వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఈడీ ఛార్జీషీట్లో షబ్బీర్ అలీతో పాటు బొత్స, సుఖేష్‌ను రక్షించేందుకు రంగంలోకి

మాంసం ఎగుమతిదారు మొయిన్‌ ఖురేషి కేసులో ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీటు దాఖలు చేసింది. కేసు విచారణలో భాగంగా సతీశ్‌ సానా, కోనేరు ప్రదీప్‌ ఇచ్చిన వాంగ్మూలాన్ని పేర్కొంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాంసం ఎగుమతిదారు మొయిన్‌ ఖురేషి కేసులో ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీటు దాఖలు చేసింది. కేసు విచారణలో భాగంగా సతీశ్‌ సానా, కోనేరు ప్రదీప్‌ ఇచ్చిన వాంగ్మూలాన్ని పేర్కొంది.

చిక్కుల్లో షబ్బీర్ అలీ: 1.5కోట్ల లంచం కేసులో ఈడీ ఛార్జీ‌షీటుచిక్కుల్లో షబ్బీర్ అలీ: 1.5కోట్ల లంచం కేసులో ఈడీ ఛార్జీ‌షీటు

బొత్స, షబ్బీర్ అలీలను స్నేహితులుగా చెప్పారు

బొత్స, షబ్బీర్ అలీలను స్నేహితులుగా చెప్పారు

సతీస్‌ సానా తన వాంగ్మూలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ, టి కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ పేర్లు ప్రస్తావించినట్లుగా వెల్లడించింది. వారిద్దరూ తన స్నేహితులుగా సతీశ్‌ చెప్పినట్లు ఈడీ పేర్కొంది.

ఈడీ కేసులో షబ్బీర్ అలీ, బొత్స

ఈడీ కేసులో షబ్బీర్ అలీ, బొత్స

దీంతో షబ్బీర్ అలీ, వైసీపీ నేత బొత్స సత్యానారాయణ ఈడీ కేసులో ఇరుక్కున్నారు. సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న నిందితుల తరఫున సీబీఐ డైరెక్టర్లకు లంచాలు తీసుకెళ్లినట్లుగా ఈడీ వీరిద్దరిపై చార్జిషీట్ దాఖలు చేసిందని తెలుస్తోంది.

ఖురేషీ ద్వారా నిధులు

ఖురేషీ ద్వారా నిధులు

సీబీఐ మాజీ డైరెక్టర్లు ఏపీ సింగ్, రంజిత్ సిన్హాకు హవాలా మార్గంలో నిధులు అందించిన ప్రధాన నిందితుడు మొయిన్ ఖురేషీతో పాటు ఈడీ చార్జిషీట్‌లో షబ్బీర్ అలీ, బొత్స పేర్లు కూడా ఉన్నాయి.

సుఖేష్ గుప్తాకు బెయిల్ కోసం

సుఖేష్ గుప్తాకు బెయిల్ కోసం

ఎంబీఎస్ జ్యూయలర్స్ యజమాని సుఖేష్ గుప్తాకు బెయిల్ ఇప్పించేందుకు సతీష్ సనా ద్వారా ఖురేషీకి రూ.2 కోట్లు చెల్లించినట్లు ఈడీ తన చార్జిషీట్లో పేర్కొంది. ఇందుకోసం సతీష్‌తో కలిసి షబ్బీర్, బొత్స ఢిల్లీ వెళ్లారని వివరించినట్లుగా తెలుస్తోంది.

English summary
A Congress leader has been named in the chargesheet filed by the Enforcement Directorate (ED) against Moin Qureshi in the connection with a money laundering case. Shabbir Ali has been named in the chargesheet for his alleged involvement in the bribery ring.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X