వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కు షాక్ ఇచ్చిన కామ్రేడ్... ఎన్నికల్లో ఓటమిపై కామెంట్

|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ కు షాక్ ఇచ్చిన కామ్రేడ్|CPI Blames Pawan's Lack Of Strategy For Poll Rout In Rajamahendravaram

2019 ఏపీ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం పాలైంది. ఎన్నికల సమయంలో జనసేన వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. అయితే, మంచి ఫలితాలను పొందడానికి ఈ పార్టీల మధ్య సరైన సమన్వయం కుదరలేదనే చెప్పాలి . దీంతో కామ్రేడ్లు జనసేనను నిందిస్తున్నారు. ఏపీలో జరిగిన ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలోనూ కామ్రేడ్స్ తో పొత్తు పెట్టుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు వెళ్ళారు . కమ్యూనిస్టులను వెంట పెట్టుకొని తిరగటం ద్వారా జనసేన ప్రయోజనం పొందింది మాత్రం శూన్యం అనే చెప్పాలి .

టీడీపీ, జనసేన మధ్య ఉన్న రహస్య ఒప్పందమే ఓటమికి కారణం అన్న కామ్రేడ్

టీడీపీ, జనసేన మధ్య ఉన్న రహస్య ఒప్పందమే ఓటమికి కారణం అన్న కామ్రేడ్

పవన్‌కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడు మధ్య రహస్య ఒప్పందం చివరకు 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సహాయపడిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నాగేశ్వర్‌రావు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ 'మంగళగిరి మరియు కుప్పంలో జనసేన అభ్యర్థుల కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకపోగా, చంద్రబాబు నాయుడు భీమవరం మరియు గాజువాకలో టిడిపి అభ్యర్థుల కోసం ప్రచారం చేయలేదు. అది రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందానికి సంకేతం అన్న రీతిలో కామ్రేడ్ వ్యాఖ్యలు చెయ్యటం గమనార్హం .

పవన్ కారణంగా కమ్యునిస్టులకు.. వామపక్షాల కారణంగా పవన్ కు ఒరిగిందేమీ లేదు

పవన్ కారణంగా కమ్యునిస్టులకు.. వామపక్షాల కారణంగా పవన్ కు ఒరిగిందేమీ లేదు

ప్రతి 5 సంవత్సరాలకు, ఎన్నికలకు ముందు, తమ భాగస్వాములను మార్చే ట్రాక్ రికార్డ్ కమ్యూనిస్టులకు ఉంది. పొత్తు ప్రతిపాదనపై వైసిపి సానుకూలంగా స్పందించకపోవడంతో, వామపక్షాలు పవన్ కళ్యాణ్‌తో స్నేహం చేశాయి,పవన్ కు ఉన్న ఇమేజ్ తమకు ఉపయోగపడుతుందని భావించిన కామ్రేడ్లు అలాంటిదేమీ జరగకపోయే సరికి తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్ప కతప్పదు. పవన్ కారణంగా కమ్యునిస్టులకు.. వామపక్షాల కారణంగా పవన్ కు ఒరిగిందేమీ లేదు. పవన్ తో ప్రయాణం ఇక చాల్లే అనుకున్నారో ఏమో కానీ.. తాజాగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఊహించని రీతిలో ఈ తరహా కామెంట్ చేశారు.

వామపక్షాలతో పొత్తు కూడా పవన్ కు నష్టమే చేసిందంటున్న రాజకీయ విశ్లేషకులు

వామపక్షాలతో పొత్తు కూడా పవన్ కు నష్టమే చేసిందంటున్న రాజకీయ విశ్లేషకులు

2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతా అన్న పవన్ , ఎన్నికల్లో కమ్యూనిస్ట్ లు బీఎస్పీ తో పొత్తుపెట్టుకుని రావడంతో ఆయనకు బలం లేకే ఈ హడావిడి అన్నది ప్రచారం బాగా జరగడంతో పార్టీకి తీవ్ర డ్యామేజ్ అయ్యింది. తాను పొత్తు లేకుండా దిగుతా అనడమే కాకుండా గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం అన్న పవన్ కళ్యాణ్ దానిపైన దృష్టి సారించలేదు. ఇక తమతో పొత్తులో ఉన్న కమ్యూనిస్ట్ ల ప్రభావం వుంటుంది అనుకుంటే అది కూడా లేకపోయేసరికి పవన్ పార్టీ ఘోర పరాజయం పొందింది. ఇక పవన్ పార్టీకి ఏ రకంగానూ సహాయం చెయ్యలేకపోయిన కామ్రేడ్ లకు కూడా విమర్శించే అవకాశం వచ్చింది.

English summary
Jana Sena had an alliance with Left Parties for the 2019 AP Elections. However, There was no proper coordination between these parties to attain the best results. Eventually, They ended up on the losing side and now one of them is blaming the other for the defeat.CPI State assistant Secretary M Nageshwar Rao alleged secret pact between Pawan Kalyan and Chandrababu Naidu eventually helped YSR Congress Party in 2019 Elections. He explains: 'While Pawan Kalyan hasn't campaigned for Jana Sena Candidates in Mangalagiri and Kuppam, Chandrababu Naidu hadn't campaigned for TDP Candidates in Bhimavaram and Gajuwaka. That itself is a sign of the secret understanding between the two parties'.Communists have the track record of changing their partners after every 5 years, just before the elections. As YCP hadn't responded positively to the proposal of alliance, Left Parties befriended Pawan Kalyan hoping that his charisma would do the magic. The judgement has gone terribly wrong and don't be surprised if they move closer to TDP in the next few years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X