వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్ర‌భాస్ ను ఎప్పుడూ క‌ల‌వ‌లేదు, అస‌లు ల‌క్ష్యం ఆ పార్టీ వారేనా : ష‌ర్మిళ ఫిర్యాదు క‌ల‌క‌లం ..!

|
Google Oneindia TeluguNews

వైయ‌స్ సోద‌రి ష‌ర్మిళ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. త‌న పై కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ప్ర‌చారం పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌భాస్ తో త‌న‌కు సంబంధాలు ఉన్నాయంటూ అభ్యంత‌ర‌క‌రంగా చేస్తున్న దుష్ప్ర‌చా రం పై స్పందించారు. తాను ఎప్పుడూ ప్ర‌భాస్ ను క‌ల‌వ‌లేద‌ని తేల్చి చెప్పారు. త‌న పై అభ్యంత‌ర వ్యాఖ్య‌లు చేస్తున్న వారి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసారు. తొలుత జ‌నసేన పేరుతో టిడిపి వాళ్లు అంటూనే..ఆ త‌రువాత టిడిపి వాళ్ల‌పైనే నేరుగా ఫిర్యాదు చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు.

పోలీసు క‌మిష‌న‌ర్ కు ష‌ర్మిళ ఫిర్యాదు..

పోలీసు క‌మిష‌న‌ర్ కు ష‌ర్మిళ ఫిర్యాదు..

వైయ‌స్ జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిళ తన భ‌ర్త‌, పార్టీ నేత‌ల‌తో క‌లిసి హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ ను క‌లిసారు. త‌న ప‌ట్ల‌.. త‌న కుటుంబ స‌భ్యుల ప‌ట్ల సోష‌ల్ మీడియాలో..బ‌య‌టా అభ్యంత‌ర‌కర వ్యాఖ్య‌లు చేసిన వారి పై చ‌ర్య‌లు తీసుకోవాల ని కోరారు. ఈ మేర‌కు ఏ విధంగా కామెంట్లు చేస్తున్నారో ఆధారాల‌తో స‌హా వివిరిస్తూ ఫిర్యాదు చేసారు. త‌న పై 2014 ఎన్నిక‌ల్లో ఇటువంటి దుష్ఫ్ర‌చారం చేస్తున్నారంటూ ఆధారాలు హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్ళారు. 2014 తో ఏ విధంగా అయితే అభ్యంత‌ర‌క‌రంగా ప్ర‌చారం చేసారో..ఇప్పుడు తిరిగి అదే విధంగా మొద‌లు పెట్టార‌ని ష‌ర్మిళ త‌న ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ ప్ర‌చారం వెనుక ఎవ‌రున్నార‌నే దాని పై ష‌ర్మిళ నేరుగా స్పందించారు. అయితే, కొద్ది రోజుల క్రితం జ‌గ‌న్ సైతం త‌న ఇంట్లో వాళ్ల‌ని అభ్యంత‌ర‌క‌ర ప‌ద‌జాలంతో దూషిస్తే..చూస్తూ ఊరుకోవ‌ట మే మ‌గ‌త‌న‌మా అని ప్ర‌శ్నించారు. దీంతో..అప్ప‌ట్లో ఈ అంశం రాజ‌కీయంగా ర‌చ్చ‌కు కార‌ణ‌మైంది.

ప్ర‌భాస్ ను ఎప్పుడూ క‌ల‌వ‌లేదు..

ప్ర‌భాస్ ను ఎప్పుడూ క‌ల‌వ‌లేదు..

తాను పాద‌యాత్ర చేసిన స‌మ‌యం నుండి..2014 ఎన్నిక‌ల టైంలోనూ..తిరిగి ఇప్పుడు త‌న వ్య‌క్తిత్వాన్ని హ‌రించే విధం గా ప్ర‌చారం చేస్తున్నార‌ని ష‌ర్మిళ ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకొని త‌న‌కు ప్ర‌భాస్ తో సంబంధాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం చేయ‌టం దుర్మార్గ‌మ‌న్నారు. తాను ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ తో అస‌లు ఎప్పుడూ మాట్లాడ‌లేద‌ని .. అస‌లు ప్ర‌భాస్ ను ఇప్ప‌టి వ‌ర‌కు ఏనాడు క‌ల‌వ‌లేద‌ని స్ప‌ష్టం చేసారు. రాజ‌కీయాల కోసం త‌న కుటుంబాన్ని..త‌న‌ను మాన‌సికంగా వేధించేందుకు ఇటువంటి ప్ర‌చారానికి దిగుతున్నార‌ని ష‌ర్మిళ ఆవేద‌న చెందారు. త‌న భ‌ర్త‌, పిల్ల‌లు ఇం త మంది ఈ ప్ర‌చారంతో బాధ ప‌డుతున్నార‌ని వివ‌రించారు. ఇటువంటి ప్ర‌చారం చేస్తున్న వారి పై చ‌ర్య‌లు తీసుకోవా ల‌ని కోరామ‌ని..అందుకు పోలీసు క‌మిష‌న‌ర్ సానుకూలంగా స్పందించార‌ని షర్మిళ వివ‌రించారు. అలాగే ఇటీవల వైఎస్ కుటుంబసభ్యులపై టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ విషయాన్ని కూడా షర్మిళ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ష‌ర్మిళ ల‌క్ష్యం ఎవ‌రు...ఈ ప్ర‌చారం ఎవ‌రిది..!

ష‌ర్మిళ ల‌క్ష్యం ఎవ‌రు...ఈ ప్ర‌చారం ఎవ‌రిది..!

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న పై ఇదే ర‌కంగా ప్ర‌చారం చేసార‌ని చెబుతున్న ష‌ర్మిళ దీని పై పోలీసుల‌కు ఇప్పుడు ఆధారాలు అంద‌చేసారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ ప్ర‌చారం చేస్తున్నార‌ని వివ‌రించారు. తొలుత టిడిపి శ్రేణులే ఈ ర‌కంగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల పేరుతో దుష్ప్ర‌చారం చేస్తున్నార‌నే అనుమానం వారు వ్య‌క్తం చేసారు. ఆ త‌రువాత చాలా క్లియ‌ర్ గా ఇది చంద్ర‌బాబు చేయిస్తున్న ప్ర‌చారం గా స్ప‌ష్టం చేసారు. టిడిపి శ్రేణులే త‌మ కుటుంబాన్ని మాన‌సికంగా వేధించేందుకు ఇటువంటి ప్ర‌చారానికి దిగుతున్నార‌ని పేర్కొన్నారు. గ‌తంలో వైయ‌స్సార్‌. జ‌గ‌న్ ల పైనా ఇదే విధంగా వ్య‌క్తిగ‌తం పై త‌ప్పుడు ప్ర‌చారం చేసి రాజ‌కీయ ల‌బ్ది కోసం ప్ర‌య‌త్నాలు చేసార‌ని ఆరోపించారు. ఇప్పుడు ష‌ర్మిళ చాలా స్ప‌ష్టంగా ఇది టిడిపి వారే చేస్తున్న ప్ర‌చారం గా ఫిర్యాదు చేయ‌టం తో..ఎన్నిక‌ల ముందు ఈ వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరగ‌నుంది..

English summary
YS Sharmila complains to Hyderabad Pollice Commissioner to take action on the people who are posting non sene and assassinating her character on social media. She She suspected TDP leaders behind this propaganda. She made clear that she never met tollywood hero Prabhas and said that she was not aware of a person by that name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X