వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కు షాక్ .. తండ్రి మరణంతో కోడెల కుమార్తె సంచలన నిర్ణయం

|
Google Oneindia TeluguNews

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి స్పీకర్ గా పనిచేసిన, తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా పనిచేసిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఇక ఆయన మరణం అటు టీడీపీ లోనూ,ఇటు కోడెల కుటుంబంలోనూ పెను విషాదాన్ని నింపింది.ఊహించని హఠాత్పరిణామానికి తెలుగు రాష్ట్రాలు షాక్ అయ్యాయి. కోడెల శివప్రసాద్ మరణంతో తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో కోడెల మృతితో నెలకొన్న రాజకీయ వివాదం

ఏపీలో కోడెల మృతితో నెలకొన్న రాజకీయ వివాదం

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆయనపై పెట్టిన కేసుల వల్లే మనస్థాపానికి గురై ఆయన ఆత్మహత్య చేసుకున్నారని మండిపడుతున్నారు. కోడెల మరణానికి నైతిక బాధ్యత వైసిపి నేతలే వహించాలని వారంటున్నారు. ఇక వైసీపీ నేతలు టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలు తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టిడిపి వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే, కేసులతో ఇబ్బంది పడుతున్న కోడెల శివప్రసాదరావు ను చంద్రబాబు అవమానించడం వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

తండ్రి మరణంపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కోడెల కుమార్తె కేసు నమోదు

తండ్రి మరణంపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కోడెల కుమార్తె కేసు నమోదు

ఇదంతా పక్కన పెడితే కోడెల కుమార్తె విజయలక్ష్మి ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

రాజకీయ వేధింపులు తన తండ్రి మరణానికి కారణమని భావించి కోడలు కుమార్తె విజయ లక్ష్మి తన తండ్రి జగన్ ప్రభుత్వం వలనే చనిపోయారని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే తన తండ్రి మరియు సోదరులపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేసారని అందువల్లే తన తండ్రి చనిపోయారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అందువల్ల జగన్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాజకీయ వేధింపులే తన తండ్రి మరణానికి కారణం అన్న కోడెల కుమార్తె

రాజకీయ వేధింపులే తన తండ్రి మరణానికి కారణం అన్న కోడెల కుమార్తె

కోడెల ఆత్మహత్యకు పాల్పడిన నాడే విజయలక్ష్మి తన తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని, రాజకీయ వేధింపులే కారణం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఆమె జగన్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేసి తన తండ్రి మరణానికి కారణం అయిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోపక్క తెలంగాణా పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తులో ఆయన ఆత్మహత్య చేసుకోవటం వల్లే మృతి చెందారని పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది .

 జగన్ ప్రభుత్వం కోడెల కుమార్తె విజయలక్ష్మి ఫిర్యాదుకు ఏం సమాధానం ఇస్తుందో

జగన్ ప్రభుత్వం కోడెల కుమార్తె విజయలక్ష్మి ఫిర్యాదుకు ఏం సమాధానం ఇస్తుందో

ఏపీలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వ వేధింపుల వల్లే తన తండ్రి చనిపోయారని కోడెల కుమార్తె విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్న నేపధ్యంలో మరి జగన్ సర్కార్ విజయలక్ష్మి చేసిన ఫిర్యాదుపై ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలి.ఇప్పటికే కోడెల ఆత్మహత్య వ్యవహారం తమ ప్రభుత్వం మీదకు రాకుండా స్వీయ రక్షణా చర్యలు చేపట్టింది.అందులో భాగంగా టీడీపీ విమర్శలను తిప్పి కొడుతుంది.

English summary
According to the complaint filed at Banjara Hills Police Station, daughter Vijaya Lakshmi has alleged that her father had died in Jagan's government due to political harassment. She said in her complaint that Jagan should take action against the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X