హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కు ఝలక్ .... ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు కీలక ఆదేశం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా లాక్ డౌన్ చేశాయి తెలుగు రాష్ట్రాలు . ఇక లాక్ డౌన్ ప్రభావంతో హైదరాబాద్ లోనూ హాస్టళ్ళు ఖాళీ అయ్యాయి . ఇక హైదరాబాద్ లో చిక్కుకుపోయిన ఆంధ్రావాసులకు తెలంగాణ పోలీసులు ఏపీకి వెళ్ళటానికి ఎన్వోసి ఇచ్చి మరీ పంపించారు. అయితే ఏపీ సరిహద్దుల్లో వారందరినీ ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఏపీలోకి రావడానికి వీల్లేదని తెలంగాణలోనే ఉండాలని సూచించారు. ఇక గత రెండు రోజులుగా ఇది రగడగా మారుతుంది. సరిహద్దుల్లో నిరీక్షిస్తున్న వారిని ఏపీలోకి ప్రభుత్వం అనుమతించకపోవటంతో ఉద్రిక్త పరిస్థితులు పోలీసుల మీద దాడి చేసే దాకా వెళ్ళాయి . అయితే ప్రభుత్వం మాత్రం సరిహద్దులను మూసివేశామని ఎవరూ రావద్దని స్పష్టంగా చెప్పింది.

Recommended Video

AP High Court Orders To Those Who Wants To Come AP

 కరోనా కారణం అని లేఖ .. రాజమండ్రిలో దంపతుల మృతి పై అనుమానాలు కరోనా కారణం అని లేఖ .. రాజమండ్రిలో దంపతుల మృతి పై అనుమానాలు

బోర్డర్ గందరగోళంపై హైకోర్టులో పిటీషన్

బోర్డర్ గందరగోళంపై హైకోర్టులో పిటీషన్

తెలంగాణలో ఉన్న ఆంధ్రులు ఏపీకి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడం రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపివేయడంపై బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ తాజాగా ఏపీ హైకోర్టు లో పిటీషన్ వేశారు. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు ఏపీలోకి వెంటనే బేషరతుగా తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఏపీ ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేసింది. కరోనా వ్యాప్తి చెందుతుందన్న భయంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు . ఐసోలేషన్ లో ఉంటామన్న వారినే అనుమతిస్తామని చెప్తున్నారు.

వారిని ఏపీలోకి అనుమతించాలని హైకోర్టు ఆదేశం

వారిని ఏపీలోకి అనుమతించాలని హైకోర్టు ఆదేశం


ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సహా ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు తాజాగా శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఉన్న ఆంధ్రులకు కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఎన్.వోసీని సరిహద్దుల్లోనే పరిశీలించి ఆరోగ్యంగా ఉంటే ఏపీలోకి అనుమతించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక కోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ ప్రభుత్వానికి ఝలక్ అని చెప్పొచ్చు .

ఆరోగ్యంగా లేకపోతే క్వారంటైన్ కు పంపాలని సూచన

ఆరోగ్యంగా లేకపోతే క్వారంటైన్ కు పంపాలని సూచన

నిన్నటికి నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని, ఎవరినీ ఏపీలోకి అనుమతించలేమని తేల్చి చెప్పారు. ఇక జగన్ చెప్పిన దానికి భిన్నంగా వారిని అనుమతించాలని చెప్పింది ఏపీ హైకోర్టు. ఆరోగ్యంగా లేకపోతే క్వారంటైన్ కు తరలించాలని, అంతేకానీ సరిహద్దుల్లో ఆపకూడదని జగన్ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.క్వారంటైన్ అవసరం లేని వారిని గృహనిర్బంధంలోనే ఉంచి ఎప్పటికప్పుడు డాక్టర్లను పర్యవేక్షించేలా చూడాలని జగన్ సర్కారు హైకోర్టు ఆదేశించింది.

English summary
The High Court on Friday issued key directions on those coming from other parts of the country, including Telangana. The AP High Court has made it clear that the KCR government NOC given to Andhra Pradesh in Telangana should be considered within the borders and allowed to enter the AP. The court's directives gave that Jagan's government shock .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X