మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈతకు వెళ్లి ఏడుగురు మృతి: హైదరాబాద్ వాసులుగా గుర్తింపు

|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్: జిల్లాలోని ఆమన్‌గల్ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మండలంలోని సరికొండ గౌరమ్మ చెరువులో ఈతకని వెళ్లిన ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ చాంద్రయాణగుట్ట సమీపంలోని హాషిమాబాద్ ప్రాంతానికి చెందిన బాసిత్, అతని కుటుంబసభ్యులు, బంధువులు చరికొండ గ్రామ సమీపంలోని గౌరమ్మ చెరువు వద్దకు ఈతకు వెళ్లారు.

Seven dead fell into the pond

ఒక్కొక్కరిగా చెరువులో దిగి లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లడంతో మునిగి మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారిని రుఖయ్య(18), ముసరత్(16), బాసిత్(30), రెహ్మాన్(15), మున్నాబేగం(14)గా గుర్తించారు. ఆరు మృతదేహాలు వెలికితీయగా, మరొక మృతదేహం కోసం గాలిస్తున్నారు.

4 కోళ్లఫారాలు దగ్ధం: రూ.10 లక్షలు నష్టం

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో నాలుగు కోళ్లు ఫారాలు దగ్ధమైయ్యాయి. మంటలు సమీపంలోని పామాయిల్ తోటలకు వ్యాపించాయి. ఈ ఘటనలో రూ. 10 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

English summary
Seven persons had died fell into the pond in Mahabubnagar district on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X