• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టాక్ ఆఫ్ ద టౌన్: కవిత్వం తోపుడుబండి (పిక్చర్స్)

By Pratap
|

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికాతో భారత తలపడుతున్న వేళ ఇటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఓ వ్యక్తి టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాడు. నిజానికి, ఆదివారంనాడు రెండు, మూడు సాహిత్య సమావేశాలు కూడా జరిగాయి. ఆ వేళ షేక్ సాదిక్ అలీ అనే ఓ వ్యక్తి ఓ వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. కవిత్వాన్ని ప్రచారం చేయడానికి, కవిత్వం పట్ల పాఠకుల ఆసక్తిని పెంచడానికి మాత్రమే కాకుండా కవిత్వం పుస్తకాలను విక్రయించి కవులకు చేయూత ఇవ్వడానికి కూడా కాలికి బలపం కట్టుకున్నాడు.

తోపుడు బండిపై కవిత్వ పుస్తకాలను వేసుకుని, రహదారుల వెంట తిరుగుతూ వాటిని అమ్మే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆదివారం ఉదయం ఉదయం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద తన తోపుడుబండి ప్రయోగాన్ని ప్రారంభించాడు. అక్కడి నుంచి బండిని తోసుకుంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు వచ్చాడు. మధ్య మధ్యలో కవిత్వ పుస్తకాలను అమ్ముతూ, తన వద్దకు వచ్చిన కవులను పలకరిస్తూ అతను ముందుకు సాగాడు.

అతను ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో తెలుగు సాహిత్యంలో ఎంఎ చేశాడు. ఉదయం దినపత్రికలో చాలా కాలం జర్నలిస్టుగా పనిచేశాడు. కానీ కవిత్వం రాయడు, అసలు సాహిత్య సృజన జోలికి వెళ్లడు, కానీ కవిత్వం అంటే ముచ్చటపడుతాడు. అదే అతన్ని ఈ ప్రయోగానికి పురికొల్పి ఉండవచ్చు. తన తోపుడు బండి వెళ్లే దారిని ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో పెడుతుంటాడు. అతని పోస్టులను చూసినవారు తమకు దగ్గరగా వచ్చినప్పుడు తోపుడు బండి వద్దకు వెళ్లవచ్చు. నిజంగానే అతను ఒక్క రోజే కవిత్వం పుస్తకాలను అమ్మాడు. వాటి ద్వారా 8 వేల రూపాయలకు పైగా సంపాదించాడు. అయితే, ఆ డబ్బులను అతను సొంతం చేసుకోడు. కవులకు ఇచ్చేస్తాడు.

చినిగిన చొక్కా తొడుక్కో..

చినిగిన చొక్కా తొడుక్కో..

చినిగిన చొక్కాఅయిన తొడుక్కో.. ఓమంచి పుస్తకం కొనుక్కో.. అనే ఒక మంచి ఆశయంతో సాదిక్ అలీ తోపుడుబండి కార్యక్రమాన్ని ప్రారంభించాడు.

తొలి అనుభవం....

తొలి అనుభవం....

"మొదటి సారి కదా.....బండి ఎలా తోయ్యాలో అర్ధం కాలేదు. ఒకవైపు తోస్తే మరోవైపు వెళ్ళింది. అర్ధగంట నడిపాక అలవాటు అయ్యింది.నాకన్నా, సంతోష్, భానోజి రావు గారు మరింత బాగా తోశారు" అని సాదిక్ చెప్పుకున్నాడు.

