వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మంత్రి ఎవరు: దినేష్ రెడ్డికి శంకరన్న, కిరణ్‌పై సిబిఐకి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హత్య కేసుతో సంబంధమున్న మంత్రి ఎవరో మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి) దినేష్ రెడ్డి చెప్పాలని మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసన సభ్యుడు శంకర రావు బుధవారం ప్రశ్నించారు. దినేష్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై శంకర రావు స్పందించారు. ముఖ్యమంత్రి, ఆయన సోదరుడి పైన దినేష్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో తాను విచారణకు పిల్ వేస్తానని చెప్పారు. కిరణ్, దినేష్ కుమ్మక్కై దోచుకున్నారని ఆరోపించారు. మాజీ డిజిపికి మతిభ్రమించిందని నిప్పులు చెరిగారు.

Shankar Rao

డిజిపి వ్యాఖ్యలు ఖంచిండిన దానం

ముఖ్యమంత్రి పైన దినేష్ రెడ్డి వ్యాఖ్యలను కార్మిక శాఖ మంత్రి దాం నాగేందర్ బుధవారం ఖండించారు. ఖైరతాబాదులోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన దానం... సీనియార్టీని పక్కన పెట్టి అప్పట్లో దినేష్ రెడ్డికి డిజిపి పదవిని కట్టబెడితే ఇలాంటి విమర్శలు చేయడం తగదన్నారు. డిజిపి పదవిలో ఉండగా సిఎంను విమర్శిస్తే దానికి విలువ ఉండేదన్నారు.

కిరణ్‌పై సిబిఐకి ఫిర్యాదు

దినేష్ రెడ్డి ఆరోపణల ఆధారంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడి పైన ఓ లాయర్ సిబిఐకి ఫిర్యాదు చేశారు. జనార్ధన్ అనే న్యాయవాది దినేష్ ఆరోపణల ఆధారంగా కిరణ్, ఆయన తమ్ముడి పైన విచారణ జరపాలని కోరారు.

English summary

 Former Minister Shankar Rao on Wednesday said he will approach court on Dinesh Reddy and Kiran Kumar Reddy issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X