వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌కు అల్లూరి కృష్ణంరాజు ఝలక్..వైసీపీలో రాజోలు మాజీ ఎమ్మెల్యే చేరిక

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుంది, ప్రభావం చూపిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ డ్యామిడ్ కథ అడ్డం తిరిగింది . ప్రశ్నిస్తా అని వచ్చిన పార్టీ ప్రశ్నించటానికే పరిమితం అయ్యింది. జనసేన ఏపీలో ఒక్క స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ పార్టీలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇక పవన్ పార్టీలో ప్రభావం చూపించగల నేతలు కూడా ఓటమి పాలయ్యారు. దీంతో జనసైనికులు నిరాశా నిస్పృహల్లో ఉన్న సమయంలో రాజకీయాలను వీడేది లేదు . నా ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీని ముందుకు నడిపిస్తానని , పార్టీని బలోపేతం చేసి ముందుకు వెళ్తానని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. కానీ పార్టీ పట్ల కీలక నేతల విముఖత వలసల బాట పట్టిస్తుంది. ఇది జనసేనానికి పెద్ద తలనొప్పిగా తయారైంది.

పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన రాజోలు మాజీ ఎమ్మెల్యే

పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన రాజోలు మాజీ ఎమ్మెల్యే

ఏపీలో ఎన్నికలు ముగిసి ఇంత కాలమైనా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఏపీ లోని రాజకీయ పార్టీలు క్షేత్ర స్థాయిలో బలోపేతం కావాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జంపు జిలాని లు పార్టీలు మారుతూనే వున్నారు. ఇక ఏపీలో జగన్ పాలన పై విరుచుకుపడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తూ తాజాగా మాజీ ఎమ్మెల్యే వైసిపి బాటపట్టారు. రాజోలు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ మధ్య వైసీపీలోకి పెరుగుతున్న వలసలు

ఈ మధ్య వైసీపీలోకి పెరుగుతున్న వలసలు

నిన్న మొన్నటి వరకు ఏపీలో టిడిపి నుండి బీజేపీకి వలసలు ఎక్కువగా సాగాయి. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి లోకి వెళ్లడానికి చాలామంది నేతలు ఆసక్తి చూపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ వైసిపి లో చేరాలంటే ఎవరైనా సరే పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే అని చెప్పడంతో చాలామంది నాయకులు బిజెపి వైపు చూసిన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మధ్య బీజేపీలోకి వలసలు తగ్గి వైసీపీలోకి వలసలు పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది.

జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న అల్లూరి కృష్ణంరాజు నిన్నమొన్నటి వరకు జనసేన పార్టీలో రాజోలు నియోజక వర్గంలో కీలక నేతగా ఉన్న అల్లూరి కృష్ణంరాజు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జనసేన పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాజీ శాసనసభ్యుడు అల్లూరి కృష్ణంరాజు పార్టీ మారుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారడం జనసేనని పవన్ కళ్యాణ్ కు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇక అల్లూరి కృష్ణంరాజు విషయానికి వస్తే ఆయన గతంలో రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంచి పేరున్న నాయకుడు. మంచి వ్యాపారిగా కూడా స్థానికంగా ఆయనకు గుర్తింపు ఉంది .రాజోలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డు నియోజకవర్గంగా మారడంతో గత ఎన్నికల్లో అక్కడినుండి రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించారు.

నిన్నమొన్నటి వరకు జనసేన పార్టీలో రాజోలు నియోజక వర్గంలో కీలక నేతగా ఉన్న అల్లూరి కృష్ణంరాజు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జనసేన పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాజీ శాసనసభ్యుడు అల్లూరి కృష్ణంరాజు పార్టీ మారుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారడం జనసేనని పవన్ కళ్యాణ్ కు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇక అల్లూరి కృష్ణంరాజు విషయానికి వస్తే ఆయన గతంలో రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంచి పేరున్న నాయకుడు. మంచి వ్యాపారిగా కూడా స్థానికంగా ఆయనకు గుర్తింపు ఉంది .రాజోలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డు నియోజకవర్గంగా మారడంతో గత ఎన్నికల్లో అక్కడినుండి రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించారు.

మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో వలసలతో పవన్ కు తలనొప్పి

మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో వలసలతో పవన్ కు తలనొప్పి

ఒకపక్క జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఉన్నారు. అలాంటి సమయంలో ప్రస్తుతం రాజోలు నియోజకవర్గంలో పార్టీ పరంగా స్థానికంగా ప్రాధాన్యత ఉన్న అల్లూరి కృష్ణంరాజు పార్టీ వీడడం, వైసిపిలో చేరడం జరిగిపోయాయి. ఈయనతోపాటు పలువురు నాయకులు సైతం వైసీపీలో చేరనున్నట్లుగా తెలుస్తుంది. భవిష్యత్తులో జనసేన పార్టీ నుండి వలసలు మరింత కొనసాగనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొనసాగుతున్న వలసలు పవన్ కు పెద్ద కష్టాన్నే తెచ్చి పెట్టాయి.

English summary
Former Razole MLA Alluri Krishnamraju has joined the YSRCP in the presence of Chief Minister YS Jagan Mohan Reddy in Tadepalli. Along with Krishnamraju, Jana Sena leaders like KSN Raju, K Shekhar and G Manohar also joined the YSRCP. Speaking on the occasion, Krishnamraju said that he will strive for strengthening the YSRCP in Razole Assembly constituency. Rapaka Varaprasada Rao is the sitting MLA from Razole. He won on Jana Sena ticket in previous elections. Rapaka is the alone Jana Sena MLA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X