వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుబాబులకు మరోషాక్.... రూ.5000 ఉంటేనే మద్యం...!

|
Google Oneindia TeluguNews

ఏపీ మందుబాబులకు మరోసారి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే మద్య నియంత్రణలో భాగంగా పలు చర్యలు చేపట్టిన ప్రభుత్వం మరో కొత్త నిబంధనను తీసుకువచ్చింది. మద్యాన్ని సేవించాలనుకునే వారికి కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. అదికూడ 25 సంవత్సరాల పైబడిన వారికే ఈ లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో మద్యం సేవించాలనుకునే వారు కార్డు రూపంలోనే కొనుగోలు చేయాల్సి ఉండగా అందుకోసం 5000 రూపాలయను ముందుగా డిపాజిట్ చేయాలని నిర్ణయించింది..

మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చిట్‌చాట్: మద్య నిషేధంపై చర్చ, మంత్రుల భిన్న అభిప్రాయాలు..మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చిట్‌చాట్: మద్య నిషేధంపై చర్చ, మంత్రుల భిన్న అభిప్రాయాలు..

 రూ. 5000 ఉంటేనే మద్యం కార్డు

రూ. 5000 ఉంటేనే మద్యం కార్డు

ఇక కార్డుల రూపంలో మద్యాన్ని విక్రయించాలని భావిస్తున్న ప్రభుత్వం ..కార్డుల జారీ కోసం ముందుగా అయిదు వేల రూపాయలను డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. దీంతో ఆర్ధికంగా మద్యం ప్రియులపై భారం పడే అవకాశాలు ఉండడంతో మద్యం సేవించేందుకు ముందుకు రాకపోవచ్చన్నది ప్రభుత్వ అంచనా..మరోవైపు ఈ విధానం ద్వార 25 సంవత్సరాలకు పైబడిన వారే కార్డులకు అర్హులు కావడంతో ఒకరకంగా మైనర్లు, చదువుకునే విద్యార్థులుకు మద్యం లభించకుండా ప్రణాళికలు సిద్దం చేసింది. ముందు కార్డును జారీ చేసేందుకు అయిదువేల రూపాయలను డిపాజిట్ చేసుకుని మొదటి కార్డును ఇవ్వాలని నిర్ణయించింది. దీని ద్వారనే మద్యాన్ని విక్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

విధివిధానలపై కసరత్తు

విధివిధానలపై కసరత్తు

దీని ద్వార మైనర్లకు మద్యం లభించకపోవడంతో పాటు రాష్ట్రానికి కూడ ముందస్తుగా ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయి. కార్డుల ద్వార ముందస్తుగా డబ్బులు సేకరించడం ద్వార ప్రభుత్వానికి కూడ కొంతమేర ఆదాయం లభించనుంది. అయితే కార్డుపై ఏ మేరకు అనుమతిస్తారు. మద్యం విక్రాయానికి లిమిట్స్ ఉంటాయా.. ఒక కార్డుమీద ఏమేరకు విక్రయిస్తారనే వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తం మీద కార్డుల రూపంలో మద్యం విక్రయం ద్వార కొంతమేర విచ్చల విడి మద్యం అమ్మకాలను అరికట్టే అవకాశాలు ఉన్నట్టు పరీశీలకులు భావిస్తున్నారు.

 దశలవారిగా మద్య నిషేధం

దశలవారిగా మద్య నిషేధం

దశలవారిగా మద్యనిషేధాన్ని అమలు చేయాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే...ఇందుకోసం నూతన మద్యం పాలసీని తీసుకువచ్చి ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించే విధంగా చర్యలు చేపట్టింది. అనంతరం వాటిద్వారనే మద్యాన్ని విక్రయిస్తోంది. ప్రతి సంవత్సరం 20 శాతం మేర మద్యం షాపులను తగ్గించి పూర్తి మద్యాన్ని నిషేధించాలని భావిస్తోంది. ఇక బెల్లు షాపులపై కూడ కొరఢా ఝలిపిస్తున్న విషయం తెలిసిందే...

బార్లను తగ్గించిన ప్రభుత్వం

బార్లను తగ్గించిన ప్రభుత్వం

మరోవైపు బార్ల విధానంలో కూడ మార్పులు తీసుకువచ్చింది. కొత్త సంవత్సరంలో నూతన విధానం అమల్లోకి రాబోతుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడ జారీ చేసింది. కాగా ఇప్పటి వరకు ఉన్న బార్ల సంఖ్యను తగ్గించనుంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం బార్లలో నలబై శాతం మేర తగ్గించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న సుమారు 800 బార్లకు గాను 480 మేర మాత్రమే లైసెన్సులను జారీ చేయనుంది. దీంతో పాటు పలు కఠిన నిబంధనలు సైతం అమలు చేస్తోంది.

English summary
once again gave shock to alcoholics of ap government. alcohol will be sold by card to the alcoholics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X