ప్రారంభ కష్టాలు

ప్రారంభ కష్టాలు

"ఆదివారం నాడు నెక్లెస్ రోడ్డులో చెప్పిన సమయానికి తోపుడు బండి కనిపించకపోవడంతో నిరుత్సాహంతో కొందరు మిత్రులు వెనుదిరిగారు. చెప్పిన సమయానికి బండి అక్కడ లేకపోవడంపై మిత్రులకు సాదిక్ గారి తరఫున వివరణ ఇవ్వడం మిత్రధర్మంగా భావిస్తున్నాను.రాం నగర్ దగ్గరనుంచి బండిని తోసుకుంటూ సకాలానికే బయలుదేరారు సాదిక్ గారు. అయితే విఎస్‌టి దగ్గరకు వచ్చేసరికి ఒక చక్రానికి ట్యూబ్ ఊడిపోయింది. మరో చక్రం పూర్తిగా వంకరపోయింది. మెకానిక్ దగ్గర వాటిని బాగుచేయించి బయలుదేరడం వల్ల.. చెప్పిన సమయంకంటే దాదాపు గంటంబావు జాప్యం జరిగింది" అంటూ వాసిరెడ్డి వేణుగోపాల్ వివరణ ఇచ్చారు.

అభ్యంతరాలు చెప్పారు..

అభ్యంతరాలు చెప్పారు..

తోపుడుబండికి మరికొన్ని అవరోధాలూ ఎదురయ్యాయి. నెక్లెస్ రోడ్డులో బండి పెట్టడానికి.. అది పుస్తకాలదైనా సరే.. ముందస్తు అనుమతి తీసుకోవాలని

సంతకాలు

సంతకాలు

తోపుడు బండి ప్రారంభోత్సవానికి చాలా మంది కవులు హాజరయ్యారు. కవిత్వంపై అభిమానంతో వారు సంతకాలు కూడా చేశారు. ఇదో మంచి పకమని సాదిక్ అన్నాడు.అడ్డు చెప్పారు. సాయంత్రం ఐదు గంటలప్పుడు.. సంబంధిత బాధ్యుడు వచ్చి బలవంతంగా బండి తీయించారు.

కవుల ప్రతిస్పందనకు మచ్చు..

కవుల ప్రతిస్పందనకు మచ్చు..

తెలుగు కవులకు ఇటీవలి బాసట తోపుడుబండి SHUKRIYAA అంటూ ప్రముఖ కవి కోడూరి విజయకుమార్ వ్యాఖ్యానించారు. తోపుడుబండి పట్ల కవుల ఆదరణకు మచ్చుతునక మాత్రమే

నిశబ్దం బద్దలైంది..

నిశబ్దం బద్దలైంది..

"ఒక నిశబ్దం బద్దలయ్యింది. ఒక కదలిక మొదలయ్యింది. ఒక స్వప్నం సాకారంయ్యింది. ఒక్కడిని...నేనొక్కడిని ..చెయ్యగలనా? అనుకున్నాను.కానీ ....నాతొ పాటు ఎన్నో జతల కాళ్ళు కదిలాయి.ఎన్నో చేతులు బొబ్బలెక్కాయి. ఎన్నో గొంతులు జత కలిశాయి. కవిత్వం అంటే అది. సంకల్పం" అని సాదిక్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.

పిచ్చోడి ప్రేమ

పిచ్చోడి ప్రేమ

"కవిత్వం మీద, సాదిక్ అనే ఒక పిచ్చోడి మీద ప్రేమతో ఎందరెందరో వచ్చారు. ప్రేమించారు. ఆశీర్వదించారు. మేమున్నాం నీతో అని భరోసా ఇచ్చారు. తోపుడుబండి ఇక ఆగదు. ఈ మహా ప్రస్థానం ఇక ఇలా సాగిపోతుంది" అని అన్నాడు.

ఫినిషింగ్ టచ్

ఫినిషింగ్ టచ్

"ఇక్కడ ఒక మనిషి గురించి ప్రస్తావించకపోతే తోపుడుబండి ప్రస్థానం మొదలు కాదు.ఆ వ్యక్తి కవి యాకూబ్. 30 ఏళ్ళ తర్వాత తనను మళ్ళీ ,మరింత తీవ్రంగా ఇష్టపడటానికి కారణం 'కవి సంగమం'. అదృశ్యం అయిపోతున్న కవిత్వాన్ని కాపాడుకోవటం కోసం గత మూడేళ్ళుగా కవి సంగమం ద్వారా తను చేస్తున్న పోరాటం నచ్చింది" అంటూ తన తోపుడుబండి ప్రయోగానికి ప్రేరణ ఇచ్చిన కవిని తలుచుకున్నాడు సాదిక్.

