వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అన్నవరం లాడ్జిలో వ్యభిచార కార్యకలాపాలు, అమ్మాయిలతోపాటు.
అన్నవరం: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో కొన్ని లాడ్జీలలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార కార్యకలాపాల నిర్వహిస్తున్నట్లు వెలుగు చూసింది. చాలాకాలంగా జరుగుతున్న ఈ వ్యవహారం పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో బుధవారం నాడు వెల్లడయింది.

అన్నవరంలో వ్యభిచార నిర్వహణ పైన స్థానికులు మండిపడుతున్నారు. ఓ లాడ్జిలో వ్యభిచార కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయని కొందరు స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో మధ్యాహ్నం పోలీసుల బృందం గ్రామంలోని సినిమా సెంటర్ వద్దనున్న లాడ్జిలో తనిఖీలు చేశారు.
ఇద్దరు అమ్మాయిలను, ఇద్దరు యువకులను, లాడ్జి నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు భవనం వెనుక నుంచి పరారయ్యారని తెలుస్తోంది. చాలాకాలంగా లాడ్జిలో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.