వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిడెడ్ ఉసురుతీస్తున్న జగన్ సర్కార్-బెజవాడ మాంటిస్సోరి మూసివేత-అసలు ప్లాన్ ఇదేనా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఎయిడెడ్ విద్యాసంస్ధల ఉసురుతీసేందుకు జగన్ సర్కార్ భారీ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వారి సిబ్బందిని, భవనాలు, స్ధలాల్ని ఇచ్చేయాలని వారిపై ఒత్తిడి పెంచుతోంది. విద్యాశాఖ అధికారుల సాయంతో ఎయిడెడ్ విద్యాసంస్ధలపై పెంచుతున్న ఒత్తిడి లక్షలాది మంది పేద విద్యార్ధుల ఉసురుతీసేలా కనిపిస్తోంది. విలీనం చేయకపోతే ఎయిడ్ నిలిపేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో విజయవాడలోని ప్రతిష్టాత్మక మాంటిస్సోరి స్కూల్ మూసేయాలని నిర్ణయం తీసుకుంది.

 ఎయిడెడ్ సేవలు

ఎయిడెడ్ సేవలు

దేశవ్యాప్తంగా స్వాతంత్రానికి పూర్వం నుంచే ఎయిడెడ్ విద్యాసంస్ధలు తమ సేవలు అందిస్తున్నాయి. మన దేశంలో స్వాతంత్రం తర్వాత ప్రభుత్వం వద్ద అఁదరికీ విద్య నందించే పరిస్ధితులు లేకపోవడంతో ఎయిడెడ్ విద్యాసంస్ధలకు ఎయిడ్ రూపంలో కొంత మొత్తం ఏటా చెల్లించి సాయం చేస్తోంది. దీంతో దశాబ్దాలుగా ఈ విద్యాసంస్ధలు తమ సేవల్ని అందిస్తున్నాయి. ఇవి ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రైవైటు స్కూళ్లకు, ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా సొంత భవనాలు, విద్యా ప్రమాణాలతో కొనసాగుతున్న పరిస్ధితులు చాలా చోట్ల ఉన్నాయి. ఇందులో చదువుకున్న వారు దేశ విదేశాల్లో స్ధిరపడ్డారు. మరికొందరు తాము చదువుకున్న విద్యాసంస్ధల్లోనే టీచర్లుగా పనిచేస్తూ ఆయా సంస్ధల రుణం తీర్చుకుంటున్నారు.

 సర్కారీ సాయం చిన్నది, పెత్తనం పెద్దది

సర్కారీ సాయం చిన్నది, పెత్తనం పెద్దది

ఇప్పటివరకూ ఎయిడెడ్ విద్యాసంస్ధల్లో స్కూళ్లు, కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఉండగా.. వీటికి ప్రభుత్వం ఎయిడ్ రూపంలో చేస్తున్న సాయం నామమాత్రమే. దీంతో ఆయా సంస్ధలు కూడా విద్యార్ధుల నుంచి నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తూ విద్యను అందిస్తున్నాయి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా దశాబ్దాలుగా పనిచేస్తూ ప్రజా జీవనంలో భాగంగా మారిపోయాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆడిట్ తో పాటు వివిధ రూపాల్లో ఆయా విద్యాసంస్ధలపై ఇన్నాళ్లుగా పెత్తనం సాగిస్తూనే ఉంది. దీంతో ఎయిడెడ్ విద్యాసంస్ధలకు చేసే సాయం కంటే వారిపై చేసే పెత్తనమే ఎక్కువన్న భావన సర్వత్రా కనిపిస్తుంటుంది.

 ఎయిడెడ్ పై జగన్ సర్కార్ కన్ను

ఎయిడెడ్ పై జగన్ సర్కార్ కన్ను

రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్ధలపై తాజాగా జగన్ సర్కార్ కన్ను పడింది. దేశంలో ఎక్కడా లేనట్లుగా ఏపీలో మాత్రమే ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని ప్రభుత్వంలో వాటిని విలీనం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. అంతే కాదు వాటిలో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని, ఆయా సంస్ధలకు ఉన్న భూములు, భవనాలను కూడా ఇచ్చేయాలని బెదిరింపులు అధికారికంగానే మొదలయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసేసింది. దీంతో ఎయిడెడ్ విద్యాసంస్ధలు ఉన్న పళంగా ప్రభుత్వానికి అఫ్పగించేందుకు ససేమిరా అంటున్నాయి.

 ఎయిడెడ్ ఉద్యోగుల ఆశ

ఎయిడెడ్ ఉద్యోగుల ఆశ

ఇన్నేళ్లుగా తమకు ఉద్యోగాలు ఇచ్చి, నెలనెలా జీతాలు ఇచ్చి విద్యాబోధన చేయిస్తున్న ఎయిడెడ్ విద్యాసంస్ధలను వదిలి ప్రభుత్వం చెప్పినట్లుగా విలీనం అయ్యేందుకు ముందుగా సిబ్బంది సిద్ధమైపోతున్నారు. ఎయిడెడ్ తో పోలిస్తే ప్రభుత్వం ఇచ్చే జీతాలు ఎక్కువగా ఉండటం, పీఆర్సీలతో పాటు ఇతర భత్యాలు కూడా లభించే అవకాశం ఉండటంతో ఇన్నాళ్లు చేసిన సేవను ముగించేయాలన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఇదే అదనుగా విద్యాసంస్ధల్ని సైతం విలీనం చేయించేందుకు దీన్ని సాకుగా వాడుకుంటోంది.

