వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్దెకుండాలా, కెసిఆర్‌ది ప్రైవేట్ కంపెనీ: శైలజానాథ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Shailajanath
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ తన చర్చను శనివారం శాసనసభలో కొనసాగించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరుగుతోందని, ఉమ్మడి రాజధాని అంటే తాము అద్దెకు ఉండాలా అని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును చేస్తున్నారో తెలియడం లేదని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టారని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనపై తెలుగుదేశం వైఖరితో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని ఆయన అన్నారు. తెలుగువాళ్లంటే ఎవరికైనా భయం ఉందేమో అందుకే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆయన అన్నారు. సమైక్య తీర్మానం చేయాలని తాను సభను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. బిల్లులోని అంశాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని ాయన అన్నారు. తెలుగు ప్రజల పట్ల వ్యతిరేకత బిల్లులో కనిపిస్తోందని ఆయన అన్నారు.

తలారి మాటపై..

తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి వాడిన తలారీ మాటపై శైలజానాథ్ తీవ్రంగా ప్రతస్పందించారు. భూమన క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశఆరు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో వైయస్సార్ కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని ఆయన అన్నారు.

తలారి పనిచేసేవారిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవమానిస్తుందా అని ఆయన అడిగారు. వాళ్ల కష్టాన్ని గుర్తించదా అని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రాజకీయ భవిష్యత్తును తాకట్టు పెట్టి తాము సమైక్యం అంటున్నామని ఆయన అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెప్పారని ఆయన గుర్తు చేశారు.

విభజించాలని కాదు..

చిన్నారెడ్డిని పురికొల్పి తెలంగాణ వాదాన్ని లేవదీసింది వైయస్ రాజశేఖర రెడ్డేనని తెలుగుదేశం పార్టీ సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. సమన్యాయం కోసమే తాము లేఖ ఇచ్చామని, విభజన చేయాలని కాదని ఆయన స్పష్టం చేశారు.

English summary
Minister from Rayalaseema Shailajanath has opposed tha proposal of common capital continuing debate on Telangana draft bill. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X