ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పడవ ప్రమాదంపై వారెలా బాధ్యులు: అఖిల వైపు వేళ్లు! ఆ కీలక వ్యక్తిని కాపాడుతున్నారా?

కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తన వేలును మంత్రి అఖిలప్రియ వైపు చూపిస్తున్నారు. బోటు ప్రమాదంలో అధికారుల తప్పిదం లేదని ఆమె చెప్పారు. కానీ అధికారుల పొరపాటు కూడా ఉందని అర్థమవుతోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తన వేలును మంత్రి అఖిలప్రియ వైపు చూపిస్తున్నారు. బోటు ప్రమాదంలో అధికారుల తప్పిదం లేదని ఆమె చెప్పారు. కానీ అధికారుల పొరపాటు కూడా ఉందని అర్థమవుతోంది.

Recommended Video

Krishna Boat Tragedy : Shocking Facts, తీగ లాగితే డొంకంతా కదిలింది | Oneindia Telugu

బోటు ప్రమాదంలో మరో ట్విస్ట్, అది అసలు లాంచీ కాదు! అఖిలప్రియకే షాకిచ్చారుబోటు ప్రమాదంలో మరో ట్విస్ట్, అది అసలు లాంచీ కాదు! అఖిలప్రియకే షాకిచ్చారు

అధికారులకు అండగా

అధికారులకు అండగా

తమ తప్పులేదని చెప్పేందుకు అధికారులు రెండు రోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేశారు. అందులో వారు బోటును ఇక్కడ పెట్టవద్దని చెప్పినట్లుగా ఉంది తప్పితే, ప్రయాణీకులను తీసుకు వెళ్లవద్దని కచ్చితంగా చెప్పినట్లు లేదు. ఈ విషయంలో అఖిల స్పందిస్తూ.. బోటు అక్కడ పెట్టకుండా మరో చోటుకు వెళ్లినప్పుడు అక్కడ సమయం అయిపోవడం వల్ల అధికారులు లేరని చెప్పారు.

అధికారుల బాధ్యత

అధికారుల బాధ్యత

రివర్ బోటింగ్ సంస్థలో అధికారుల పాత్ర ఉండటం కూడా గమనార్హం. దీంతో అధికారులపై చర్యలు తీసుకున్నారు. పలువురు అధికారులపై వేటు వేశారు. అయితే, అసలు బాధ్యుడిని వదిలేస్తున్నారా అనే చర్చ సాగుతోంది.

స్పష్టత ఇవ్వని అఖిలప్రియ

స్పష్టత ఇవ్వని అఖిలప్రియ

పలువురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తున్నామని మంత్రి అఖిలప్రియ ప్రకటించారు. కానీ వీరు ఏ విధంగా ఈ ప్రమాదానికి కారకులయ్యారనే వివరాలు వెల్లడించలేదని చెబుతున్నారు.

ఆయనను రక్షించేందుకు ప్రయత్నాలనే ఆరోపణలు

ఆయనను రక్షించేందుకు ప్రయత్నాలనే ఆరోపణలు

పర్యాటక శాఖ, ఏపీటీడీసీలో కీలక బాధ్యతల్లో పని చేస్తున్న ఓ ముఖ్య అధికారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆ అధికారిని రక్షించే దిశగా ఇప్పుడు చేపట్టిన శాఖాపరమైన అంతర్గత విచారణ సాగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని వార్తలు వచ్చాయి.

ఆళ్లగడ్డలోనే జగన్ నిలదీత

ఆళ్లగడ్డలోనే జగన్ నిలదీత

బోటు ప్రమాదానికి సీఎం చంద్రబాబు, మంత్రి అఖిలప్రియ బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కూడా డిమాండ్ చేశారు. ప్రమాదానికి బాధ్యత వహిస్తూ అఖిల రాజీనామా చేశారా అని నిలదీశారు. ఆయన ఏకంగా ఆళ్లగడ్డలోనే అఖిలప్రియ రాజీనామా అంశాన్ని ప్రస్తావించారు.

English summary
Minister Bhuma Akhila Priya on Wednesday said that Seven tourism deportment officials suspended on boat accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X