వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ నిర్ణయమే శిల్పా సోదరుల కొంపముంచిందా, కలిసిరాలేదా, తొందరపాటా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Shilpa Brothers Lost Their Political Career ఆ నిర్ణయమే శిల్పా సోదరుల కొంపముంచిందా ?

నంద్యాల రాజకీయాల్లో హత్యలుండవు...ఆత్మహత్యలే ఉంటాయని చెబుతుంటారు.రాజకీయ నేతలు కొన్ని సమయాల్లో తీసుకొనే నిర్ణయాలు రాజకీయంగా వారి భవిష్యత్తుకు ఇబ్బందులను తెచ్చిపెడతాయి.

ఆ మూలాలపై టిడిపి కన్ను, శిల్పా సోదరుల మధ్య విబేధాలు?ఆ మూలాలపై టిడిపి కన్ను, శిల్పా సోదరుల మధ్య విబేధాలు?

శిల్పా సోదరులు అధికారపార్టీని వదిలి వైసీపీలో చేరి తీవ్రంగా ఇబ్బందులపాలయ్యారని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో తొందరపాటుతో తీసుకొనే నిర్ణయాలు నస్టం తెచ్చిపెడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నంద్యాల: రిజల్ట్స్‌పై నిద్రపోలేదన్న అచ్చెన్న, దిమ్మతిరిగే జవాబిచ్చిన బాబునంద్యాల: రిజల్ట్స్‌పై నిద్రపోలేదన్న అచ్చెన్న, దిమ్మతిరిగే జవాబిచ్చిన బాబు

ఏపీ రాష్ట్రంలో నంద్యాల ఉపఎన్నిక ఫలితం వచ్చేవరకు హట్‌టాపిక్‌గా ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడ నంద్యాలపైనే చర్చ సాగుతోంది. టిడిపికి ఊహించిన దాని కంటే భారీ మెజారిటీ రావడం వైసీపీని షాక్‌కు గురిచేసింది.

నంద్యాల: మౌనిక దూకుడు, అదే జరిగితే వైసీపీకి తీవ్ర నష్టమేనా?నంద్యాల: మౌనిక దూకుడు, అదే జరిగితే వైసీపీకి తీవ్ర నష్టమేనా?

అయితే నంద్యాల ఉపఎన్నికల్లో టిక్కెట్టు కేటాయింపు విషయంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ శిల్పా మోహన్‌రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరారు. తొందరపాటుతో శిల్పా ఈ నిర్ణయం తీసుకొన్నారని ఇప్పటికీ కూడ కొందరు టిడిపి నేతలు అంతర్గత సమావేశాల్లో అభిప్రాయపడుతుంటారు.

మోహన్‌రెడ్డి తన సోదరుడు చక్రపాణిరెడ్డి రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టారని కూడ టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే కొన్ని సమయాల్లో తీసుకొనే నిర్ణయాలు రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదు.

రాజకీయాల్లో ఆత్మహత్యలే

రాజకీయాల్లో ఆత్మహత్యలే

రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని సీనియర్ రాజకీయ నేతలు చెబుతుంటారు. ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు అనుసరించే వ్యూహల్లో చిన్న పొరపాటు జరిగినా రాజకీయ జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసిన శిల్పా మోహన్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. ఆయన సోదరుడు చక్రపాణిరెడ్డి సుమారు ఐదేళ్ళకు పైగా ఉన్న ఎమ్మెల్సీ పదవిని కూడ త్యాగం చేశారు. టిక్కెట్టు కేటాయింపు విషయమై పట్టుదలకు పోయి మోహన్‌రెడ్డి రాజకీయంగా నష్టపోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తొందరపాటు నిర్ణయమా?

తొందరపాటు నిర్ణయమా?

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో టికెట్‌ కోసం శిల్పా మోహన్‌రెడ్డి ఎంతగానో ప్రయత్నించారు. ఒకదశలో టీడీపీలోని కొంత మంది నేతలు శిల్పా మోహన్‌రెడ్డికే టికెట్‌ ఇవ్వాలని అన్నారు. తన తండ్రి టికెట్‌ తమ ఫ్యామిలీకే ఇవ్వాలని పట్టుపట్టారు అఖిలప్రియ.. చంద్రబాబు అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే టికెట్‌పై నిర్ణయం తీసుకుంటారని చెప్పినప్పటికీ శిల్పా మోహన్‌రెడ్డి ఆగలేకపోయారు.. తొందరపడి ఓ అడుగు ముందుకేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నంద్యాల నుంచి పోటీ చేశారు.

కాలం కలిసి రాకపోతే..

కాలం కలిసి రాకపోతే..

కాలం కలిసిరాకపోతే తాడే పాము రూపంలో కాటేస్తోందనే నానుడి. వైసీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డి తాను వైసీపీలో చేరడమే కాకుండా తన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డిని కూడా తీసుకెళ్లారు . ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటామని జగన్‌ షరతు విధించారు.. దాంతో చక్రపాణిరెడ్డి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వచ్చిన పదవిని వదులుకోగా.. మరో పదవి కోసం పోటీపడి ఓడిపోయిన శిల్పా బ్రదర్స్‌కు ఇది రాజకీయంగా ఎదురుదెబ్బేనని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.. శిల్పా బ్రదర్స్‌ టీడీపీలోనే ఉండి ఉంటే శిల్పా చక్రపాణిరెడ్డికి శాసనమండలి ఛైర్మన్‌ పదవి దక్కేదని.. చంద్రబాబు ఈ మేరకు హామీ కూడా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు తెలుగుదేశం నేతలు. నంద్యాల ఎన్నికల ఫలితాలు శిల్పా బ్రదర్స్‌కు షాకిచ్చాయి..

భూమా కుటుంబానిదే పై చేయి

భూమా కుటుంబానిదే పై చేయి


. అదృష్టం కలిసొచ్చి అవకాశాలు వస్తుంటే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. భూమా శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. అయితే నాగిరెడ్డి మరణంతో అఖిలప్రియకు మంత్రి పదవి వచ్చింది. నంద్యాల ఉప ఎన్నికల్లో సోదరుడు బ్రహ్మనందరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ పరిస్థితిని ఎవరూ కూడ కోరుకోరు. కానీ, వీరిద్దరి మరణంతో భూమా కుటుంబానికి పదవులు వచ్చాయి. అయితే తొందరపడి తీసుకొన్న నిర్ణయంతో శిల్పా సోదరులు తమ పదవులను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది.

English summary
Some of Tdp leaders expressed their opinion on Nandyal result. shilpa mohan reddy and his brother joined in ysrcp , this decision reflects on political career said Tdp senior leader. Shilpa brothers lost their political career he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X