 బెజవాడ మాంటిస్సోరి మూసివేత

బెజవాడ మాంటిస్సోరి మూసివేత

ఇన్నాళ్లూ ప్రభుత్వ ఎయిడ్ తీసుకుంటూ విద్యార్ధుల నుంచి నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నతాశయంతో కొనసాగిన విజయవాడ మాంటిస్కోరి విద్యాసంస్ధలు ప్రభుత్వ తాజా నిర్ణయంతో కుదేలయ్యాయి. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్ని ప్రభుత్వం విలీనం చేసుకోవడానికి నిర్ణయం తీసుకోవడంతో చేసేది లేక సంస్ధను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో విజయవాడ మాంటిస్కోరి స్కూల్ మూసేస్తున్నారన్న వార్త రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాల్లో ఇక్కడ చదువుకుని ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్న వారితో పాటు దేశ విదేశాల్లో ఉన్న వారు సైతం సంస్ధ తాజా నిర్ణయంపై ఆందోళన చెందుతున్నారు.

 సర్కార్ వేధింపులతో లక్షలమందిపై ప్రభావం

సర్కార్ వేధింపులతో లక్షలమందిపై ప్రభావం

ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని, వాటిలో ఉద్యోగుల్ని, భవనాల్ని, స్ధలాల్ని తమకు అప్పగించాలని వేధిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది విద్యార్ధులపై ప్రభావం పడబోతోంది. ప్రభుత్వం ఎయిడ్ నిలిపేస్తే ఇప్పటివరకూ నడిపిన విద్యాసంస్ధల్ని ముందుకు తీసుకెళ్లలేక మూసివేతకు ఆయా యాజమాన్యాలు సిద్దపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ చదువుకుంటున్న లక్షల కొద్దీ విద్యార్ధులను ఇతర ప్రభుత్వ స్కూళ్లలో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు విద్యాసంవత్సరం మధ్యలో ఈ ప్రక్రియ చేపట్టడం వల్ల విద్యార్ధులపై తీవ్ర ప్రభావం పడక తప్పదు. అలాగే విద్యాసంస్ధల్ని విద్యా సంవత్సరం మధ్యలో మూసేయడం వల్ల వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి పరిస్దితి కూడా దారుణంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Recommended Video

Hanuma Vihari మళ్లీ హైదరాబాద్‌ తరఫున బరిలోకి.. ఆంధ్రా ను వీడుతున్నా ! || Oneindia Telugu
 ఎయిడెడ్ ఉసురు తీయడం వెనుక భారీ ప్లాన్ ?

ఎయిడెడ్ ఉసురు తీయడం వెనుక భారీ ప్లాన్ ?

ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని ప్రభుత్వంలో విలీనం చేసేయాలంటూ జగన్ సర్కార్ పెంచుతున్న ఒత్తిడి వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉంది. ఇప్పట్లో దాన్నుంచి బయటపడే అవకాశాలు లేవు. దీంతో ప్రభుత్వ భూముల్ని ఇఫ్పటికే తాకట్టు పెట్టడం, లీజులకు ఇవ్వడం మొదలైపోయింది ఇక చివరికి ఎయిడెడ్ విద్యాసంస్ధలకు భారీ సంఖ్యలో ఉన్న భూములపై ప్రభుత్వం కన్ను పడినట్లు తెలుస్తోంది. అందుకే వీటిని సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వంలో విలీనం చేసుకుని వాటి భూముల్ని తాకట్టు పెట్టేయడం లేదా లీజులకు ఇవ్వడం ద్వారా భారీ ఎత్తున ఆదాయం అర్జించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా విద్యాసంస్ధల యాజమాన్యాలు కోర్టుల్ని ఆశ్రయిస్తున్నాయి. అయితే వీరికి గతంలోలా విదేశాల నుంచి సాయం అందకపోవడం, విద్యార్ధులు ఇచ్చే నామమాత్రపు ఫీజులు, ప్రభుత్వ ఎయిడే గతి కావడంతో కోర్టుల్లో పోరాడేందుకు కూడా ఓపిక లేక విద్యాసంస్ధల్ని మూసుకునేందుకే యాజమాన్యాలు మొగ్గుచూపుతున్నాయి. దశాబ్దాలుగా దేశంలో విద్యారంగానికి పట్టుకొమ్మలుగా ఉన్న ఎయిడెడ్ విద్యాసంస్ధల మూసివేతలతో విద్యావ్యవస్ధపైనా తీవ్ర ప్రభావం పడబోతోంది.

English summary
lakhs of stutdents may impact in andhrapradesh with jagan govt's plan on merger of aided institutions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X