వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ నిర్ణయానికి కేంద్రం ఆమోదం లేదు: మూర్ఖపు ఆలోచన: పవన్ కళ్యాణ్..సునీల్ దేవధర్..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ ఏపీలో రాజధాని మార్పు..మూడు రాజధానుల నిర్ణయం పైన కేంద్రం అనుమతి ఉందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ నేతలు ఇది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని చెబుతూ వచ్చారు. బీజేపీ నుండి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తే కేంద్రం చేస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇదే సమయంలో సీఎం జగన్ కేంద్రానికి సమాచారం ఇచ్చారని..వారి అనుమతితోనే ముందుకు వెళ్తున్నారంటూ ఆంగ్ల పత్రికల్లో కధనాలు వచ్చాయి. దీనిని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ తప్పు బట్టారు. కేంద్రంతో చర్చించామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేసారు. దీనికి మద్దతుగా పవన్ సైతం ట్వీట్ చేసారు. కేంద్రం అనుమతితో రాజధాని తరలిస్తున్నారనేది అబద్దమని పవన్ తేల్చి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేదు..
ఈ రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల వ్యవహారం పైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే అధికార వైసీపీ మినహా..ఇతర పార్టీలు అమరావతి నుండి రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ..జనసేన పొత్తు ప్రకటన సమయంలోనూ అమరావతికి మద్దతుగా ప్రకటన చేసారు. ప్రభుత్వం అమరావతి విషయంలో అధికారికంగా నిర్ణయం తీసుకున్న తరువాత తాను స్పందిస్తానని జనసేన అధినేత పవన్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బీజేపీ సైతం ముఖ్యమంత్రి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే సరిపోదని..న్యాయ పరంగా పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేసారు. అయితే, ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం ఆమోదం లభించిందంటూ కధనాలు వస్తున్నాయి. దీనిని బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ తో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఖండించారు.

Shifting of capital from Amaravati with the consent of Centre is a lie: Bjp and Pawan
మూర్ఖపు నిర్ణయాన్ని సమర్ధించుకోలేక..
ఏపీ ప్రభుత్వం అమరావతి నుండి రాజధాని తరలింపు అనే మూర్ఖపు నిర్ణయాన్ని సమర్ధించుకోలేక..కేంద్రంతో చర్చించామనే తప్పుడు ప్రచారం చేస్తుందని..అబద్దాల ప్రచారంలో నాడు చంద్రబాబు..నేడు జగన్ ఒకటేనని సునీల్ దేవధర్ ట్వీట్ చేసారు. దీనికి జనసేన అధినేత పవన్ సైతం స్పందించారు. వైసీపీ ప్రభుత్వం చెబుతున్నది అబద్దమని..కేంద్రం అనుమతి లేదని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు. ఇక, ఈ రోజు అసెంబ్లీలో జరిగే పరిణామాలను గమనించిన తరువాత జనసేన అధినేత కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో రాజధాని పైన ప్రభుత్వ నిర్ణయం పై ఏ రకంగా స్పందించాలి..అదే విధంగా ఎలా ముందుకెళ్లాలనే దాని పైన నిర్ణయానికి రానున్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు తరువాత పార్టీ నేతలతో పవన్ తొలి సారి సమావేశమవుతున్నారు. ఇక, ఈ రోజు అసెంబ్లీలో జరిగే నిర్ణయాల ఆధారంగా జనసేన..బీజేపీ రాజధాని వ్యవహారంలో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
English summary
BJP and Janasena clarified that Rumours being spread by both ruling and opposition that Shifting of capital from Amaravati with the consent of Centre is a lie. Sunil Deodhar annd Pawan Kalyan stated the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X