వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షిర్డీ సాయిబాబాపై వ్యాఖ్యలు: వెనక్కి తగ్గని శంకరాచార్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Shankaracharya reiterates his comments on Sai
న్యూఢిల్లీ: షిరిడీ సాయిబాబా దైవత్వాన్ని ద్వారకా పీఠ శంకరాచార్య స్వరూపానంద సరస్వతి స్వామి మరోమారు ప్రశ్నించారు. అల్లాను కొలుస్తూ మాంసం తినే సాయిబాబా హిందూ దేవుడు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. సాయి భక్తులు కూడా సనాతన దేవుళ్ల బొమ్మలతో సొమ్ము చేసుకున్నారని, వాళ్లు మన దేవుడి బొమ్మలు ఉపయోగించకపోతే వాళ్లకు ఎవరూ ఏమీ ఇవ్వరంటూ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు ఎవరిని కావాలంటే వారిని కొలుచుకునే హక్కు, స్వేచ్ఛ ఉన్నప్పటికీ సాయిబాబా తనను తాను దేవుడిగా చెప్పుకొనే ప్రయత్నం చేయడం మాత్రం తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తాము కేవలం ఐదుగురు దేవుళ్లనే ఆమోదిస్తామని, వేరే ఎవరైనా తమను తాము అక్కడ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆమోదించేది లేదని తెలిపారు.

కాంగ్రెస్ ప్రోద్బలంతోనే తాను సాయిబాబాపై గళమెత్తానన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. తాను రాజకీయవాదిని కానని స్పష్టం చేశారు. మరోవైపు నాగా సాధువులు కూడా శంకరాచార్యకు మద్దతుగా నిలిచారు. శంకరాచార్యను ఎవరైనా అవమానిస్తే తాము వీధుల్లో నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఈ అంశాన్ని వారు ఆధ్యాత్మిక యుద్ధంగా కూడా చెప్పారు.

ఇదిలావుంటే, శంకరాచార్య స్వరూపానందపై ఓ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం నమోదైంది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.

English summary
Dwaraka peetham Shankaracharya Swaroopananda reiterated his comments against Shirdui Saibaba.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X