వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ‌ర‌ద్ ప‌వార్ ఫోన్‌కు జ‌గ‌న్ రియాక్ష‌న్‌ ఏంటి : ప‌్ర‌త్యామ్నాయం ఉందా: వైసీపీ అధినేత వ్యూహం మారిందా.

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ఎక్కువ మొత్తంలో లోక్‌స‌భ సీట్లు ద‌క్కించుకుంటుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించ‌టంతో కేంద్రంలో మ‌ద్ద‌తు కోసం వైసీపీ పైన ఒత్తిడి పెరుగుతోంది. ఇందులో భాగంగా బీజేపీయ‌త‌ర ఫ్రంట్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ వైసీపీ ముఖ్య నేత‌ల‌ను కోరారు. తాజాగా, ఎస్పీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ సైతం ఫోన్ ద్వారా జ‌గ‌న్ మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నించారు. అయితే, జ‌గ‌న్ మాత్రం త‌న వ్యూహంతోనే ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. అందుకు మూహూర్తం కూడా డిసైడ్ చేసారు.

జ‌గ‌న్ మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నాలు..
ఏపీలో జ‌గ‌న్ అత్య‌ధిక లోక్‌స‌భ సీట్లు గెలుచుకుంటార‌ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇచ్చాయి. దీంతో..ఇప్పుడు జాతీయ స్థాయిలో వైసీపీకి ప్రాధాన్య‌త పెరిగింది. అందులో భాగంగా..కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియ‌ర్ నేత వైసీపికి చెందిన ముఖ్య నేత‌తో ఈ మ‌ధ్య కాలంలో హైద‌రాబాద్‌లో భేటీ అయ్యారు. కాంగ్రెస్ సార‌ధ్యం వ‌హించే ఈ కూట‌మిలో చేరి మ‌ద్ద‌తు ఇస్తే..జ‌గ‌న్‌కు ప్రాధాన్య‌త ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే, ఆ నేత మాత్రం అధినేత‌తో చ‌ర్చించిన త‌రువాత నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స‌మాధానం ఇచ్చారు. ఇక‌, ఫలితాలు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌..ఈ కూట‌మిలో సీనియ‌ర్ నేత అయిన శ‌ర‌ద్ ప‌వార్ ద్వారా సోమ‌వారం జ‌గ‌న్‌తో ట‌చ్‌లోకి వ‌చ్చినట్లు చెబుతున్నారు. బీజేపీయ‌త‌ర కూట‌మికి మ‌ద్ద‌తు కోసం ఆయ‌న సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది, అయితే, జ‌గ‌న్ మాత్రం ఆ ప్ర‌తిపాద‌ను స్పందించ‌లేద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు.

Sharad Pawr call to jagan for support non NDA ally : Jagan not committed opened all options up to counting

జ‌గ‌న్ వ్యూహం ఇదేనా..
త‌న వ‌ద్ద‌కు మ‌ద్ద‌తు కోసం ఎవ‌రు వ‌చ్చినా..జ‌గ‌న్ ఆక్క‌డా ఎవ‌రికీ మాట ఇవ్వ‌టం లేదు. 23న ఫ‌లితాల త‌రువాత మాత్ర‌మే వీటి పైన చ‌ర్చిద్దామ‌ని చెబుతున్నారు. త‌న‌తో ఎన్నిక‌ల కంటే ముందుగానే సంప్ర‌దించి ఏపీకి ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ఇస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌కు జ‌గ‌న్ తొలి ప్రాధాన్య‌త ఇస్తున్నారు. కేంద్రంలో హంగ్ వ‌స్తే ఏపీకి మేలు చేసే పార్టీకి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసారు. అదే స‌మ‌యంలో బీజేపీ..కాంగ్రెస్ ఎవ‌రైనా స‌రే..త‌న మ‌ద్ద‌తు అవ‌స‌రం అయితే ఖ‌చ్చితంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చి..మ‌ద్ద‌తు తీసుకోవాల‌ని చెబుతున్నారు. అయితే, 23వ తేదీ ఫ‌లితాల త‌రువాత మాత్ర‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఇప్పటికే జ‌గ‌న్ డిసైడ్ అయ్యారు. అప్ప‌టి వ‌రకు ఎవ‌రు సంప్ర‌దించినా ఎస్ అని చెప్ప‌కుండా..అదే మ‌యంలో నో అని చెప్ప‌కుండా అన్ని ప్ర‌త్యామ్నాయాల‌ను ఓపెన్ గానే ఉంచుకోవాల‌నేది జ‌గ‌న్ వ్యూహంగా క‌నిపిస్తోంది.

English summary
Non NDA parties leaders started consultations with neutral leaders for support to UPA. Recently Sharad pawar call to YCP chief Jagan asked to support. But, Jagan not reacted he opened all options till result come out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X