ కోర్టు తనకు టెలికాం సర్వీసు ప్రొవైడర్లు ఇచ్చిన కాల్ డేటా వివరాలను చూడకుండా సీల్డ్ కవర్‌ను యథాతథంగా హైకోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి అఫ్జల్‌పుర్కార్ ఆదేశించారు.

English summary
Two more service providers submited call data to Vijayawada court today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X