చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సొంత జిల్లాలో బాబుకు షాక్, జగన్ పార్టీలోకి అధ్యక్షుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shock to Chandrababu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలో పెద్ద షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. చంద్రబాబుకు సొంత జిల్లాలోనే... అదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఝలక్ ఇవ్వడం గమనార్హం.

తెరాసలోకి ఎర్రబెల్లి సోదరుడు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కెసిఆర్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్, బిజెపి కుటముల ఓటమికి కృషి చేస్తామని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. సిపిఎం తెలంగాణ అభివృద్ధి ప్రణాళికను ఈ నెల 16న ప్రకటిస్తామన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు దాదాపు లేనట్టేనన్నారు. నోముల పార్టీ నుంచి బయటకు వెళ్లడం బాధాకరమన్నారు.

రేపే నామినేషన్ తేలని అభ్యర్థులు

తెలంగాణ ప్రాంతంలో నామినేషన్ దాఖలుకు చివరి తేది రేపే. అయినప్పటికీ ఆయా పార్టీలలో అభ్యర్థుల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటి వరకు 109 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో పదిమందిని ఖరారు చేయాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు 27 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. మరో 45 మందిని ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెసు పార్టీ 111 మంది అభ్యర్థులను ప్రకటించినప్పటికీ... కొన్ని మార్పులు, చేర్పులకు అవకాశముంది. బిజెపి ఒక్క అభ్యర్థిని ప్రకటించలేదు. అన్ని పార్టీలు రాత్రిలోగా అభ్యర్థులను దాదాపు ప్రకటించే అవకాశముంది.

English summary

 Shock to Telugudesam party chief Nara Chandrababu Naidu in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X