విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంజినీరింగ్ అడ్మిషన్ల లేట్: విద్యార్థుల ర్యాలీ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

కలెక్టరేట్ ప్రధాన గేట్ మూసివేసి, విద్యార్థులు లోపలికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ముట్టిడించేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు అప్పటికే సిద్ధం చేసిన వాహనాలలో విద్యార్థులను, నాయకులను బలవంతంగా ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

14 మంది నాయకులను రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించి, సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుడు రాజు మాట్లాడుతూ.. ఫీజు రీఎంబర్స్‌మెంట్ సక్రమంగా అమలు కాకపోవడం వల్ల బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని వాపోయారు.

కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు, హాల్ టిక్కెట్లు ఇవ్వబోమని బెదిరిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పృథ్వీ, సుధ, నాని, గణేష్, శ్యామ్ నాయుడు, అమర్, అరుణ, కోటి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల నిరసన

విద్యార్థుల నిరసన

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు.

విద్యార్థుల నిరసన

విద్యార్థుల నిరసన

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట బైటాయించి నిరసన తెలిపారు.

విద్యార్థుల నిరసన

విద్యార్థుల నిరసన

విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కలెక్టరేట్ ప్రధాన గేట్ మూసివేసి, విద్యార్థులు లోపలికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు.

విద్యార్థుల నిరసన

విద్యార్థుల నిరసన

అనంతరం కలెక్టరేట్ ముట్టిడించేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

విద్యార్థుల నిరసన

విద్యార్థుల నిరసన

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుడు రాజు మాట్లాడుతూ.. ఫీజు రీఎంబర్స్‌మెంట్ సక్రమంగా అమలు కాకపోవడం వల్ల బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని వాపోయారు.

విద్యార్థుల నిరసన

విద్యార్థుల నిరసన

పోలీసులు అప్పటికే సిద్ధం చేసిన వాహనాలలో ధర్నా చేస్తున్న విద్యార్థులను, నాయకులను బలవంతంగా ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

విద్యార్థుల నిరసన

విద్యార్థుల నిరసన

14 మంది నాయకులను రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించి, సాయంత్రం విడుదల చేశారు.

విద్యార్థుల నిరసన

విద్యార్థుల నిరసన

ధర్నాలో పాల్గొన్న విద్యార్థి నాయకురాలును అరెస్ట్ చేస్తున్న మహిళా పోలీసులు.

విద్యార్థుల నిరసన

విద్యార్థుల నిరసన

ఎస్ఎఫ్ఐ నాయకుడు రాజు మాట్లాడుతూ.. ఫీజు రీఎంబర్స్‌మెంట్ సక్రమంగా అమలు కాకపోవడం వల్ల బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని వాపోయారు.

విద్యార్థుల నిరసన

విద్యార్థుల నిరసన

ధర్నా కార్యక్రమంలో నాయకులు పృథ్వీ, సుధ, నాని, గణేష్, శ్యామ్ నాయుడు, అమర్, అరుణ, కోటి తదితరులు పాల్గొన్నారు.

English summary
SFI leaders protest at Visakhapatnam collectorate on Tuesday for students issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X