వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా.. ఆ విషయంలో నాన్నను మించిపోయావు.. శభాష్.. అంటూ జగన్ కు షర్మిళ ట్వీట్..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: చాలా రోజుల తర్వాత షర్మిళ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు. అసలు షర్మిళ ఎటు వెళ్లిపోయింది..? ఎందుకు కనిపించడంలేదని చర్చించుకునే వాళ్లకు ఆమె ట్వీట్ ద్వారా సమాధానం చెప్పారు. తన అన్న, ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే కాకుండా సంక్షేమ పథకాల అమలులో నాన్న, దివంగత రాజశేఖర రెడ్డిని మించిపోయారని జగన్ ను పొగడ్తలతో ముంచెత్తింది. కరోనా క్లిష్ట సమయంలో జగన్ తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి షర్మిళ ప్రశంసలు కురిపించిందనకుంటే మాత్రం అది పొరపాటే..! ఇతంకీ అకస్మాత్తుగా అన్న జగన్మోహన్ రెడ్డిని షర్మిళ ఎందుకు ఆకాశానికెత్తారు..? తెలుసుకుందాం..!!

 విద్యార్ధుల జీవితాల్లో అన్న వెలుగులు నింపారు.. జగన్ ప్రారంభించిన విద్యాదీవెన పథకంపై షర్మిళ ప్రశంసలు..

విద్యార్ధుల జీవితాల్లో అన్న వెలుగులు నింపారు.. జగన్ ప్రారంభించిన విద్యాదీవెన పథకంపై షర్మిళ ప్రశంసలు..

తన తండ్రి దివంగత రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమంలో ఒక అడుగు ముందుకేస్తే.. పేదవాడికి మేలు చేయడానికి తాను రెండు అడుగులు ముందుకేస్తానని జగన్ తన సుధీర్గ పాద యాత్రలో అనేక సార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్ ఆ వాగ్దానాల అమలు దివగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని జగన్ చెల్లి షర్మిళ ప్రస్తావిస్తున్నారు. అన్న మాటిచ్చిన ప్రకారం ప్రతి పేదవాడికి మేలు చేయడంలో తండ్రిని మించిన తనయుడిగా నిలిచారని, అన్న ప్రారంభించిన విద్యాదీవెన చరిత్రలో నిలిచిపోతుందంటూ ట్విట్టర్లో మెచ్చుకున్నారు షర్మిళ. ఈ ట్వీటుతో పాటు, ఈ రెండు పథకాల గురించి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆ పథకాల ప్రసంగాలను కూడా ఆమె సోషల్ మీడియాకు విడుదల చేశారు.

 నాన్న ఒకడుగు వేస్తే జగన్ రెండడుగులు వేసారు.. జగన్ పాలనపై షర్మిళ సానుకూల స్పందన..

నాన్న ఒకడుగు వేస్తే జగన్ రెండడుగులు వేసారు.. జగన్ పాలనపై షర్మిళ సానుకూల స్పందన..

అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన బోదనా రుసుము పథకంలో సంబందించిన కాలేజీలకు నిధులు పంపించే వారు. కాబట్టి ఏ ఇబ్బంది తలెత్తినా కాలేజీలు చూసుకునేవి. ఇప్పుడు జగన్ వ్యూహాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. నిధులు కాలేజీలకు ఇవ్వకుండా అర్హత కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేస్తానని ప్రకటించారు. అంటే దివంగత వైఎస్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో అవే నిధులను జగన్ అందిస్తున్నారు. కాలేజీలకు అందిస్తే లేని విద్యార్ధులను ఉన్నట్టుగా చూపించి నిధులు వృధా చేసే అవకాశం ఉన్నందున నేరుగా విద్యార్థులకే అందిస్తున్నామని జగన్ ప్రభుత్వం చెప్పుకొస్తోంది.

Recommended Video

సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్‌ కుమార్‌కు కారు ప్రమాదం..!!
 షర్మిళ ఎంట్రీ పట్ల వైసిపిలో హర్షం.. షర్మిళ ట్వీట్ కు అభినందనలు తెలుపుతున్న శ్రేణులు..

షర్మిళ ఎంట్రీ పట్ల వైసిపిలో హర్షం.. షర్మిళ ట్వీట్ కు అభినందనలు తెలుపుతున్న శ్రేణులు..

ఇక ఎపుడైతే కాలేజీ యాజమాన్యాలకు నిధుల అంశంలో సంబంధం ఉండదో ఇతర ఫీజుల గురించి విద్యార్థులను విసిగించడం మొదలవుతుందనే చర్చ జరుగుతోంది. విద్యార్థుల చదువులకు ఇది ఆటంకంగా మారే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశాలపైన లోతైన అద్యయనం చేసి అందరికి మేలు చేసే విధంగా జగన్ అన్న అడుగు ముందుకు వేస్తారవని షర్మిళ పేర్కొంటోంది. చాలా కాలం తర్వాత షర్మిళ చేసిన ట్వీట్ పట్ల వైసిపి శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఏపిలో జగన్మోహన్ రెడ్డికి ఎంత ఫాలోయింగ్ ఉందో ఇంచుమించు షర్మిళకు కూడా అదే ఫాలోయింగ్ ఉన్నట్టు సమాచారం. కాగా జగన్ వైసీపి అదికారంలోకి వచ్చిన తర్వాత నుండి పెద్దగా రాజకీయాల్లో కనిపించని షర్మిళ తాజాగా ట్వీట్ చేయండాన్ని స్వాగతిస్తున్నామంటునన్నారు వైసీపి శ్రేణులు.

English summary
Several days later Sharmila intervened in AP politics.Jagan was praised by her brother, AP CM Jagan Mohan Reddy, not only in the administration but also in the implementation of welfare schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X