వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శమంతకణితో వివాదం: శైలజానాథ్ యూటర్న్

By Pratap
|
Google Oneindia TeluguNews

Shailajanath takes u - turn and fight as Congress candidate
అనంతపురం: మాజీ మంత్రి శైలజానాథ్ యూటర్న్ తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున అనంతపురం జిల్లా శింగనమల శాసనసభా నియోజకవర్గానికి నామినేషన్ వేయడానికి ప్రయత్నించిన ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. అయితే, చివరి నిమిషం వరకు తెలుగుదేశం పార్టీ తేల్చకపోవడంతో వివాదం నెలకొంది.

తాను కాంగ్రెసు తరఫున నామినేషన్ వేశానని, కాంగ్రెసు అభ్యర్థిగానే పోటీలో ఉంటానని శైలజానాథ్ చెప్పారు. ఆయన శనివారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే సమయంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ శమంతకమణితో శైలజానాథ్‌కు వాగ్వివాదం జరిగింది.

తెలుగుదేశం పార్టీ తరఫున తన కూతురు యామిని చేత నామినేషన్ వేయడానికి శమంతకమణి వచ్చారు. ఆ సమయంలోనే శైలజానాథ్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసేందుకు వచ్చారు. ఈ సమయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

శైలజానాథ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చివరి వరకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్నారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరుతారని భావించారు. కానీ ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు.

English summary
Taking U - turn former minister Shailajanath has stated that he will in fight as Congress candidate
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X