వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''జగన్ చెప్పినట్టుగానే నంద్యాల తీర్పు, రాజకీయ సన్యాసంపై శిల్పా మౌనం వీడాలి''

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల ఉపఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే రాజకీయ సన్యాసానికి శిల్పా మోహన్‌రెడ్డి కట్టుబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు.నంద్యాలలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి ఓటమిపాలైతే తాను చెప్పినట్టుగానే మంత్రి పదవికి రాజీనామాకు కట్టుబడి ఉండేదాన్ని అన్నారు అఖిలప్రియ.

'ఆళ్ళగడ్డ అమ్మ, నంద్యాల నాన్న, శిల్పా గురించి తెలియకే జగన్ టిక్కెట్టు'''ఆళ్ళగడ్డ అమ్మ, నంద్యాల నాన్న, శిల్పా గురించి తెలియకే జగన్ టిక్కెట్టు''

నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి 27వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో విజయంపై ధీమాగా ఉన్నారు. కానీ, ఓటర్లు మాత్రం టిడిపిని గెలిపించారు.

నంద్యాల: వ్రతం చెడ్డ ఫలితం లేదు, అంతర్మథనంలో వైసీపీనంద్యాల: వ్రతం చెడ్డ ఫలితం లేదు, అంతర్మథనంలో వైసీపీ

నంద్యాల ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే నంద్యాలలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి విజయం సాధించకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి భూమా అఖిలప్రియ ప్రకటించారు.

గెలుపైనా, ఓటమైనా , చావైనా, బతుకైనా వైసీపీతోనే: రోజాగెలుపైనా, ఓటమైనా , చావైనా, బతుకైనా వైసీపీతోనే: రోజా

అయితే తాను ఓటమిపాలైతే రాజకీయ సన్యాసం చేస్తానని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ప్రకటించారు. అయితే అదే సమయంలో మరోసారి ఈ విషయమై మంత్రి అఖిలప్రియ నుండి స్పష్టత రావాలని శిల్పా మోహన్‌రెడ్డి కోరారు.ఈ విషయమై ఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ మంగళవారం నాడు అమరావతిలో పలు ఛానెళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

రాజకీయ సన్యాసంపై శిల్పా మౌనం వీడాలి

రాజకీయ సన్యాసంపై శిల్పా మౌనం వీడాలి


నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమిపాలైతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి, వైసీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డి మౌనం వీడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రకటించినట్టుగానే రాజకీయ సన్యాసంపై స్పందించాలని ఆమె శిల్పా మోహన్‌రెడ్డికి సవాల్ విసిరారు. రాజకీయాల్లో ఉన్న నేతలు ఏది పడితే అది మాట్లాడితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు తప్పవన్నారు. మాట్లాడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఒకవేళ తాము ఓటమి పాలైతే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేదాణ్ణి అని మంత్రి స్పష్టం చేశారు.

జగన్ చెప్పినట్టే నంద్యాల ప్రజలు ఓట్లేశారు

జగన్ చెప్పినట్టే నంద్యాల ప్రజలు ఓట్లేశారు

అమ్మ, నాన్నలు కూడ ఇదే వయస్సుల్లోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఉమ్మడి కుటుంబం నుండి వచ్చాం. ఇద్దరు లేకపోవడం మాకు నష్టం కల్గించింది.మేమిద్దరం కలిసి పనిచేస్తామనే నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు. భూమా శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలు ఏ రకంగా పనిచేశారో తాము కూడ పనిచేస్తామన్నారు.ధర్మానికి, న్యాయానికి ఓటు వేయాలని వైసీపీ చీఫ్ జగన్ ఎన్నికల ప్రచారంలో కోరారని మంత్రి అఖిలప్రియ గుర్తుచేశారు. జగన్ కోరినట్టుగానే నంద్యాల ప్రజలు ధర్మానికి, న్యాయానికే ఓటు వేశారని అఖిలప్రియ చెప్పారు.

గెలుపుతో సరిపెట్టుకోవద్దన్న బాబు

గెలుపుతో సరిపెట్టుకోవద్దన్న బాబు

నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశానని... వెంటనే చంద్రబాబు ఒకే మాట అన్నారని, ఈ గెలుపుతో మన ఆశయం పూర్తయినట్టు కాదన్నారని మంత్రి అఖిలప్రియ చెప్పారు. అభివృద్ధిలో నంద్యాలను ముందుకు తీసుకెళ్తేనే నాగిరెడ్డి ఆశయాన్ని పూర్తిచేసినట్టని చెప్పారని మంత్రి అఖిలప్రియ చెప్పారు. నాగిరెడ్డి కోరుకున్న అభివృద్ధి నంద్యాలలో కనిపిస్తోందని అన్నారు.

అమ్మ, నాన్నలు లేరనే బాధ

అమ్మ, నాన్నలు లేరనే బాధ

అమ్మనాన్నలు లేకుండా సాధించిన...ఈ విజయం వారిని ప్రతిక్షణం గుర్తు చేస్తుందని అఖిలప్రియ అన్నారు. అమ్మానాన్న లేని బాధ ఏంటో అనుభవించిన వారికే తెలుస్తుందన్నారు మంత్రి అఖిలప్రియ. భూమా నాగిరెడ్డి హామీలను తప్పకుండా నెరవేర్చుతామని మంత్రి స్పష్టం చేశారు. అన్నయ్య బ్రహ్మానందరెడ్డి గెలుపు సీమ రాజకీయాల్లో మార్పు తెస్తుందని, నంద్యాల విజయంలో యువత, మహిళలదే కీలకపాత్ర అని అఖిలప్రియ కొనియాడారు. రాజకీయాల్లో నాకు అన్న తోడుగా వచ్చారని, అమ్మానాన్న లేని మమ్మల్ని ప్రజలు ఆదరించారని అఖిలప్రియ భావోద్వేగంతో అన్నారు. ప్రజలు మమ్మల్ని నమ్మారు.. వారి నమ్మకాన్ని వమ్ము చేయమని, వారికి అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామని అఖిలప్రియ స్పష్టం చేశారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కళ్ల ముందు కనిపించిందని, ముఖ్యమంత్రి ఆశయాలను ముందుకు తీసుకెళతామని అఖిలప్రియ అన్నారు

బాబును కలిసిన అఖిలప్రియ, బ్రహ్మనందరెడ్డి

బాబును కలిసిన అఖిలప్రియ, బ్రహ్మనందరెడ్డి


ఏపీ సీఎం చంద్రబాబునాయుడును మంత్రి అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డి, పలువురు మంత్రులు మంగళవారం నాడు అమరావతిలో కలిశారు. కేక్ కట్ చేసి చంద్రబాబునాయుడు బ్రహ్మనందరెడ్డికి తినిపించారు. నంద్యాల ఎన్నికల ఫలితాలపై మంత్రులు, చంద్రబాబు చర్చించారు. ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకు కృసి చేయాలని బాబు మంత్రులను ఆదేశించారు.

English summary
Ap Tourism minister Bhuma Akhila Priya demanded to Shilpa Mohan reddy leave politics. If Tdp candidate Bhuma Brahmananda reddy defeat in Nandyal Iam stick on my words.Why Shilpa Mohan reddy not clarify on this challenge she asked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X