నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్ర‌బాబు కు భారీ షాక్ : వైసిపి లోకి ఆదాల‌ ..స్థానం ఖ‌రారు : జ‌గ‌న్ తో బుట్టా రేణుక భేటీ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

టిడిపి కు భారీ షాక్.. వైసిపి లో చేరుతున్న అగ్ర నేతలు ! | Oneindia Telugu

నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి భారీ షాక్‌. అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించి...ప్ర‌చారం సైతం మొద‌లు పెట్టిన త‌రువాత నెల్లూరు రూర‌ల్ అభ్య‌ర్ధిగా బ‌రిలో దిగిన ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి ఊహించ‌ని జ‌ల‌క్ ఇచ్చారు. ఆయ‌న నిన్న‌టి నుండి స‌డ‌న్ గా అజ్ఞా తంలోకి వెళ్లిపోయారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో క‌ర్నూలు ఎంపీగా గెలిచి టిటిపి లో చేరిన బుట్టా రేణుక సైతం తిరిగి వైసిపి లోకి రానున్నారు. ఈ రోజు జ‌గ‌న్ తో భేటీ అవుతున్నారు.

తెలుగు హీరోల‌కు అగ్ని ప‌రీక్ష‌లా మారిన ఎన్నిక‌లు..! ఎవ‌రు ఏ గ‌ట్టున ఉండ‌బోతున్నారు..??తెలుగు హీరోల‌కు అగ్ని ప‌రీక్ష‌లా మారిన ఎన్నిక‌లు..! ఎవ‌రు ఏ గ‌ట్టున ఉండ‌బోతున్నారు..??

వైసిపి లోకి ఆదాల‌...

వైసిపి లోకి ఆదాల‌...

నెల్లూరు జిల్లా సీనియ‌ర్ నేత ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి టిడిపి అధినేత చంద్ర‌బాబు కు భారీ షాక్ ఇచ్చారు. 2014 ఎన్నిక‌ల వేళ ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి టిడిపిలో చేరారు. గ‌త ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధిగా ఓడిన ఆదాల‌..ఈ ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధిగా తిరిగి పోటీ చేయ‌టం పై అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న లు జ‌రిగాయి. ఆయ‌న ఎంపీగా పోటీ చేయ‌టానికి నిరాక‌రించారు. దీంతో..టిడిపి అధి నేత చంద్ర‌బాబు ..ఆయ‌న పార్టీ వీడ‌కుండా బుజ్జ‌గించే క్ర‌మంలో భాగంగా..ముందుగానే ఆయ‌న కు సీటు ఖ‌రారు చేసారు. నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుండి అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించారు. ఆయ‌న అక్క‌డి నుండి ప్ర‌చారం ప్రారంభించారు. స‌డ‌న్ గా ఆయ‌న శుక్ర‌వారం మ‌ధ్నాహ్నం నుండి ప్ర‌చారం నిలిపివేసారు. అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. అయితే, ఆయ‌న వైసిపి తో ట‌చ్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న అజ్క్షాతంలోకి వెళ్లే ముందు ఓ ఆస‌క్తి క‌ర ప‌రిణామం చోటు చేసుకుంది.

పెండింగ్ బిల్లుకు సాధించి...

పెండింగ్ బిల్లుకు సాధించి...

ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డికి చాలా కాలంగా ప్ర‌భుత్వం నుండి దాదాపు 43 ఓట్ల మేర బిల్లులు బకాయిలు ఉన్నాయి. దీని కోసం ప్ర‌భుత్వం పై ఒత్తిడి తెచ్చారు. అయితే, ఎన్నిక‌ల వేళ‌..అధికార పార్టీకి ఆదాల‌కు రావాల్సిన 43 కోట్ల బ‌కాయిల ను శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఆ వెంట‌నే ఆయ‌న స‌డ‌న్ గా అదృశ్య‌మ‌య్యారు. ఆదాల వైసిపి నేత‌ల‌తో ట‌చ్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న వైసిపి నుండి ఈ ఎన్నిక‌ల్లో నెల్లూరు కొవ్వూరు నుండి పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు వైసిపి లో చేర‌నున్నారు. అయితే, ఇప్పుడు టిడిపిలో క‌ల‌క‌లం రేపుతోంది. స్థానం ఖ‌రారు చేసి.. పెండిం గ్ బిల్లులు సాధించి ఇప్పుడు పార్టీ మార‌టంతో టిడిపి నేత‌లు ఖంగుతిన్నారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం పై టిడిపి అధినే త దృష్టి సారించారు. నెల్లూరు రూర‌ల్ లో తాజా ప‌రిస్థితి పై స‌మీక్షిస్తున్నారు.

వైసిపి లో బుట్టా రేణుక రీ ఎంట్రీ..

వైసిపి లో బుట్టా రేణుక రీ ఎంట్రీ..

గ‌త ఎన్నిక‌ల్లో వైసిపి నుండి క‌ర్నూలు ఎంపీగా పోటీ చేసి గెలిచిన బుట్టా రేణుక టిడిపిలోకి ఫిరాయించారు. ప్ర‌స్తుత ఎ న్నిక‌ల్లో తిరిగి సీటు టిడిపి నుండి ద‌క్క‌లేదు. క‌ర్నూలు ఎంపీగా కోట్ల సూర్య ప్ర‌కాశ రెడ్డి ని టిడిపి ఖ‌రారు చేసింది. ఇక బుట్టా రేణుక‌ను ఆదోని నుండి పోటీ చేయాల‌ని టిడిపి సూచించింది. అందుకు రేణుక అంగీకించ‌లేదు. ఇక‌, రాజ్య‌స‌భ సీటు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసారు. రేణుక మాత్రం స‌సేమిరా అన్నారు. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన నేత‌లు రేణుక తో రాయ భారం న‌డిపారు. త‌న స‌న్నిహితులు..కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన త‌రువాత రేణుకు తిరిగి వైసిపి లో చేరాల ని నిర్ణ‌యించారు. దీంతో.. ఈరోజు వైసిపి అధినేత జ‌గ‌న తో భేటీ కానున్నారు. కానీ, పార్టీలోకి వ‌చ్చినా..ఎన్నిక‌ల్లో సీటు మాత్రం లేద‌ని వైసిపి ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.

English summary
Major Political shock for TDP in Nellore dist. Senior leader and Nellore rural candidate Adala Prabhakar reddy decided to join in YCP. Sitting MP Butta Renuka also re entry in YCP. She decided to meet Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X