ఇది నా మరణ వాంగ్మూలం

ఇది నా మరణ వాంగ్మూలం

"నేను కవిని కాదు,కవితలు రాయలేను. కానీ కవిత్వాన్ని ప్రేమించాను. శ్వాసించాను.అందుకే కవిత్వాన్ని అమ్మటానికీ, కవిత్వాన్ని ప్రజల ముంగిటకు తీసుకేల్లటానికీ ,ప్రజలకు కవిత్వాన్ని చేరువ చేయటానికీ ప్రయత్నం ప్రారంభించాను.అందుకే ఈ తోపుడుబండిని ప్రారంభించాను" అని కూడా సాదిక్ చెప్పాడు.

నా శక్తి సరిపోదు

నా శక్తి సరిపోదు

"నా శక్తి సరిపోదు. నాకు తెలుసు.ఈ వయసులో, అంత బరువైనా నేను తోయ్యటానికే సిద్ధపడ్డాను.ఇది పబ్లిసిటీ కోసం కాదు. నా పర్సనల్ ఇమేజ్ పెంచుకోవటానికి కాదు.జనం లోకి బలంగా చొచ్చుకు పోవటానికి ఇది ఒక మార్గంగా భావించాను.ఈ తరం కవిత్వాన్ని చదవాలి.నా రాష్ట్రం కోసం, నా దేశం కోసం, ఈ విశ్వ మానవాళి కోసం చదవాలి.భావి తరాల కోసం చదవాలి" అని కూడా తన ఉద్దేశాన్ని సాదిక్ చెప్పాడు.

కేవలం కవిత్వమే..

కేవలం కవిత్వమే..

"ఇది కవుల కోసం కాదు. ప్రజల కోసం. నీ లాంటి, నా లాంటి ప్రజల కోసం.భావి తరాల కోసం. ఆలోచించే సమాజం కోసం.నాకు పబ్లిసిటీ వద్దు. మహానుభావుల ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు.నేను సామాన్యుడిని. నా సాటి మనుష్యుల కోసమే ఈ తోపుడు బండి. కేవలం కవిత్వం మాత్రమె అమ్ముతాను" అని నిశ్చయంగా ప్రకటించాడు సాదిక్.

బండి ఆగదు

బండి ఆగదు

"ఎవరు వచ్చినా, రాకపోయినా ఈ బండి ఆగదు..రేపు నెక్లెస్ రోడ్డు మీదో, ఆ పరిసరాల్లోనో నా బండి వస్తుంది.

నీ కోసం, నాకోసం, సమాజం కోసం , భావితరాల కోసం ఆలోచించే వాళ్ళైతే రండి. అక్కడే కలుసుకుందాం. ఈ ప్రయత్నంలో నాకేమైనా నాకు బాధలేదు.నా తర్వాత నాలాంటి మరో పిచ్చోడు ఎవరో ఈ బండిని ముందుకు తీసుకు వెళ్తారనే నమ్మకం నాకుంది" అని ఆత్మవిశ్వాసంతో ప్రకటించాడు సాదిక్.

చాలా రోజులుగా...

చాలా రోజులుగా...

తోపుడుబండి మీద తాను కవిత్వం అమ్ముతానంటూ సాదిక్ అలీ చెబుతుంటే చాలా మంది ఆషామాషీ అనుకున్నారు. కానీ నిజంగానే ఇలా అవతారమెత్తాడు.

English summary
A man Shaik Sadiq Ali in his novel experiment selling and exhibiting Telugu poetry books
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X