అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యార్థినిపై ఏడాదిగా లైంగిక దాడి, రహస్యంగా విచారణ, అలాంటిదేమీ లేదన్న ప్రిన్సిపాల్

అనంతపురం జిల్లా హిందూపురంలోని సాంఘీక సంక్షేమ బాలిక రెసిడెన్షియల్ కాలేజీలో కొంతకాలంగా ఓ విధ్యార్థినిపై లైంగిక దాడి జరుగుతోంది. ఈ ఘటనపై విధ్యార్థిని కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హిందూపురం:అనంతపురం జిల్లా హిందూపురంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కొంత కాలంగా ఓ విధ్యార్థినిపై లైంగిక దాడి జరుగుతోంది. అక్కడ పనిచేసే కేటరింగ్ సూపర్ వైజర్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని బాధితురాలు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.

అనంతపురం జిల్లా హిందూపురం రెసిడెన్షియల్ స్కూల్ లో కొంత కాలంగా ఓ విధ్యార్థినిపై లైంగిక దాడి జరుగుతోంది.ఈ దాడిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆర్ డి ఓ, డిఎస్ పి రహస్యంగా విచారణ చేపట్టారు.అయితే సూపర్ వైజర్ కు, ఓ ఉపాధ్యాయురాలికి మద్య విబేధాలను పురస్కరించుకొని విధ్యార్థిని తప్పుడు ఫిర్యాదు చేసిందని స్కూల్ ప్రిన్సిపాల్ చెబుతున్నారు.

విధ్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని పలు విధ్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఈ విద్యాసంస్థపై ఆది నుండి ఆరోపణలే ఉన్నాయి.

sexual harassment on social welfare student in hindupur

పాఠశాలలో కేటగిరింగ్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్న వ్యక్తి తరచూ వికృతచేష్టలతో ఓ విధ్యార్థిని వేధించేవాడు. ఏడాది కాలంగా లోబర్చుకొని లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. విషయం తెలుసుకొన్న ఓ ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.

గత ఏడాది జనవరి 28వ, తేది అర్థరాత్రి సమయంలో కేటరింగ్ సూపర్ వైజర్ విధ్యార్థులున్న గది తలుపును తట్టడం పెద్ద దుమారాన్ని రేపింది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు.రెండు రోజుల క్రితం ఓ విద్యార్థినితో వికృత చేష్టలకు పాల్పడ్డాడు.ఈ విషయమై స్కూల్ టీచర్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో కలెక్టర్ నివేదిక ఇవ్వాలని డిఎస్ పి , ఆర్ డి ఓను ఆదేశించారు.

ఈ ఘటనపై రహస్యంగా విచారణ జరిపారు ఆర్ డి ఓ, డిఎస్ పి లు. పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు గాను సోషల్ వేల్పేర్ డిడి మోహీనొద్దీన్ ను అక్కడే ఉంచారు.ఆదివారం రాత్రి గురుకుల పాఠశాల డిప్యూటీ కో ఆర్డినేటర్ గీత అక్కడికి చేరుకొని మరింత లోతుగా విచారణ చేపట్టారు.

విధ్యార్థినిని లైంగికంగా వేధించిన కేటరింగ్ సూపర్ వైజర్ ను టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.అయితే ప్రిన్సిఫల్ మాత్రం మరో వాదనను ముందుకు తెచ్చాడు.కేటరింగ్ సూర్ వైజర్ కు, ఉపాధ్యాయురాలుకు జరిగిన గొడవ కారణంగా విధ్యార్థినితో తప్పుడు ఫిర్యాదు చేయించారని ప్రిన్సిఫాల్ ఆరోపిస్తున్నారు.

English summary
sexual harassment on social welfare student in hindupur, she has complaint against on supervisor. rdo and dsp enquiried on this incident on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X