రాజ్యసభలో కేవీపీకి షాక్: ప్రత్యేక హోదా బిల్లు ద్రవ్య వినిమయ బిల్లే
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు ద్రవ్య వినిమయ బిల్లుగా డిప్యూటీ చైర్మన్ కురియన్ నిర్ధారించారు.
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా పైన రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు పైన కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. అది ద్రవ్య వినిమయ బిల్లుగా నిర్ధారించారు. దీంతో కేవీపీకీ గట్టి ఝలక్ ఇచ్చారు.
శుక్రవారం నాడు కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా బిల్లు అంశంపై రాజ్యసలో చర్చ జరిగింది. దీనిని ద్రవ్య వినిమయ బిల్లుగా నిర్ధారించినట్లు డిప్యూటీ చైర్మన్ కురియన్ చెప్పారు. నిపుణుల సలహాల మేరకే నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ప్రొసీడింగ్స్ నుంచి కేవీపీ ప్రవేశ పెట్టిన హోదా బిల్లును తొలగిస్తున్నట్లు తెలిపారు.
కాగా, గత సమావేశాల్లో కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన ప్రయివేటు మెంబర్ బిల్లు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. విభజన చట్టంలో మార్పులు చేయాలని కోరుతూ ఆయన ఈ బిల్లు ప్రవేశ పెట్టారు. అయితే ఇది ద్రవ్య వినిమయ బిల్లు అని, లోకసభలో ఆమోదం తెలపకుండా రాజ్యసభలో ప్రవేశ పెట్టకూడదని చెప్పారు. అది ద్రవ్య వినిమయ బిల్లా కాదా నిర్ణయిస్తామని గత సమావేశాల్లో చెప్పారు. ఇప్పుడు నిర్దారించారు.

అంతకుముందు సభలో నోట్ల రద్దుపై రాజ్యసభలో విపక్షాల ఆందోళన కొనసాగింది. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే పలువురు సభ్యులు ప్రయివేటు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఏపీ పునర్విభజన చట్టంలో మార్పులు చేయాలని, హోదా ఇవ్వాలని గతంలో కేవీపీ ప్రయివేటు బిల్లు ప్రవేశపెట్టారు.
కాగా, కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుకు బీజేపీ మినహా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. కేవీపీ బిల్లును సభలో ప్రవేశపెట్టి, చర్చ పూర్తయిన తర్వాత ఈ బిల్లు ద్రవ్య బిల్లు అంటూ కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ డిప్యూటీ స్పీకర్ కురియన్ దృష్టికి తెచ్చిన విషయం తెలిసిందే.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications