విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: విమానంలో మహిళా ఫ్రొఫెసర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు నోటీసులు ఇవ్వనున్నట్లు శంషాబాద్ డీసీపీ తెలిపారు. ఈ కేసులో ఆయన వివరణ కోరేందుకు ఇప్పటికే రెండు బృందాలను ఏపీకి పంపినట్లు ఆయన తెలిపారు.

ఆ రెండు బృందాలు కూడా కార్పోరేటర్ చంటిబాబును హైదరాబాద్‌కు తీసుకొస్తాయని చెప్పారు. కార్పోరేటర్ చంటిబాబుపై ఫిర్యాదు చేసిన మహిళా ప్రొఫెసర్ అన్ని ఆధారాలను పోలీసులకు సమర్పించడం వల్లే అతనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆయన్ను ఇక్కడికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

ఎయిరిండియా విమానంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను విజయవాడ 25 డివిజన్ టీడీపీ కార్పొరేటర్ చంటిబాబుపై శంషాబాద్ విమానాశ్రయంలోని ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీఐ సుధాకర్ కథనం ప్రకారం... హైదరాబాద్‌లో జరిగే ఓ సదస్సులో పాల్గొనేందుకు మహిళా ఫ్రొఫెసర్ రీతూవాసు ప్రిమలానీ ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఏఐ-544 విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు బయల్దేరారు.

హైదరాబాద్ మీదుగా విజయవాడ వెళుతున్న ఈ విమానంలోనే ఆమె పక్కసీట్లోనే కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు కూర్చున్నాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేలోపు మహిళా ప్రొఫెసర్‌ను తన కాలివేళ్లతో పదేపదే తాకడంతోపాటు ఆమెపై చేతులు చేసి అసభ్యంగా ప్రవర్తించాడు.

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

బాధితురాలు ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సిబ్బందికి తెలియజేసినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3.30 గంటలకు విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. కార్పొరేటర్ ప్రవర్తనపై బాధితురాలు ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కార్పోరేటర్ చంటిబాబుపై పోలీసులు 354 సెక్షన్(మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించడం) కింద కేసు నమోదు చేశారు.

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

అయితే అసభ్యంగా ప్రవర్తించిన కార్పొరేటర్‌ను పోలీసులకు అప్పగించాల్సిన ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అప్పటికే అతడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆర్‌జీఐఏ పోలీసులు వెంటనే కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు సమాచారం అందించారు.

 పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఆఫీసర్ భీముడు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు అరగంట సేపు విచారణ నిర్వహించారు. ఈ విషయాన్ని తోటి కార్పొరేటర్లు టీడీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు రంగంలోకి దిగి సర్దుబాటు చేసినట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు చట్టపరంగా ముందుకెళతామని సీఐ సుధాకర్ తెలిపారు.

 పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

ఎయిర్ ఇండియా సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే కార్పోరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావును జైలుకు పంపేవాళ్లమని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే విమానంలో కార్పొరేటర్ నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని కేంద్రమంత్రి మేనకా గాంధీకి ఫోన్ ద్వారా తెలియజేశారు.

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

ఈ మేరకు మేనకా గాంధీ తెలంగాణ సీఎం కార్యాలయానికి ఫోన్ చేశారు. దీంతో అక్కడి అధికారులు పోలీసులను సంప్రదించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలను వారు మేనకకు వివరించినట్లు సమాచారం. బాధితురాలు రీతూవాసు కేంద్రమంత్రికి సన్నిహితురాలని తెలిసింది.

 పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

కాగా, విమానంలో మహిళా ప్రొఫెసర్ పట్ల విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు అసభ్య ప్రవర్తనకు వ్యతిరేకంగా శనివారం మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. విమానంలో మహిళ పట్ల అసభ్యంగా కార్పొరేటర్ చంటిబాబు ప్రవర్తించడంతో మహిళా సంఘాలు ప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు.

 పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

మేయర్ కారును మహిళా సంఘాలు అడ్డుకున్నాయి. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. తక్షణమే కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.

 పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

ఈ నేపథ్యంలో చంటిబాబుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విమానంలో ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ పార్టీ కార్పొరేటర్లు మద్దతుగా నిలవడం వివాదాస్పదంగా మారింది. వెంకటేశ్వరరావుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టడం పట్ల మహిళా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

శనివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో మహిళలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని, కార్పొరేటర్ల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే వెంకటేశ్వరరావుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టి పొంతన లేని వాదన వినిపించారు.

 పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

పోకిరి కార్పోరేటర్: చంటిబాబుకు నోటీసులు, విమానంలో అసలేం జరిగింది?

విమానంలో ఆయన పక్కసీట్లో కూర్చున్న మహిళకు 60 ఏళ్లు ఉంటాయన్నారు. విమానం ఎక్కిన దగ్గర నుంచీ ఆమె అందరితో గొడవ పడిందన్నారు. అయితే వెంకటేశ్వరరావుపైనే ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నిస్తే.. నీళ్లు నమిలారు. తాను ఏ తప్పూ చేయలేదని, నిద్రలో పొరపాటున తన కాలు మహిళకు తగిలిందని అతడు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

English summary
Shamshabad dcp notices to vijayawada corporator Gummadi Venkateswara rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X